మల్లాది సూర్యనారాయణ

మల్లాది సూర్యనారాయణ రంగస్థల రచయిత, దర్శకుడు, నటుడు, కళాకారుల సేవ చేస్తున్న వ్యక్తి.[1] ఆయన రంగస్థలంపై నటునిగా, దర్శకరచయితగా పలు నాటకాలు వ్రాసి ఆడి పేరుప్రతిష్టలు పొందారు. జీవితంలోని తర్వాతి దశలో రంగస్థలంపై ఓ వెలుగు వెలిగిన కళాకారులు దీనాతిదీనంగా జీవించడం చూసి వారికోసం నటరాజ కళాపీఠం అనే సంస్థను నెలకొల్పి వారి జీవితాల్లో సాంత్వన చేకూరుస్తున్నారు. అవిచ్ఛిన్నంగా 300 నెలలకు పైగా కొనసాగిన ఈ కార్యక్రమాన్ని సూర్యనారాయణ దాతల సహాయంతో ఒంటిచేతిమీదుగా నడిపిస్తున్నారు.

మల్లాది సూర్యనారాయణ

వ్యక్తిగత జీవితం

మార్చు

మల్లాది సూర్యనారాయణ ప్రభుత్వ రంగ పాఠశాలల్లో పనిచేసి రిటైర్ అయ్యారు.

నాటకరంగంలో

మార్చు

మల్లాది సూర్యనారాయణ రంగస్థలంపై దర్శకునిగా, రచయితగానే కాక నటునిగా కూడా ప్రసిద్ధిపొందారు. ఆయన వ్రాసిన పలు నాటకాలు పరిషత్తుపోటీల్లో బహుమతులు సాధించాయి. ఆ రోజుల్లో హరిశ్చంద్ర పాత్రను ఇద్దరు ప్రముఖులు పోషించేవారు. ఒకరు డీ. వీ. సుబ్బారావు అయితే రెండవ వారు మల్లాది సూర్యనారాయణ[2].[3]

మూలాలు

మార్చు
  1. "రంగస్థల రాణి - Navatelangana". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2021-04-05.
  2. Admin (2021-03-31). "తెలుగునాట నటరత్నాలు ఎందరో !". Tharjani (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-04-05.
  3. gotelugu.com. "maathanga kanyaam mansaa smaraami | Gotelugu.com". gotelugu.com. Retrieved 2021-04-05.

ఇతర లింకులు

మార్చు