మహిళా పారిశ్రామికవేత్తలు

మహిళా పారిశ్రామికవేత్తలు గా మహిళల ఉనికి పెరగడం  ప్రపంచ దేశాలలో గణనీయమైన వ్యాపార, ఆర్థిక వృద్ధికి దారితీసింది. మహిళా యాజమాన్యంలోని వ్యాపార సంస్థలు ఆయా దేశాలలో  ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ దేశ శ్రేయస్సుకు ఎంతగానో దోహదపడుతున్నారు. దేశ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల్లో మహిళలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నారు. మహిళా ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన దోహదకారిగా చాలాకాలంగా గుర్తించబడింది. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను విస్మరించి ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొననివ్వకపోతే దేశ వృద్ధి చాలా మందకొడిగా సాగుతుంది[1].

మహిళా పారిశ్రామిక వేత్తలు - అమెరికన్ స్పేస్ మాడ్రిడ్

నిర్వచనం

మార్చు

మహిళా పారిశ్రామికవేత్తలను ఒక వ్యాపార సంస్థను ప్రారంభించే, నిర్వహించే ఒక మహిళ లేదా మహిళల సమూహంగా అని నిర్వచించవచ్చు. ఒక వ్యాపార సంస్థ గురించి ఆలోచించి, ప్రారంభించి, ఉత్పత్తి కారకాలను నిర్వహించి, మిళితం చేసి, సంస్థను నిర్వహించి, శ్రమ, సమస్యలను అధిగమించి, పరిశ్రమను నడపడంలో ఇమిడి ఉన్న ఆర్థిక అనిశ్చితిని నిర్వహించే మహిళలను మహిళా పారిశ్రామికవేత్తలు అని అంటారు[2].

చరిత్ర

మార్చు

అమెరికాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల స్ఫూర్తి సజీవంగా ఉంది, అక్కడ అన్ని వర్గాల ప్రజలు తమ స్వంత వ్యాపారాలను చేయడానికి, అందులో విజయం సాధించడానికి అనుకూల వాతావరణం ఉంది. మహిళా పారిశ్రామికవేత్తలకు అమెరికాలో మంచి ప్రాతినిధ్యం ఉంది.

ఎలిజా లూకాస్ పింక్నీ యునైటెడ్ స్టేట్స్లో మొట్టమొదటి మహిళా పారిశ్రామికవేత్త. 1739 సంవత్సరంలో, పింక్నీ దక్షిణ కరోలినాలోని తన కుటుంబ తోటలలో పనిచేయడం ప్రారంభించింది. కరీబియన్ లో నివసిస్తున్న ఉన్నత తరగతి వలసవాది జార్జ్ లుకాస్ పెద్ద కుమార్తె పింక్నీ. తండ్రి ఆమెను దక్షిణ కరోలినాకు పంపినప్పుడు, పింకీ వృక్షశాస్త్రం పట్ల మక్కువ పెంచుకుని, ఆ తోటల ద్వారా తన కుటుంబ సంపదను పెంచడంపై దృష్టి పెట్టడం జరిగింది. పింకీ తన కుటుంబానికి చెందిన వాపూ ప్లాంటేషన్ నిర్వహించడానికి, పంటలను పర్యవేక్షించడానికి అవిశ్రాంతంగా పనిచేసింది. ఈ ప్రాంతంలో ఇండిగో సాగుతో ప్రయోగాలు చేసి కొన్ని ప్రయోగాలు, లోపాలతో మొక్కను విజయవంతంగా పెంచగలిగారు. 1989లో దక్షిణ కరోలినా బిజినెస్ హాల్ ఆఫ్ ఫేమ్ లో తన రాష్ట్రంలో వ్యవసాయానికి చేసిన కృషికి గాను పింకీని మరణానంతరం చేర్చారు.

