మనో వైజ్ఞానిక విశ్లేషణ
మనో వైజ్ఞానిక విశ్లేషణ లేదా సైకో అనాలసిస్ అన్నది మానసిక, మానసిక వైద్య సిద్ధాంతాలు, సంబంధిత టెక్నిక్స్ యొక్క కలగలుపు. దీన్ని ప్రఖ్యాత ఆస్ట్రియన్ వైద్యుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ సృష్టించగా, పాక్షికంగా జోసెఫ్ బ్రార్, తదితర మానసిక వైద్యుల క్లినికల్ వర్క్ ద్వారా అభివృద్ధి చెందింది.[1] కాలక్రమేణా, మనో వైజ్ఞానిక విశ్లేషణ పున: పరిశీలించి, వివిధ కోణాల్లో అభివృద్ధి చేయబడింది. కాలక్రమేణా, మనో వైజ్ఞానిక విశ్లేషణ పున: పరిశీలనకు, పలు కోణాల్లో అభివృద్ధికి గురైంది. ఆల్ఫ్రెడ్ ఆడ్లెర్, కార్ల్ జంగ్ వంటి ఫ్రాయిడ్ సహోద్యోగులు, విద్యార్థులు వారి ఆలోచనలు, పరిశోధనలను స్వతంత్రంగా అభివృద్ధి చేయాలని భావించారు. ఐతే ఫ్రాయిడ్ తన స్కూల్ ఆఫ్ థాట్ కు సైకో అనాలసిస్ అన్న పదాన్నే వాడాలని నొక్కిచెప్పారు, ఆడ్లెర్, జంగ్ లతో పాటుగా ఎరిక్ ఫ్రామ్, కరెన్ హోమీ, హారీ స్టాక్ సలివన్ వంటి నియో-ఫ్రాయిడన్లు దీన్ని అంగీకరించారు.[2]
మనో వైజ్ఞానిక విశ్లేషణలోని మౌలిక, విశిష్ట అంశాల్లో ఈ కిందివి ఉన్నాయి:
- వ్యక్తి అభివృద్ధికి కేవలం వారసత్వ లక్షణాలే కాక చిన్నతనంలోని మరచిపోయిన సంఘటనలు తరచుగా ఆధారం అవుతాయి.