మహాన్
మహాన్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్. ఎస్. లలిత్ కుమార్ ఎస్. ఎస్. లలిత్ కుమార్ ఈ సినిమాకు కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. విక్రమ్, ధ్రువ్ విక్రమ్, సిమ్రాన్, బాబీ సింహా, వాణీ భోజన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2022 ఫిబ్రవరి 3న[1], అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 2022 ఫిబ్రవరి 9న విడుదలైంది.[2]
మహాన్ | |
---|---|
దర్శకత్వం | కార్తీక్ సుబ్బరాజ్ |
రచన | కార్తీక్ సుబ్బరాజ్ |
నిర్మాత | ఎస్. ఎస్. లలిత్ కుమార్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | శ్రేయాస్ కృష్ణ |
కూర్పు | వివేక్ హర్షన్ |
సంగీతం | సంతోష్ నారాయణన్ |
నిర్మాణ సంస్థ | సెవెన్ స్క్రీన్ స్టూడియో |
పంపిణీదార్లు | అమెజాన్ ప్రైమ్ వీడియో |
విడుదల తేదీ | 10 ఫిబ్రవరి 2022 |
సినిమా నిడివి | 162 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చు40 ఏళ్ల పాటు మద్య నిషేధానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన కుటుంబంలో గాంధీ మహాన్ (విక్రమ్) జన్మించాడు. చిన్నతనంలో పేకాటకు అలవాటు పడ్డ గాంధీ మహాన్ తండ్రి మందలింపుతో దాన్ని వదిలేసి ఉన్నత చదువు చదివి ఆ తర్వాత కామర్స్ లెక్చలర్ గా సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఈ క్రమంలో ఆయనకు జీవితం మీద విరక్తి పుట్టి భార్య ఝాన్సీ (సిమ్రాన్) - దాదా (ధ్రువ్ విక్రమ్) ఇంట్లో లేని సమయంలో తనకు నచ్చినట్లుగా జీవించే ప్రయత్నం చేసి ఇంటికి తిరిగొచ్చిన ఝాన్సీ (సిమ్రాన్)కు దొరికిపోయి దాని వల్ల ఇద్దరి మధ్య గొడవలు జరిగి భార్యా బిడ్డకు దూరమై ఒంటరివాడవుతాడు. ఆ తరువాత తన మిత్రుడు సత్యవాన్ (బాబీ సింహా)తో కలిసి మద్యం వ్యాపారం మొదలెట్టి లిక్కర్ కింగ్ గా ఎదుగుతాడు. దాని తరువాత మహాన్ కి ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే మిగతా సినిమా కథ.[3][4]
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: సెవెన్ స్క్రీన్ స్టూడియో
- నిర్మాత: ఎస్. ఎస్. లలిత్ కుమార్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తిక్ సుబ్బరాజ్
- సంగీతం: సంతోష్ నారాయణన్
- సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణ
- స్టంట్స్: దినేష్ సుబ్బరాయన్
- ఎడిటర్: వివేక్ హర్షన్
మూలాలు
మార్చు- ↑ 10TV (3 February 2022). "మహాన్ ట్రైలర్.. లెక్చరర్ లిక్కర్ కింగ్‌గా ఎందుకు మారాడు? | Mahaan Official Telugu Trailer." (in telugu). Archived from the original on 12 February 2022. Retrieved 12 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Sakshi (8 February 2022). "ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే కొత్త చిత్రాలివే." Archived from the original on 12 February 2022. Retrieved 12 February 2022.
{{cite news}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 11 ఫిబ్రవరి 2022 suggested (help) - ↑ Eenadu (11 February 2022). "రివ్యూ: మహాన్". Archived from the original on 12 February 2022. Retrieved 12 February 2022.
{{cite news}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 10 ఫిబ్రవరి 2022 suggested (help) - ↑ A. B. P. Telugu (10 February 2022). "'మహాన్' రివ్యూ: తండ్రీ కొడుకుల మధ్య యుద్ధంలో విజయం ఎవరిది?". Archived from the original on 12 February 2022. Retrieved 12 February 2022.