మహబూబ్‌నగర్ పురపాలకసంఘం

మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పురపాలక సంఘం
(మహబూబ్‌నగర్ పురపాలక సంఘం నుండి దారిమార్పు చెందింది)

మహబూబ్‌నగర్ పట్టణ పాలక సంస్థ అయిన మహబూబ్‌నగర్ పురపాలక సంఘము జిల్లాలోని 11 పురపాలక/నగర పంచాయతీలలో పెద్దది. 1952లో మూడవశ్రేణి పురపాలక సంఘంగా ఏర్పడింది. 1959లో రెండోగ్రేడుగా, 1983లో మొదటి గ్రేడుగా, 2004లో స్పెషల్ గ్రేడుగా అప్‌గ్రేడ్ చెందింది. 2012లో సమీపంలోని 10 పంచాయతీలు ఈ పురపాలక సంఘం పరిధిలో చేర్చి సెలెక్షన్ గ్రేడు పురపాలక సంఘంగా మార్చారు. దీన్ని నగరపాలక సంస్థగా చేయాలనే ప్రతిపాదనను కూడా ప్రభుతానికి పంపిననూ వాస్తవరూపం దాల్చలేదు.

జనాభా

మార్చు

పురపాలక సంఘం పరిధిలో 2001 నాటికి జనాభా 130986 కాగాం 2011 నాటికి 157902కు పెరిగింది.

ఆదాయము

మార్చు

2010-11 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ సంఘం ఆదాయం 703.70 లక్షలు, వ్యయము 603.28 లక్షలు.[1]

ఎన్నికలు

మార్చు

ఈ పురపాలక సంఘాణికి 1952లో తొలిసారిగా ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టికి చెందిన శంకర్ రావు తొలి చైర్మెన్‌గా ఎన్నికయ్యారు.[2] అప్పటినుంచి 10 సార్లు ఎన్నికలు జరిగాయి. 2014, మార్చి 30న మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-03-13. Retrieved 2014-03-09.
  2. ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా మినీ, తేది 08-03-2014