మహా వీర మయూర
మహావీర మయూర 1975లో విడుదలైన తెలుగు సినిమా. ఇది కన్నడ సినిమా మయూరకు డబ్బింగ్ సినిమా. ఇది విజయ్ దర్శకత్వం వహించిన చారిత్రిక నాటక చిత్రం.[1] ఈ సినిమా కన్నడ నటుడు రాజ్ కుమార్ నటించిన గుర్తింపు పొందిన చిత్రాలలో ఒకటి. ఈ చిత్రంలో రాజ్ కుమార్ కాదంబ సామ్రాజ్య మహారాజు మయూర శర్మ పాత్రలో నటించాడు. ఈ చిత్రం బ్రాహ్మణ యువకుడైన మయూర జీవితాన్ని వర్ణిస్తుంది. అతను తన రాజ వారసత్వాన్ని కనుగొనడం ద్వారా అప్పటి పల్లవ రాజ్య సింహాసనాన్ని అధిరోహించేందుకు తన విధిని తెలుసుకుంటాడు. దేవుడు నరసింహ శాస్త్రి రాసిన "మయూర" నవల ఆధారంగా [2] ఈ చిత్రం నిర్మాణం జరిగింది. ఇందులో అనేక సన్నివేశాలను మైసూరు పాలెస్ వద్ద చిత్రీకరించారు. ఈ చిత్రం మైసూరు పాలెస్ లోపల చిత్రీకరణ చేసిన చిత్రలలో చివరిది. ఈ చిత్రం 30 వారాల పాటు ఆడింది.[3][4] ఇది కన్నడ గర్వానికి ప్రతీకగా చాలామంది భావిస్తారు.
మహా వీర మయూర (1975 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | రాజశ్రీ సినీ ఎంటర్‌ప్రైజెస్ |
---|---|
భాష | తెలుగు |
ఈ చిత్రం మొదట కన్నడ భాషలో "మయూర"గా నిర్మించబడి, తెలుగులో "మహావీర మయూర" గా, మలయాళ భాషలో "రాజా మయూర వర్మ"గా డబ్బింగ్ చేయబడింది.
బాహుబలి చిత్రం యొక్క ప్రధాన కథాంశం - హీరోకి తన జన్మ రహస్యం తెలియకపోవడం, అతను రాజకుటుంబానికి చెందినవాడని, గ్రామంలో ఒంటరిగా జీవిస్తున్నాడని - ఈ సినిమా నుండి ప్రేరణ పొందినట్లు నివేదించబడింది.[5][6]
తారాగణం
మార్చు- రాజ్‌కుమార్ - మయూరశర్మ అనే యువ బ్రాహ్మణుడు, పల్లవ పాలకులకు వారి రాజులలో ఒకరిచే అవమానించబడినప్పుడు వారిని వ్యతిరేకించాడు.
- శ్రీనాథ్ : పల్లవుల యువరాజుగా,
- వజ్రముని,
- మధుకేశ్వరుడిగా బాలకృష్ణ,
- ప్రేమవతిగా మంజుల
- షాదననశర్మగా కె.ఎస్.అశ్వత్
- రంగా జెట్టిగా ఎం. పి.శంకర్
- కొత్వాల్‌గా తూగుదీప శ్రీనివాస్
- నరసింహదుత్త / జడగా శక్తి ప్రసాద్
- వీరశర్మగా సంపత్
- రాజా శంకర్
- రాజానంద్ రాజు శివస్కందవర్మన్‌గా
- మల్లయోధుడు చెలువగా టైగర్ ప్రభాకర్
మూలాలు
మార్చు- ↑ "Kannada Movie Database – Mayura". Allmoviedatabase.com. Archived from the original on 20 మార్చి 2012. Retrieved 29 November 2021.
- ↑ "ರಾಜ್ ಹಬ್ಬ: ವರನಟನ ಕಾದಂಬರಿ ಚಿತ್ರಗಳ ಕನ್ನಡಿ". Udayavani.com.
- ↑ ":: Welcome to Chitatara ::". 17 July 2007. Archived from the original on 17 July 2007. Retrieved 29 November 2021.
- ↑ "Sandalwood Blockbuster hits". Sandalwoodking.rocks. 17 May 2011. Archived from the original on 11 నవంబరు 2018. Retrieved 16 జనవరి 2023.
- ↑ "Baahubali copied from Rajkumar's Mayura? - Times of India". The Times of India.
- ↑ "'Baahubali' Story Leaked: Movie Inspired by Kannada Classic 'Mayura'?". International Business Times. 8 July 2015.