మహాత్మా గాంధి నేషనల్ ఫెలోషిప్

మహాత్మాగాంధి నేషనల్ ఫెలోషిప్ భారత కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు ఐఐఎం వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కార్యక్రమం.[1] [2]

మహాత్మా గాంధి నేషనల్ ఫెలోషిప్
స్థాపన2020
రకంవిద్య, ఉపాధి
కార్యస్థానం
  • జాతీయ
సేవా ప్రాంతాలుభారతదేశం
జాలగూడుhttps://www.iimb.ac.in/mgnf

చరిత్ర సవరించు

రోజుకో కొత్త రంగు పులుముకుంటున్న ప్రపంచంలో వివిధ విషయాలలో నైపుణ్యత కలిగిన వారు అవసరమని గ్రహించిన భారత కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహకారంతో దేశంలోని ప్రతి జిల్లాలో జిల్లా నైపుణ్యాభివృద్ధి కమిటీని బలోపేతం చేస్తూ దేశంలో నైపుణ్యాభివృద్ధి అలాగే సమారంభకత సూచీ అభివృద్ధి చేయాలని 2020లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.[3]

ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి సారిగా 2020 లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మొదటి దఫాలో 69 మంది విద్యార్థులని తీసుకోవడం జరిగింది. ఆ తరువాత 2021 లో రెండవ దఫా ప్రారంభించడం జరిగింది, 2021 సంవత్సరానికి గాను 661 ఫెల్లోలను దేశంలోని వివిధ జిల్లాలకు పంపడం జరిగింది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక ఫెల్లోని నియమించడం జరిగింది.[4]

వివరాలు సవరించు

ఈ కార్యక్రమంలో విద్యార్థులు/ఫెల్లోలు రెండు సంవత్సరాల పాటు వారికి కేటాయించిన ఐఐఎం లలో పౌర/బహిరంగ విధానం (పబ్లిక్ పాలసీ) విద్యనభ్యసిస్తూ వారు నియమింపబడ్డ జిల్లాలలో పని చేస్తుంటారు. అయితే ఈ కార్యక్రమ శైలి ఇతర విద్యలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుంది, ఫెల్లోలు తమ తమ జిల్లాలలో ఉంటూ ప్రతి వంద రోజులకి ఒకసారి రెండు వారాల పాటు కళాశాలలో శిక్షణ పొందుతారు.

అర్హతలు సవరించు

  • ఈ ఫెలోషిప్ కి దరఖాస్తు చేసుకోవడానికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
  • సామాజిక సేవకి సంబందించిన అనుభవం కలిగి ఉండటం పరిగణించబడుతుంది.
  • ఫెల్లోలు పని చేయాలనుకునే రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ భాష వచ్చి ఉండాలి.

మూలాలు సవరించు

  1. "Skill Ministry rolls out MGNF: Fellows to be trained by IIMs, monthly stipend up to Rs 60,000". The Indian Express (in ఇంగ్లీష్). 2021-02-13. Retrieved 2022-09-10.
  2. "NEP allows school dropouts to complete their education while skilling themselves, says Education Minister Pradhan". Edex Live (in ఇంగ్లీష్). Retrieved 2022-09-10.
  3. DelhiFebruary 16, India Today Web Desk New; February 16, 2021UPDATED:; Ist, 2021 04:49. "IIM Bangalore announces national roll-out of Mahatma Gandhi National Fellowship". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-09-10.{{cite web}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  4. "Explained: Mahatma Gandhi National Fellowship Phase-II". Jagranjosh.com. 2021-10-29. Retrieved 2022-09-10.