మహరాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం

మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్‌ క్రికెట్ స్టేడియం పంజాబ్‌లోని మొహాలిలోని ముల్లన్‌పూర్‌లో ఉన్న క్రికెట్ స్టేడియం. మార్చి 2010లో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ మొహాలిలోని ముల్లన్‌పూర్ గ్రామంలో ₹230 కోట్ల (US$29 మిలియన్లు) వ్యయంతో 41.95 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించారు. ఈ స్టేడియంలో 2024 మార్చి 23న ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ జట్ల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి మ్యాచ్ జరిగింది.[1]

పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) పరిధిలోకి వచ్చే స్టేడియానికి 1934లో భారతదేశం తరపున కేవలం ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిన, ఇటలీలో భారత రాయబారిగా కొనసాగిన తొమ్మిదవ & చివరి పాలక మహారాజా అయిన పాటియాలా యాదవీంద్ర సింగ్ పేరు పెట్టారు.[2]  

నిర్మాణం

మార్చు

మాజీ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ మరియు బీసీసీఐ అద్యక్ష్యుడు ఐ.ఎస్ బింద్రా 2010లో ప్లాన్ చేశారు. ముల్లన్‌పూర్ వేదిక 2017లో నిర్మాణ పనులు ప్రారంభించి 2020 నాటికి అందుబాటులోకి తేవాలని భావించారు, అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆలస్యం అయ్యింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (గత రెండు సీజన్లలో 23 మ్యాచ్‌లు), విజయ్ హజారే ట్రోఫీ (2021-22 సీజన్‌లో ఐదు) అలాగే ఈ జనవరిలో ఒక రంజీ ట్రోఫీతో సహా 2021 నుండి ఇది ఇప్పటికే అనేక దేశవాళీ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది.[3]

స్థానం

మార్చు
కోణం వివరాలు
చిరునామా మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం, ముల్లన్‌పూర్, చండీగఢ్ సమీపంలో, పంజాబ్
సౌలభ్యాన్ని నేషనల్ హైవే 5, నేషనల్ హైవే 205 ద్వారా సులభంగా చేరుకోవచ్చు; సమీప నగరం: చండీగఢ్ (సుమారు 20 కి.మీ)
సమీప విమానాశ్రయం చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సుమారు 25 కి.మీ)
సమీప రైల్వే స్టేషన్ చండీగఢ్ రైల్వే స్టేషన్ (సుమారు 22 కి.మీ)
ప్రజా రవాణా ఎంపికలు చండీగఢ్ నుండి సాధారణ బస్సు సేవలు; టాక్సీ మరియు ఆటో-రిక్షా సేవలు అందుబాటులో ఉన్నాయి
పార్కింగ్ సౌకర్యాలు VIPలు, సాధారణ ప్రేక్షకుల కోసం ప్రత్యేక జోన్‌లతో వాహనాలకు విశాలమైన పార్కింగ్ అందుబాటులో ఉంది
సీటింగ్ కెపాసిటీ దాదాపు 38,000 మంది ప్రేక్షకులు

మూలాలు

మార్చు
  1. Andhrajyothy (23 March 2024). "కొత్త స్టేడియంలోపంజాబ్‌ పోరు ఆరంభం". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
  2. Hindustan Times (29 March 2021). "Mohali's Mullanpur stadium named after Maharaja Yadavindra Singh" (in ఇంగ్లీష్). Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
  3. ESPNcricinfo (25 March 2024). "Inside the Maharaja Yadavindra Singh Stadium, Punjab's new open-air venue in Mullanpur" (in ఇంగ్లీష్). Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.