" గన్-యు మిత్ " అని కూడా పిలువబడే " గ్రేట్ ఫ్లడ్ ఆఫ్ గన్-యు" (సిజెకెవి)(గన్-యు మహావరద)[1] ఇది పురాతన చైనాలో ఒక ప్రధాన వరద సంఘటన. ఇది కనీసం రెండు తరాల పాటు కొనసాగిందని పేర్కొనబడింది. దీని ఫలితంగా జనాభా స్థానభ్రంశం చెందడంతో తుఫానులు, కరువు వంటి విపత్తులు సంభవించాయి. విపత్తుల కారణంగా ప్రజలు తమ నివాసాలను వదిలి ఎత్తైన కొండలు, పర్వతాలలో, చెట్ల మీద గూడు కట్టుకుని నివసించారు.[2] పౌరాణిక, చారిత్రక ఆధారాలను అనుసరించి ఇది సాంప్రదాయకంగా యావో చక్రవర్తి పాలనలో క్రీ.పూ. మూడవ సహస్రాబ్ది లేదా క్రీ.పూ 2300-2200 నాటిదని భావిస్తున్నారు.

అయినప్పటికీ పసుపు నది మీద సంభవించిన వరద పురావస్తు ఆధారాలు, గత 10,000 సంవత్సరాలలో ప్రపంచంలో ఇలాంటి తీవ్రమైన సంఘటనలతో పోల్చవచ్చని భావించబడుతుంది. ఇది సుమారు క్రీ.పూ 1900 నాటిది. సాంప్రదాయ జియా రాజవంశం (చక్రవర్తులు షును యావో) ప్రారంభం కంటే కొన్ని శతాబ్దాల తరువాత సంభవించిందని ఇది పురాణాలకు ఆధారం అని సూచించబడింది.[3]


చారిత్రాత్మకంగా లేదా పౌరాణికంగా చూస్తే ఇది గొప్ప వరద కథ. దానిని నియంత్రించడానికి, విపత్తును తగ్గించడానికి వివిధ మానవ పాత్రల వీరోచిత ప్రయత్నాలు చైనా సంస్కృతికి ప్రాథమికమైన కథనంగా మారాయి. ఇతర విషయాలతోపాటు జియా రాజవంశం, జౌ రాజవంశం రెండింటి స్థాపన చరిత్రను అర్థం చేసుకోవడంలో చైనా గొప్ప వరద కీలకపాత్ర వహిస్తుంది. ఇది చైనా పురాణాలలో ప్రధాన వరద మూలాంశాలలో ఒకటిగా ప్రస్తావించబడింది. శాస్త్రీయ చైనా కవిత్వం దీని ప్రస్తావనకు ప్రధాన వనరుగా ఉంది.

విశ్లేషణ మార్చు

 
ఈ వివరణా చిత్రం పౌరాణిక మహావరదను, చైనాలోని 9 ప్రొవింసులను చూపిస్తుంది

మాహావరద కథ చైనా పురాణాలలో నాటకీయ పాత్ర పోషిస్తుంది. దాని వివిధ వెర్షన్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వరద పురాణ మూలాంశానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. చైనా పురాణాల్లోని వరద కథనాలు కొన్ని సాధారణ లక్షణాలను పంచుకుంటాయి. అంతర్గత అనుగుణ్యతలో కొంత లోపం ఉన్నప్పటికీ వివిధ మాయా పరివర్తనాలు, నోవా వంటి దైవిక లేదా పాక్షిక దైవిక జోక్యాలను కలిగి ఉంది.[4] ఉదాహరణకు వరద సాధారణంగా "మానవ పాపానికి సార్వత్రిక శిక్ష" కాకుండా సహజ కారణాల వల్ల వస్తుంది.[5] చైనా గొప్ప వరద పురాణం మరొక ప్రత్యేకమైన ఉద్దేశ్యం విపత్తును తగ్గించడానికి వీరోచితమైన, ప్రశంసనీయమైన ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇవ్వడం;[6] యు గ్రేట్ కందకాలు ఆనకట్టలను (గన్ ప్రయత్నాలు వంటివి) నిర్మించడం, కాలువలను త్రవ్వడం (వంటివి) నిర్వహించాడు. ఇప్పటికే ఉన్న కాలువలను వెడల్పు చేయడం, లోతు చేయడం, ఈ నైపుణ్యాలను ఇతరులకు నేర్పడం వంటివి నిర్వహించబడ్డాయి.[7]

మరో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే వరద విపత్తు ఉన్నప్పటికీ నాగరికత అభివృద్ధి సాధించి మానవ పరిస్థితిని మెరుగుపరచడం.[8] పోరాటం, మనుగడ, చివరికి ఉప్పొంగే సమస్యలను అదుపులో ఉంచుతూ భూ నిర్వహణ, మృగాలను నియంత్రించడం, వ్యవసాయ పద్ధతుల పరంగా కూడా చాలా పురోగతి సాధించబడింది. ఇతర పరిణామాలు కథనానికి సమగ్రమైనవి. వరద అత్యవసర నిర్వహణ దాని తక్షణ ప్రభావాల కంటే మానవ ఆరోగ్యం, సామాజిక శ్రేయస్సు కోసం అవలంభించిన విస్తృత విధానాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. పురాణాల ప్రకారం సామాజిక అభివృద్ధికి సమగ్రమైన విధానం ఫలితంగా విస్తృత-స్థాయి సహకారంతో వరదలను నియంత్రించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయడమే కాకుండా చైనా మొదటి రాష్ట్రమైన జియా రాజవంశం (ca. క్రీ.పూ 2070 - ca. క్రీ.పూ 1600) స్థాపించబడింది.

