మమత (అస్సామీ సినిమా)

మమత 1973లో విడుదలైన అస్సామీ సినిమా.

నటీనటులు మార్చు

  • రుద్రా బారువా
  • షిబా ఠాకూర్
  • ఇవా అచ్చొ
  • జయ సైకియా
  • మాస్టర్ సోనిత్ కుమార్ సైకియా

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకుడు - నళిన్ దువేరా
  • ఛాయా గ్రహణం - నళింద్ దువేరా
  • సంగీతం - మామిక్‌ బోరా, బసంత బోర్దోలాయ్
  • నిర్మాతలు - నళిన్ దువేరా, ప్రఫుల్ల దత్త, షిబా ఠాకూర్

సినిమా కథ మార్చు

ఒక గ్రామంలో మహేశ్వర్, అతని భార్య ముహిత, పెళ్ళీడుకొచ్చిన అమ్మాయి గొలాపి, అబ్బాయి తకారు వుంటున్నారు. మహేశ్వర్ ఉన్నదున్నట్టు మాట్లాడే స్వభావం గల మనిషే అయినా, తొందరగా బాధపడే స్వభావం కూడా వుంది. ముహిత స్వభావం మెత్తని స్వభావం. భర్తవల్ల ఏర్పడే ఇబ్బందుల్ని ఆమె ఎలాగో ఒకలా సర్దేస్తూ వుంటుంది. ఇంటి పన్లన్నీ ఆమె చాలా శ్రద్ధగా నిర్వర్తిసూ వుంటుంది.

ఒక రోజు భార్యాభర్తల ఇద్దరి మధ్యా ఏదో విషయంగా ఘర్షణ రేగింది. ముహిత భరించలేక, అమ్మాయి గొలాపిని తీసుకుని, తన తల్లిగారింటికి వెళ్ళిపోయింది. తల్లి కూడా ఆ గ్రామంలోనే వుంటున్నది. తకారు మాత్రం తండ్రితో పాటే వుండిపోయాడు.

తకారు ఒంటరిగాడయిపోయాడు. తల్లిని తిరిగి తీసుకురమ్మని తండ్రిని అడగసాగాడు. మహేందర్‌కు కూడా భార్యలేకపోవడం అదోలాగానే వున్నది. ఇంటిపన్లు చక్కబెట్టుకోవడం అతని చేత కావడం లేదు. భార్య వుంటేనే అన్నీ సక్రమంగా వుంటాయని అతను భావిస్తున్నా, లోపల వున్న అహం వల్ల భార్యను పిలుచుకు రావడానికి మనసు ఒప్పడం లేదు.

ముహిత మనస్తత్వం కూడా మారింది. ఆమె కూడా తనకు తానుగా భర్త దగ్గరకు వెళ్ళాలని అనుకోవడం లేదు. కాని, పరిస్థితులు అదోలా మారుతున్నాయి. తాము చేసిన తప్పులవల్ల వచ్చే అనర్థాలు వాళ్ళకు ఆర్థం కాసాగాయి.

తకారు, తండ్రికి ఇంట్లో సహాయపడడానికి బడి ఎగవేస్తున్నాడు. ఆవులను మేపడానికి పొలాలగట్ల వేపు తీసుకు వెళ్ళవలసి వచ్చినప్పుడల్లా అమ్మమ్మ గారింటింటికి వెళ్ళి తల్లిని చూస్తూ వస్తున్నాడు. ఈ సంగతి తండ్రికి తెలిసింది; తకారును కోప్పడ్డాడు. కాని, ముహిత ఇల్లు చక్కబెట్టుకునే విషయంలో తండ్రికి కొన్ని సలహాలు ఇమ్మని, సూచనలు చెయ్యమని తకారుతో చెప్పింది. తకారు ఈ విషయాలు తండ్రితో చెప్పాడు. భార్యకు తన కుటుంబం మీద వున్న మమతానురాగాలు మహేశ్వర్‌కు అర్థమైనాయి. అతని మనసులో వున్న అహం తగ్గసాగింది. అయినా అతను పైకి ముభావంగానే వుంటున్నాడు. తల్లిని చూడ్డానికి తకారుకు పూర్తి స్వేచ్ఛ మాత్రం ఇచ్చాడు.

ఆ గ్రామంలోనే బయన్ అనే వ్యక్తి, అతని కుమారుడు కొన్లోరా వుంటున్నారు. కొన్లోరా, గొలాపి ఒకరికొకరు మనసు ఇచ్చుకున్నారు. సత్రమ్‌ అనబడే ఇంకో వ్యక్తి ఆ గ్రామంలో రౌడీలాంటివాడు. అతని కొడుకు దేబన్. దేబన్ కూడా చదువు సంధ్యలకు స్వస్తి చెప్పి, గ్రామంలో అల్లర్లు చేస్తూ అందరికీ ఇబ్బందులు కలిగిస్తున్నాడు. అతను గొలాపికి, కొన్లోరాకూ కూడా ఇబ్బందులు కలిగించసాగాడు.

తల్లిదండ్రుల ఎడబాటును తకారు సహించలేకపోయాడు. వాడి ద్వారా దూరమైన మహేశ్వర్, మూహితలు మళ్ళీ కలుసుకున్నారు.

సత్రమ్‌, దేబన్‌లు ఇద్దరూ గ్రామంలో చాలా చెడ్డపేరు సంపాయించుకున్నారు. గ్రామీణులంతా కలిసి వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నారు. కాని, గ్రామంలో గౌరవింపబడుతున్న మహేశ్వర్ అడ్డం వచ్చి దేబన్‌ను, అతని తండ్రినీ కాపాడాడు. తాము చేసిన అక్రమాలను క్షమించమని వాళ్ళు ప్రాధేయపడ్డారు.

మమతానురాగాలు అందర్నీ కలిపాయి. అవే ఆ గ్రామాన్ని స్వర్గధామం చేశాయి.[1]

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. సంపాదకుడు (1 November 1974). "మమత". విజయచిత్ర. 9 (5): 39.