మహాకవి డైరీలు

గురజాడ అప్పారావు డైరీ

మహాకవి డైరీలు (ఆంగ్లమునకు తెలుగు) విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ వారు 1954 సంవత్సరంలో ముద్రించారు. దీని రెండవ ముద్రణ 1961 లో విడుదలైనది. దీనికి అవసరాల సూర్యారావు గారు ముందుమాటను రచించారు.

ఇందులో మహాకవి గురజాడ అప్పారావు గారి డైరీలోని విశేషాంశాలను యధాతధంగా ముద్రించారు. మహాకవి తన డైరీని 1889 సంవత్సరం నుండి 1915 లో మరణించే వరకు రాశారు.

ఇందులో అప్పారావు నిర్యాణం తర్వాత అప్పటి పెద్దల సంతాప సందేశాలను చేర్చారు.

బయటి లింకులుసవరించు