మహారాష్ట్ర ఎక్స్‌ప్రెస్

11039 / 11040 మహారాష్ట్ర ఎక్స్‌ప్రెస్ గోందియా జంక్షన్, కొల్హాపూర్ ల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది గోండియా జంక్షన్ నుండి కొల్హాపూర్ వరకు రైలు నంబర్ 11040గాను, ఎదురు దిశలో రైలు నంబర్ 11039గానూ నడుస్తుంది.

మొత్తం 1,348 km (838 mi) దూరంతో ఒకే రాష్ట్రంలో (పూర్తిగా మహారాష్ట్రలో) అత్యధిక దూరం నడిచే రైలుగా రికార్డును కలిగి ఉంది.

ఈ రైలుకు మహారాష్ట్ర రాష్ట్రం పేరు పెట్టినప్పటికీ,. ఇతర రాష్ట్రాల పేర్లతో నడిచే కేరళ ఎక్స్‌ప్రెస్, తమిళనాడు ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ మొదలైన వాటి లాగా, ఇది రాష్ట్ర, జాతీయ రాజధానుల మధ్య నడిచే రైలు కాదు.

సేవ మార్చు

11039 గోండియా-కొల్హాపూర్ మహారాష్ట్ర ఎక్స్‌ప్రెస్ 1,348 km (838 mi) దూరాన్ని 28 గంటల 45 నిమిషాలలోను (సగటు వేఘం 46.82 km/h (29 mph)) తిరుగు దిశలో 28 గంటల 25 నిమిషాల లోనూ (సగటు వేగం 47.37 km/h (29 mph)) కవర్ చేస్తుంది.

రెండు దిశలలో దాని సగటు వేగం 55 km/h (34 mph) కంటే తక్కువగా ఉంది భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, దీనికి ఎక్స్‌ప్రెస్ సర్‌ఛార్జి లేదు.

ఇది పూణే జంక్షను వద్ద దిశను మార్చుకుంటుంది.