చారిత్రికత మార్చు

చరిత్రపూర్వ చైనా గొప్ప వరద కథనం ఈ యుగంలో సామాజిక అభివృద్ధి మీద కొంత అవగాహన కల్పిస్తుంది. ఈ కథనంలో గన్ (తండ్రి)-యు (కుమారుడు) కథ వివిధ సంస్కరణలు, వాటి వైరుధ్యమైన విజయం - వైఫల్యం ఉన్నాయి. గన్ (తండ్రి), ఆయన యు (కుమారుడు)మధ్య తేడాలు త్క్కువగా ఉన్నాయని డేవిడు హాక్సు వ్యాఖ్యానించాడు. హాక్సు ఒక సామాజిక సాంకేతిక పరివర్తన వివరణను ప్రతిపాదించాడు. ఈ సందర్భంలో గన్ మునుపటి సాంకేతిక దశలో ఒక సమాజాన్ని సూచిస్తుంది. ఇది చిన్న తరహా వ్యవసాయంలో నిమగ్నమై ఉంటుంది. దీనిలో ఉపనదులతో సహా పసుపు నది వ్యవస్థ వరద మైదానాలలో ఉన్న చిత్తడి నేలలలో తగినంత వ్యవసాయ భూమిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ దృక్పథం "అద్భుతంగా విస్తరిస్తున్న" జిరాంగు మట్టి ఒక రకమైన తేలియాడే తోటను సృష్టించడానికి సహకరిస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇది సారవంతమైన నేల, బ్రషువుడు, ఇలాంటి పదార్థాలతో రూపొందించబడింది. వరదను నియంత్రించడంలో యు చేసిన కృషి భవిష్యత్తు సమాజానికి ప్రతీకగా ఉంటుంది. ఇది సాంకేతిక ఆవిష్కరణలను కలిగి ఉంది. చిత్తడి నేలలను వ్యవసాయ క్షేత్రాలుగా మార్చడానికి చాలా పెద్ద ఎత్తున విధానాన్ని రూపొందించడానికి అనుమతిస్తుంది. వ్యవసాయపరంగా దోపిడీకి గురయ్యే క్షేత్రాలకు అనుకూలంగా మొత్తం చిత్తడి ప్రాంతాలను శాశ్వతంగా తొలగించడానికి ఇంజనీరింగు చేయబడిన ఒక గ్రిడ్డి డ్రైనేజీ వ్యవస్థ రూపొందించడం పౌరాణిక వర్ణనలలో కనిపించే ప్రకృతి దృశ్యం అద్భుత పరివర్తనలను గురించి హాక్సు వివరిస్తాడు.[9]

ఇటీవలి పురావస్తు భౌగోళిక ఆవిష్కరణలు గొప్ప వరద కథ మీద కొంత ప్రభావం చూపవచ్చు.[10] పసుపు నది మీద పెద్దగా సంభవించిన వరదలకు పురావస్తు ఆధారాలు క్రీ.పూ 1920 లో నాటివి. వరద తరువాత సృష్టించబడిన పురాణాలకు ఇది ఆధారం అని సూచించబడింది. భారీ కొండచరియలు నదికి అడ్డంగా విరిగిపడి సహజమైన ఆనకట్టను సృష్టించాయి. ఒక సంవత్సరం తరువాత నదీజలాల ప్రవాహాల ఉధృతితో సమజనిర్మితమైన ఆనకట్ట ధ్వంశం అయింది. ఫలితంగా వచ్చిన వరద నదితో 2,000 కి.మీ (1,200 మైళ్ళు) ప్రయాణించి ఉండవచ్చు. ఫలితంగా నది కాలువలలో సంభవించిన అస్థిరత ఇరవై సంవత్సరాల వరకు కొనసాగి ఉండవచ్చు. ఈ సమయంలో నియోలిథికు పసుపు నది లోయలో కాంచు యుగానికి దారితీసింది. సాంప్రదాయకంగా అనుకున్నదానికంటే చాలా శతాబ్దాల తరువాత ఇది జియా ప్రారంభంతో మొదలైందని. జియా రాజవంశం స్థాపనతో ఎర్లిటౌ సంస్కృతి, కంచుయుగం ప్రారంభం మొదలైందని పురావస్తు పరిశోధనలు ప్రత్యక్షనిదర్శనంగా ఉన్నాయని చరిత్రకారులు సూచిస్తున్నారు.[11]