అంతర్జాతీయ సమాజాలలో క్రమక్రమంగా సామాజిక ఆలోచనలు మరింత ప్రగతిశీలంగా మారి, స్త్రీవాదం ప్రారంభించింది. 1920 లో మహిళలు ఓటు హక్కును పొందినప్పుడు, ఇతర వృత్తిపరమైన కార్యకలాపాలకు  మార్గం ఏర్పడినది.  మహిళలు తమ డబ్బును ఎలా నిర్వహించాలో నేర్చుకోగలిగారు, మహిళా పారిశ్రామికవేత్తలు అధికారం, ప్రభావాన్ని పొందారు. 1918 లో ఒక ఎంప్లాయిమెంట్ ఏజెన్సీ ప్రారంభించబడింది, ఇది మహిళలకు పనిని కనుగొనడంలో సహాయపడటంపై దృష్టి సారించింది. మహా మాంద్యం సమయంలో, కొంతమంది మహిళలు ఆర్థిక పోరాటాలను తట్టుకోవడానికి వారి స్వంత వ్యాపారాలను ప్రారంభించారు. ఎక్కువ మంది మహిళలు శ్రామిక శక్తిలోకి ప్రవేశించడానికి సహాయపడటంలో రెండవ ప్రపంచ యుద్ధం కూడా కీలక పాత్ర పోషించింది[3].

అభివృద్ధి

మార్చు

1900 ల ప్రారంభంలో, మేడమ్ సి.జె.వాకర్, కోకో చానెల్, ఆలివ్ ఆన్ బీచ్, మా పెర్కిన్స్ వంటి మహిళా పారిశ్రామికవేత్తలు తమ ప్రారంభాన్ని పొందారు. ఈ మహిళలు తమ స్వంత బ్రాండ్లను స్థాపించి, మహిళా వ్యాపార యజమానులను వేధిస్తున్న వివక్ష, అన్యాయమైన వేతనాలు, కళంకాలను ఎదుర్కొని విజయం కోసం పోరాడారు. ఇప్పటి వరకు ఈ బ్రాండ్లు అమెరికా ప్రారంభ మహిళా ప్రముఖుల వారసత్వాన్ని చెప్పడానికి మనుగడతో ఉన్నాయి.

రెండవ ప్రపంచ యుద్ధం మహిళా వ్యవస్థాపకతకు ప్రారంభం కాదు ఎందుకంటే, మహిళలు శతాబ్దాలుగా వస్తువులను కనుగొంటున్నారు, వారి స్వంత వ్యాపారాలను సృష్టిస్తున్నారు. అమెరికన్ శ్రామిక శక్తిలోకి మహిళలు అపూర్వ సంఖ్యలో ప్రవేశించిన సమయాన్ని ఇది సూచిస్తుంది. 1940 నుండి 1945 వరకు, శ్రామిక శక్తిలో అంతరాలను విడిచిపెట్టి పురుషులతో సమంగా, రక్షణ రంగములో సైనికులుగా చేరిక కారణంగా పనిచేసే మహిళల శాతం దాదాపు 10% పెరిగింది. మహిళలు బట్టలు కుట్టడం నుండి విమానాల మరమ్మతుల వరకు వివిధ వృత్తులలో రాణించడం జరిగింది. ఈ సమయంలో మహిళా పారిశ్రామికవేత్తలు వృద్ధి చెందారు, విస్తృత శ్రేణి గృహ ఆధారిత వ్యాపారాల నుండి ఆదాయాన్ని సంపాదించారు. యుద్ధం ముగిసిన తరువాత, చాలా మంది తమ వ్యాపారాలను కొనసాగించి, స్వతంత్రముగా ఆదాయాన్ని సంపాదించారు. 1910లో అమెరికన్ బ్యూటీ ఇండస్ట్రీని ఒంటరిగా స్థాపించిన మహిళ ఎలిజబెత్ ఆర్డెన్. యుద్ధానంతరం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ రాజధానుల్లో రెడ్ డోర్ సెలూన్లు తెరుచుకోవడంతో ఆమె సామ్రాజ్యం ఊపందుకుంది. ఈ రోజు, ఎలిజబెత్ ఆర్డెన్ ఫ్రాంచైజీ ఇప్పటికీ నాణ్యత, హస్తకళ పరంగా ప్రధానమైనది[4].

1960, 70 దశకాల్లో మహిళలు తమ రాజకీయ, సామాజిక జీవితాలలో పెనుమార్పులు రావడం, ఇందులో విడాకుల సంఖ్య పెరగడం, పనిచేసే ఒంటరి మహిళల (తల్లుల) పెరుగుదలకు దారితీసింది. చాలా మంది మహిళలు ఎంటర్ప్రెన్యూర్షిప్ను ఆదర్శవంతమైన పరిష్కారంగా చూశారు. అమెరికన్ ఫెమినిస్ట్ ఉద్యమం చివరికి పనిప్రాంతంలో మహిళలలకు వచ్చే అడ్డంకులను విచ్ఛిన్నం చేసింది, సమాజం వాటిని అంగీకరించడానికి మహిళలు గృహిణులుగా ఉండాలనే ఆలోచనను విడిచిపెట్టింది. మహిళలు చట్టపరమైన హక్కులను సంపాదించారు, మహిళలు కార్యదర్శులుగా, ఉపాధ్యాయులు, నర్సులు వంటి సాధారణ ఉద్యోగాల నుండి పెద్ద వ్యాపార రంగాన్ని అన్వేషించడం ప్రారంభించారు.

