మన్నార్ గుడి
మన్నార్ గుడి, ఇది విజయనగరంలో ఉన్న పురాతన దేవాలయం. ఇది విజయనగరం రైల్వే స్టేషన్ నుండి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం సా.శ. 1017-1137 మధ్య కాలంలో భగవత్ రామానుజాచార్య మార్గదర్శకత్వంలో నిర్మించబడింది.[1] దీనిని స్థానికంగా సంతాన గోపాల స్వామి ఆలయం, కొత్త కోవెల లేదా వేణుగోపాల స్వామి అనే పేర్లుతో పిలుస్తారు. తమ కోరికలను నెరవేర్చుకోవాలని కోరుకునే వారిలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ప్రధాన దేవత వార్షిక కల్యాణోత్సవం ఐదు రోజుల ఉత్సవంగా జరుగుతుంది.ఈ ఆలయంలో వైష్ణవ సంప్రదాయమైన పంచరాత్ర ఆగమం ప్రకారం పూజలు జరుగతాయి.[1]వైష్ణవ సంప్రదాయమైన పంచ రాత్ర ఆగమంలో పూజలు నిర్వహించబడే ఏకైక ఆలయం కూడా ఇదే[2].పురాతన మన్నార్ రాజగోపాల స్వామి దేవాలయం విజయనగరం పట్టణంలోని కొత్తపేటలో ఉంది[3]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Mannar Rajagopal Swamy Temple in Vizianagaram Town | Vizianagaram District Website | India". Retrieved 2023-09-13.
- ↑ "Sri Mannar Raja Gopala Swamy Temple - Google Search". www.google.com. Retrieved 2023-09-17.
- ↑ "Sri Mannar Raja Gopala Swamy Temple - Google Search". www.google.com. Retrieved 2023-09-17.