మల్టీమీటర్

(మల్టిమీటర్ నుండి దారిమార్పు చెందింది)

మల్టీమీటర్ లేదా మల్టీటెస్టర్ ఇంకా VOM (వోల్ట్-ఓమ్ మీటర్) గా కూడా పిలవబడే ఇది ఒక విద్యుత్ కొలత పరికరం. దీనొక్క దానిలోనే విద్యుత్ ను అనేకరకాలుగా కొలుచు ఫంక్షన్లు కలిసి ఉంటాయి. టైపికల్ మల్టీమీటర్ వోల్టేజి, విద్యుత్ ప్రవాహం, నిరోధకతను కొలిచే సామర్థ్యం వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉంటుంది. అనలాగ్ మల్టీమీటర్లు మైక్రోఅమ్మీటర్ గా ఉపయోగించబడతాయి, దీని పాయింటర్ స్కేల్ క్రమాంకనం పై కదులుతూ విభిన్న కొలతలను చూచిస్తాయి. డిజిటల్ మల్టీమీటర్లు కొలచిన విలువను సంఖ్యలుగా, ఏ ప్రమాణంలో కొలవబడిందో కూడా డిస్‌ప్లే బార్ లో చూపిస్తాయి. డిజిటల్ మల్టీమీటర్లు ఇప్పుడు చాలా సర్వసాధారణం కానీ అనలాగ్ మల్టీమీటర్లు కొన్ని సందర్భాల్లో ఇప్పటికీ ఉత్తమంగా ఉన్నాయి, ఉదాహరణకు వేగంగా మారే విలువలను పరిశీలించే సమయంలో అనలాగ్ మల్టీమీటర్లు మారే విలువలను వెనువెంటనే చూపిస్తాయి.

అనలాగ్ మల్టీమీటర్
A 4 1/2 అంకెల డిజిటల్ మల్టీమీటర్
మల్టీమీటర్ టెస్ట్ లీడ్స్.

మల్టీమీటర్ చేతికి అబ్బగలిగిన పరికరం, అందువలన దీనిని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్ళవచ్చు, కాబట్టి సంబంధిత రంగంలో తప్పులను గుర్తించేందుకు, పని రంగం కొరకు తీసుకువెళ్ళి ఉపయోగిస్తారు. అలాగే దీనిని బెంబ్ పై లేదా అనువైన చోట పెట్టుకొని పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువుల లోపాలను గుర్తిస్తూ సరిచేస్తారు. ఇంకా సంబంధిత పని రంగంలో పనులు చేస్తున్నపుడు దోషాలు రాకుండా నిర్వర్తించుటకు చాలా అధిక స్థాయి వరకు కొలిచి ఖచ్చితత్వ విలువలనిచ్చేందుకు ఇవి ఉపయోగపడతాయి. వీటిని ఎలక్ట్రానిక్ పరికరాలు, మోటారు నియంత్రణలు, గృహొపకరణాలు, విద్యుత్ సరఫరాలు, వైరింగ్ వ్యవస్థలు వంటి పారిశ్రామిక, గృహ పరికరాల విస్తృత పరిధిలో విద్యుత్ సంబంధిత సమస్యలను పరిష్కరించటానికి ఉపయోగించవచ్చు.

మల్టీమీటర్లు ఫీచర్ల, ధరల యొక్క విస్తృత శ్రేణులలో అందుబాటులో ఉన్నాయి. చౌకరకపు మల్టీమీటర్లు 500 రూపాయల కంటే తక్కువ ధరలలో ఉన్నాయి, అయితే ధ్రువీకృత క్రమాంకణముతో ప్రయోగశాల గ్రేడ్ నమూనాలు 3 లక్షల రూపాయల కంటే ఎక్కువ ధర లోనూ ఉన్నాయి.