మహిళలు ఇంటి వెలుపల వృత్తిపరమైన సంతృప్తిని కోరుకోవడం ప్రారంభించినప్పుడు, మేరీ కే యాష్ ఈ యుగంలో అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తలలో ఒకరు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇంటింటికీ వెళ్లి పుస్తకాలు అమ్మేది. 1945 లో భర్త యుద్ధం నుండి తిరిగి వచ్చినప్పుడు ఆమె విడాకులు తీసుకోవడం, 1963 లో, మేరీ కే యాష్ స్టాన్లీ హోమ్ ప్రొడక్ట్స్ నుండి పదవీ విరమణ చేసి తన స్వంత వ్యాపార ప్రణాళికను చేసుకుని, తన కుమారుల సహాయంతో మేరీ కే (ఇప్పుడు మేరీ కే కాస్మెటిక్స్, ఇంక్ అని పిలుస్తారు) చే బ్యూటీ పరిశ్రమను స్థాపించింది. ఈ వ్యాపారం సౌందర్య పరిశ్రమను కుదిపేసింది.

1980 నుంచి 2000 వరకు వందలాది మంది మహిళలు ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా గుర్తింపు పొందారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ముఖచిత్రాన్ని 'అమెరికాస్ స్మార్ట్ బిజినెస్ ఉమెన్'గా అభివర్ణించిన మడోన్నా నుంచి మార్తా స్టీవార్ట్, ఓప్రా వరకు వ్యాపారవేత్తలు వెలుగులోకి వచ్చారు. పెద్ద పెద్ద పనులు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న మహిళల సాటిలేని శక్తిని ప్రపంచం గుర్తించడం ప్రారంభించింది.

1988లో కాంగ్రెస్ మహిళా వ్యాపార యాజమాన్య చట్టాన్ని ఆమోదించింది. ఇందులో ప్రధానంగా వ్యాపార పత్రాలపై భర్త సంతకం అవసరమయ్యే కాలం చెల్లిన చట్టాలను, బ్యాంకు రుణ వివక్షను తొలగించింది. మహిళా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ కాంట్రాక్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించింది. ఈ చట్టం మహిళా పారిశ్రామికవేత్తల విజయానికి సహాయపడింది, వారి వ్యాపార ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి విధానాలను, కార్యక్రమాలను అందించి, అమెరికన్ పురుషులు, మహిళల మధ్య పనిప్రాంత సమానత్వానికి నాంది పలికింది.

21 వ శతాబ్దంలో మహిళా పారిశ్రామికవేత్తలు పెరిగినా, ఇప్పటికి సమాజంలో  వ్యాపార యజమానుల నుంచి వేతనం, లింగ వివక్షను ఎదుర్కొంటున్నారు. అయినా   పురుషుల కంటే మహిళలు మీడియా, వ్యాపారం, రాజకీయాలు తదితర రంగాల్లో రాణిస్తున్నారు. జీఈ బిజినెస్ ఇన్నోవేషన్స్ సీఈఓ బెత్ కామ్స్టాక్ నుంచి మీడియా దిగ్గజాలు టేలర్ స్విఫ్ట్, జెన్నిఫర్ లారెన్స్ వరకు మహిళలు ఆధునిక మార్కెట్లో తమ పాత్రలను పునర్నిర్వచిస్తున్నారు. ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన మహిళా పారిశ్రామికవేత్తలలో ఓప్రా విన్ఫ్రే, బియాన్సే, లూసీ పెంగ్, సోఫియా వెర్గారా,  షెరిల్ శాండ్ బర్గ్ ఉన్నారు. మహిళలు సిస్కో, బార్క్ అండ్ కో, స్లైడ్ షేర్, ఫ్లిక్కర్, బిల్డ్-ఎ-బేర్, ప్రోయాక్టివ్ వంటి టాప్ బ్రాండ్లను స్థాపించారు.