కాలనిర్ణయం మార్చు

 
The Xihe brothers receive orders from emperor Yao to organise the calendar

ఈ పత్రాల సేకరణతో కూడిన "రెండవ గ్రంధసంకలనం" ("కొత్త" గ్రంథాల)లో ఒకటి అయినప్పటికీ " బుక్కు ఆఫ్ హిస్టరీ (షుజింగు) " లోని "కానన్ ఆఫ్ యావో" ("యాయోడియన్") చారిత్రక విలువను కలిగి ఉందని చరిత్రకారుడు " కెసి వు" అభిప్రాయపడ్డారు. వారి భావవ్యక్తీకరణ సమస్యాత్మక స్వభావం ఉన్నప్పటికీ, అవి "మొదటి" లేదా "పాత" సంకలనంతో పోలిస్తే, పునర్నిర్మించబడడం, భారీగా సవరించబడడం, ఇతర అంశాలు చొప్పించబడడం చేయబడినట్లు కనిపిస్తాయి. ఇవి " క్విన్ మంటలు (పుస్తకాలను తగలబెట్టడం, ఖననం చేయడం పండితులందరూ క్విను ఇంపీరియలు లైబ్రరీని దాని రాజవంశం పతనం తరువాత కాల్చడం ద్వారా నాశనం చేశారు). మొదటి సంకలనం పత్రాలు ఒక శతాబ్దం పాటు దాచబడ్డాయి. తరువాత అనుకోకుండా కనుగొనబడి అవి కన్ఫ్యూషియసు వారసుడికి అప్పగించబడ్డాయి. "యాయోడియను" మూలప్రతులకు ప్రత్యక్ష కాపీ కాదని " వు " అంగీకరించినప్పటికీ ఇది మొదటి సంకలనం పత్రాల మాదిరిగానే అదే ప్రామాణికమైన మూలాల మీద ఆధారపడి ఉందని వాదించాడు. బహుశా మూలప్రతుల ఆధారంగా కొంతవరకు విస్తరణ కూడా జరిగి ఉండవచ్చు. అయినప్పటికీ " కెసి వు " పేర్కొన్న "యావోసు కానను" అదనపు-వచన నిర్ధారణ (మిగిలిన రెండవ సంకలన పత్రాలు) గ్రేటు వరద కాలనిర్ణయం చేయడానికి నేరుగా సంబంధం కలిగి ఉంది. ప్రత్యేకంగా ఇది క్రీ.పూ. 2200 సంవత్సరం నాటిదని భావించబడింది. ఇది రచనను ఖగోళ డేటాను ఆధునిక ఖగోళ లేదా ఖగోళ భౌతిక విశ్లేషణతో పోల్చడం మీద ఆధారపడి నిర్ణయించబడింది. [12]

తన పాలన ప్రారంభంలో యావో ఒక సంస్కరించబడిన క్యాలెండరు కోసం అవసరమైన ఖగోళ పరిశీలనలు చేయడానికి నలుగురు మంత్రులను అధికారులు (ఇరువురు సోదరులు కలిగిన రెండు జతలు)గా నియమించబడ్డారు. ఈ వ్యక్తులలో ప్రతి ఒక్కరు రాజ పరిమితిలో ఉన్న భూభాగాలకు పంపబడ్డారు. అక్కడ వారు సూర్యాస్తమయం వద్ద కొన్ని నక్షత్రాలను, అయనాంతాలు, విషువత్తులను గమనించవలసి వాటి ఆధారంగా ఫలితాలను పోల్చవచ్చు. తదనుగుణంగా క్యాలెండరు సర్దుబాటు చేయబడింది. కె. సి. వు ఇద్దరు ఆధునిక ఖగోళ శాస్త్రవేత్తల నుండి సూచనలను ఉదహరించారు. ఇవి యావో పాలనకాలాన్ని సుమారు క్రీ.పూ. 2200 గా ధృవీకరిస్తున్నాయి. ఇది సాంప్రదాయంగా అంగీకరించబడిన డేటింగుకు ఇది అనుగుణంగా ఉంటుంది.[13]

యావో, ఆయన పాలన దృష్ట్యా, ఖచ్చితమైన ఖగోళ పరిశీలనలకు ఈ సాక్ష్యం పురాణాల రంగంలో పురావస్తు శాస్త్రం చొరబాటుగా అర్థం చేసుకోవచ్చు; మరో మాటలో చెప్పాలంటే పురాతన ఖగోళ పరిశీలనలు ఇతర మార్గాలలో పౌరాణిక విషయాలలో చేర్చబడ్డాయి.

మూలాలు మార్చు

  1. Yang, An & Turner 2005, p. 74.
  2. Strassberg 2002.
  3. Wu et al. 2016.
  4. Christie 1968, pp. 83–91.
  5. Christie 1968, p. 83.
  6. Yang, An & Turner 2005, p. 117.
  7. Christie 1968, p. 83.
  8. Yang, An & Turner 2005, p. 117.
  9. Hawkes 1985, pp. 138–139.
  10. Webb, Jonathan (4 August 2016). "Rocks tell story of China's great flood" – via www.bbc.com.
  11. Wu et al. 2016.
  12. Wu 1982, pp. 35–44, 66–67, and 450-467. Especially 465.
  13. Wu 1982, pp. 66-67 and 467.