మల్చింగ్
మొక్క చుట్టూ వ్యాపించి ఉన్న వేరు వ్యవస్థను ఏదైనా పదార్థంతో కప్పడాన్నే మల్చింగ్ అం టారు.
ఈ పద్ధతి ద్వారా సాగునీటిని ఆదా చేయవచ్చు.
మల్చింగ్ కోసం వరి పొట్టు, రంపపుపొట్టు, చెరకుపిప్పి, ఎండిన ఆకులు, చిన్నచిన్న గులకరాళ్లను వాడుతుం టారు.
వరి గడ్డి, చెరుకు పిప్పి, కొబ్బరి పీచు వంటి ఏ సేంద్రియ (కాలక్రమంలో కుళ్లి భూమిలో కలిసిపోయే) పదార్థంతోనైనా మల్చింగ్ చేయవచ్చు.
పీకేసిన కలుపు మొక్కలు, రాలిన ఆకులు, చొప్ప కూడా ఉపయోగించవచ్చు.
మల్చింగ్ ఉపయోగాలు
మార్చుమల్చింగ్ ద్వారా భూసంరక్షణ సాధ్యమవుతుంది. భూసారం పెరుగుతుంది.
ఎండ వేడిమి నేరుగా భూమికి తగలకపోవడం వల్ల నేలలోని తేమకు, సూక్ష్మజీవులకు నష్టం లేదు.
వర్షం కురిసేటప్పుడు చినుకులు నేరుగా కుండీ, మడిలోని నేలను ఢీకొట్టడం వల్ల కలిగే నేలగట్టిదనాన్ని తప్పించుకోవచ్చు.
వర్షపు నీరు పక్కలకు పోవడానికి ఆకులు, గడ్డి మొదలైనవి అడ్డుతగలటం వల్ల భూమిపై ఎక్కువసేపు తచ్చాడుతూ నేలలోకి ఇంకుతాయి.
భూమిపై కప్పే ఆకులు మొదలైన సేంద్రియ పదార్థాలు కుళ్లిపోతుంది. ఈ ప్రక్రియలో అది నేలకు పోషకాలను అందిస్తుంది. మల్చ్ ద్వారా నేలకు సూక్ష్మపోషకాలన్నీ సమపాళ్లలో అందుతాయి.
నేలపై మల్చ్ ఉంచడం ద్వారా కలుపును అదుపులో ఉంచవచ్చు. 5 సెం.మీ. మందం మల్చింగ్ వే స్తే కలుపు 90 శాతం తగ్గుతుంది.