మరుగు స్థానం అనగా సాధారణ వాతారవరణ పీడనం వద్ద ఒక ద్రవ పదార్థం ఆవిరిగా మారడానికి అవసరమైన స్థిర ఉష్ణోగ్రత.[1] .ఈ ఉష్ణోగ్రత వద్ద ద్రవం బాష్పపీడనం దాని పరిసర వాతావరణ పీడనం బాష్ప పీడనంతో సమానంగా ఉంటుంది. [2][3] ఒక ద్రవం యొక్క మరూ స్థానం శూన్యంలో తక్కువగాను, అధిక పీడనం ఉన్న ప్రదేశాలలో ఎక్కువగాను ఉంటుంది. అనగా ఇది చుట్టూ వున్న వాతావరణ పీడనం మీద ఆధారపడి వుంటుంది.[4]

మరుగుతున్న నీరు


తక్కువ పీడనం వద్ద గల ద్రవ పదార్థ మరుగు స్థానం సాధారణ వాతావరణ పీడనం వద్ద దాని మరుగు స్థానం కన్నా తక్కువ ఉంటుంది. సముద్ర మట్టం వద్ద సాధారణ వాతావరణ పీడనం వద్ద నీటి మరుగు స్థానం 99.97 °C (211.95 °F), కానీ 1,905 మీటర్లు (6,250 అ.) పైకి పోయినపుడు దాని మరుగు స్థానం 93.4 °C (200.1 °F) ఉంటుంది. [5]

సాధారణ పీడనం వద్ద వివిధ ద్రవ పదార్థాలు వేర్వేరు మరుగు స్థానాలను కలిగి ఉంటాయి.

ఒక ద్రవం బాష్పపీడనం సముద్రమట్టం వద్ద వాతావరణ పీడనానికి ( 1 ఎట్మాస్పియర్) సమానంగా ఉండటం సాధారణ మరుగు స్థానం (దీనిని వాతావరణ మరుగుస్థానం లేదా వాతావరణ పీడన మరుగు స్థానం అని కూడా అంటారు) యొక్క ప్రత్యేక సందర్భం.[6][7]

మూలాలు

మార్చు
  1. Joachim Buddrus und Bernd Schmidt (2015). Grundlagen der Organischen Chemie (De Gruyter Studium) (5. Auflage ed.). De Gruyter. ISBN 978-3-110-30559-3. Seite 79
  2. Goldberg, David.E. (1988). 3,000 Solved Problems in Chemistry (First ed.). McGraw-Hill. ISBN 0-07-023684-4. Section 17.43, page 321
  3. Theodore L, Dupont RR, Ganesan K, eds. (1999). Pollution Prevention: The Waste Management Approach to the 21st Century. CRC Press. ISBN 1-56670-495-2. Section 27, page 15
  4. Danielle Baeyens-Volant et Nathalie Warzée (2015). Chimie générale - Exercices et méthodes. Dunod. ISBN 978-2-100-72073-6. pp. 179-184
  5. "Boiling Point of Water and Altitude". www.engineeringtoolbox.com.
  6. General Chemistry Glossary Purdue University website page
  7. Reel, Kevin R.; Fikar, R. M.; Dumas, P. E.; Templin, Jay M. & Van Arnum, Patricia (2006). AP Chemistry (REA) – The Best Test Prep for the Advanced Placement Exam (9th ed.). Research & Education Association. section 71, p. 224. ISBN 0-7386-0221-3.