మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్

మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022 మార్చి 23న తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[1]

మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్

పదవీ కాలం
2022 మార్చి 23 – 07 డిసెంబర్ 2023

వ్యక్తిగత వివరాలు

జననం 1980
మహబూబ్‌నగర్‌ పట్టణం, మహబూబ్‌నగర్‌ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
నివాసం మహబూబ్‌నగర్‌ పట్టణం

రాజకీయ జీవితం

మార్చు

ఇంతియాజ్‌ ఇషాక్‌ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, 1991లో మహబూబ్‌నగర్‌ పట్టణ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా, 1994 నుండి 96 వరకు ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుండి 2008 వరకు జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, 2008లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2011లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ఇంతియాజ్‌ ఇషాక్‌ ఆ తరువాత మదీనా ఎడ్యుకేషన్‌ సొసైటీలో కార్యదర్శిగా, ముస్లిం సంఘం ఫౌండర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.

ఇంతియాజ్‌ ఇషాక్‌ 2016లో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితుడై 2016, 2020లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఇన్‌చార్జిగా, అసెంబ్లీ ఎన్నికల్లో, వరంగల్‌ లోక్‌సభ ఎన్నికల్లో, హుజురాబాద్‌, నాగార్జునసాగర్‌ ఎన్నికల్లో, మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఇన్‌చార్జిగా పని చేసి పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అభ్యర్థుల గెలుపులో కీలకంగా పని చేశాడు. ఆయన 2022 మార్చి 23న తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[2][3]

ఇవి కూడా చుడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (24 March 2022). "మూడు కార్పొరేషన్లకు చైర్మన్లు". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.
  2. Prabha News (23 March 2022). "3 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.
  3. Namasthe Telangana (24 March 2022). "ఇంతియాజ్‌ ఇసాక్‌కు గుర్తింపు". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.