మల్లిపురం జగదీష్
మల్లిపురం జగదీష్ సవర తెగకు చెందిన తెలుగు రచయిత. అతను రాసిన లఘు కథలు పదిహేనేళ్లుగా వివిధ తెలుగు పత్రికలలో ప్రచురితమయ్యాయి. సిలకోల (2011), గురి (2018) అనే రెండు రచనలు సంకలనాలుగా ప్రచురించబడ్డాయి. తెలుగులో "దుర్ల" కవితా సంపుటిని కూడా ప్రచురించాడు. అతని కథలు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు భాగానికి చెందిన స్థానిక ప్రజల జీవితాలను, మారుతున్న కాలం తో పాటు స్థానికేతర సమూహాల రాక వారిని ఎలా ప్రభావితం చేశాయో వర్ణిస్తాయి. అతను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ నిధులతో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు.[1]
అప్పాజోస్యుల-విష్ణుభొట్ల ఫౌండేషన్ వారు 2024 కి గాను అవార్డు ఇచ్చిన వారిలో “విశిష్ట గిరిజన కథా సాహిత్య” పురస్కార గ్రహీత అతను. [2]
జీవిత విశేషాలు
మార్చుమల్లిపురం జగదీష్ పూర్వపు శ్రీకాకుళం జిల్లా లోని గుమ్మలక్ష్మీపురం (పార్వతీపురం మన్యం జిల్లా) సమీపంలోని పి.ఆమిటి గ్రామంలో 1973 నవంబరు 14న జన్మించాడు. అతని పూర్తి పేరు మల్లిపురం జగదీశ్వర రావు. [3] ఐ.టీ.డీ.ఏ.లో ఉపాధ్యాయులుగా (ఆంగ్ల ఉపాధ్యాయులు) అతను ప్రాథమిక విద్యను అభ్యసించిన పాఠశాలలోనే (టిక్కుబాయిలో) పని చేస్తున్నాడు. అతను రచించిన కథలను గాయం, శిలకోలా, గురి అనే కథా సంకలనాలుగా ముద్రించబడ్డాయి. వారి స్వీయ అనుభవాలు అనుభూతులను గిరిజనుల వాస్తవ పరిస్థితులను అద్దం పట్టే విధంగా వారి కథలు రచన చేయబడ్డాయి.
వారి తొలి కథా సంకలనంలో మొత్తం పదిహేను కథలున్నాయి. మరో కథా సంకలనం అయినా గురిలో పదమూడు కథలున్నాయి. వీరి కథలను చదవడం ద్వారా గిరిజనుల జీవన విధానం అలాగే వారి బతుకు వ్యదలను గమనించవచ్చు. వీరి కథల గురించి కారా మాస్టారు ముందు మాట రాస్తూ “ఈ రెండో తరం స్ఫూర్తితో కలం పట్టిన మూడో తరం వారిలో మల్లిపురం జగదీష్ ఒకడు. అతను గిరిజనుల తెగకు చెందినవాడు అయినందున అక్కడ గతంలోనూ వర్తమానంలోనే ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలుసుకో గోరే వారికి అతని రచనలు అమూల్యాలనిపిస్తాయి. [4]
రచనలు
మార్చుపుస్తకాలు
మార్చుకథలు
మార్చుకథ | పత్రిక | పత్రిక అవధి | ప్రచురణ తేది | సంపుటి |
---|---|---|---|---|
'టిహిలి'కి పెళ్లి | వార్త | ఆదివారం | 2010-08-15 | |
అక్షరాల దారిలో | ఉత్తరాంధ్ర | మాసం | 2001-07-01 | |
ఇప్పమొగ్గలు | పుస్తకం | ప్రత్యేకం | 2016-01-24 | పాతికేళ్ల కథ 1990-2014 (కథాసాహితి/మనసు ఫౌండేషన్) Vol.2 |
కలలు కాలుతున్న వాసన | ప్రజాసాహితి | మాసం | 2002-08-01 | |
కళ్లం | వార్త | ఆదివారం | 2010-04-25 | |
గాయం | వార్త | ఆదివారం | 2008-06-29 | |
దాడి | ప్రస్థానం | త్రైమాసిక | 2008-07-01 | |
పొరలు | విపుల | మాసం | 2007-11-01 | |
శిలకోల | ఆంధ్రజ్యోతి | ఆదివారం | 2009-05-24 | |
శిలకోల | పుస్తకం | ప్రత్యేకం | 2016-01-24 | పాతికేళ్ల కథ 1990-2014 (కథాసాహితి/మనసు ఫౌండేషన్) Vol.2 |
అతని కథాంశాలు
మార్చుమల్లిపురం జగదీష్ కథల ద్వారా గిరిజనుల జీవితాలను ప్రాథమిక విద్య నుండి వారి జీవిత పర్యాంతం వివిధ సందర్భాల వరకు, పోడు వ్యవసాయదారులుగా, ఉద్యోగులుగా, వారి అమాయకత్వాన్ని, వారి సంస్కృతి సంప్రదాయాలను, వారిలో అభివృద్ధి పేరిట వచ్చిన సౌకర్యాలు అయిన టీ.వి. మోటారు సైకిలు, చెడు అలువాట్లు, రుణ భారం పోడు వ్యవసాయ రైతైనా, ఉద్యోగి అయినా అదే రకమైన జీవనం గడుపుతూ అనేక సమస్యలను ఎదుర్కోటున్నారు. వారి యదార్థ జీవిత గాథలనే కథలుగా మలిచారని తెలుస్తుంది. గిరిజనులు ఈ నాటికి వివక్షను ఎదుర్కోటుంనారు స్వయంగా విద్యావంతుడు సాహిత్యరంగంలో తనదైన ముద్రను కనబరిచిన కథకుడు అయిన మల్లిపురం జగదీష్ గారు కూడా ఒక సందర్భంలో తనుకు ఎదురైనా వివక్ష అనుభవం గురించి స్వయంగా ఆయన గోదావరి అంతర్జాల సాహిత్య మాసపత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో తెలిపాడు[4].
మూలాలు
మార్చు- ↑ "Jagadeesh Mallipuram – Out Of Print Magazine" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-10-17.
- ↑ "మల్లిపురం జగదీశ్ కథలకి ఆంగ్లానువాదం ఎందుకు?". sowmyawrites .... (in ఇంగ్లీష్). 2024-02-09. Retrieved 2024-10-17.
- ↑ "మల్లిపురం జగదీశ్వర రావు - కథానిలయం". kathanilayam.com. Retrieved 2024-10-17.
- ↑ 4.0 4.1 పత్రిక, విహంగ మహిళా. "మల్లిపురం జగదీష్ శిలకోల కథలు – గిరిజన జీవన విధానం డాక్టర్. పోలా బాల గణేష్ |" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-10-17.
- ↑ ప్రభాకర్, ఎ కె (2023-12-09). "యుద్ధభూమిలోనిలబడి.. - కొలిమి". kolimi.org (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-10-17.
- ↑ "'నా పేరు సొంబరా ' – మల్లిపురం జగదీష్ గారు". Harshaneeyam (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-11-25. Retrieved 2024-10-17.