సమస్యలు

మార్చు

మహిళా పారిశ్రామిక వేత్తలకు సమస్యలు ఉన్నప్పటికీ, అందులో అనేక మంది విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఉన్నారు, అందులో వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను సమతుల్యం చేస్తూ తమ వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. ఆర్థికాభివృద్ధికి మహిళా వ్యవస్థాపకత ప్రాముఖ్యతను విస్తృతంగా గుర్తించారు. ఆర్థిక వృద్ధి, అభివృద్ధిపై మహిళా పారిశ్రామికవేత్తల సానుకూల ప్రభావాన్ని అనేక అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. మహిళలు తమ వ్యాపార రంగాలలో వారికి వ్యాపారాన్ని ప్రారంభించడంలో పెట్టుబడిదారులను కలిగి ఉండటం చాలా ముఖ్యమైనది లేదా అంతర్భాగం, ఫండింగ్ అనేది స్టార్టప్ లలో ముఖ్య మైనది. ఆర్థిక సహకారం లేని ప్రముఖ వెంచర్లలో మహిళల వ్యాపారాలు ఉన్నాయి. చాలా సంస్థలు మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం చేయడం కంటే పురుష యాజమాన్యంలోని వాటికే పెట్టుబడులను పెడుతున్నాయి. మహిళలకు ఉండే బాధ్యతలలో వారికి కుటుంబం, జీవిత భాగస్వామి, పిల్లలు, అనేక ఇతర బాధ్యతలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని సమతుల్యం చేయడం తరచుగా కష్టమవుతుంది, కుటుంబం నుండి మద్దతు లేనివారికి ఇది చాలా కష్టం. సమాజంలో వ్యాపారంలో నష్ట పోయిన, విఫలమైన పురుషుడిని చుట్టుపక్కల ప్రజలు సులభంగా అంగీకరిస్తారు. మహిళల విషయానికి వస్తే, ప్రజలు విఫలమైనందుకు వారిని ఎదో రకంగా బాధ పెడతారు. లింగ అసమానత అనేది మహిళా పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న అన్ని సవాళ్లలో ఒకటి, అననుకూల వాతావరణం మహిళలు ఎదుర్కొనే ప్రధాన అవరోధాలలో ఒకటి. కొన్ని చోట్ల, మహిళలు వ్యాపారాన్ని కలిగి ఉన్నప్పుడు కూడా ఒప్పందాలు చేసుకోవడానికి, సంప్రదింపులు జరపడానికి లేదా వ్యాపార ముఖంగా ఉండటానికి వారికి పురుష భాగస్వామి అవసరం. మహిళలలకు చదువు లేకపోవడం, చాలా దేశాల్లో ఆడపిల్లల చదువుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. సృజనాత్మక ఆలోచనల మూలాలను కనుగొనడానికి, ఈ ఆలోచనలను సంస్థలుగా మార్చడానికి విద్య చాలా ముఖ్యం. విద్య, నైపుణ్య శిక్షణ లేకపోవడం వ్యాపార అభివృద్ధి సేవలు, అభివృద్ధిపై సమాచారంతో సహా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ అందించే మద్దతు సేవలకు వారి ప్రాప్యతను పరిమితం చేస్తుంది. మహిళా పారిశ్రామికులకు కుటుంబ పరంగా మద్దతు లేకపోవడంతో మహిళలు పారిశ్రామికవేత్తగా ఎదుగుదలకు కష్టమవుతుంది. ఇన్ని సమస్యలు మహిళలలకు ఉన్నప్పటికీ, అనేక మంది విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఉన్నారు, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను సమతుల్యం చేస్తూ తమ వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదగడానికి అన్ని అడ్డంకులను అధిగమించాలనే వారి అంకితభావమే మహిళల పట్ల ప్రజల దృక్పథాన్ని చాలా వరకు మార్చింది . ప్రపంచ బ్యాంకు, దాని దాత దేశాలు, అలాగే ప్రముఖ వ్యాపార సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఎన్జిఓలు ఇప్పుడు మహిళల యాజమాన్యంలోని వ్యాపారాలకు ప్రోత్సాహం, మద్దతు ఇవ్వడంపై దృష్టి సాధించాయి [5].

మూలాలు

మార్చు
  1. "The Evolution of Women Entrepreneurs". www.womenentrepreneurindia.com. Retrieved 2023-12-20.
  2. "Women Entrepreneurship: Definitions, Problems, Roles, Importance, Features, Functions, Schemes". Your Article Library (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-10-24. Retrieved 2023-12-20.
  3. Gillman, Matthew (2022-04-11). "History of Women in Business". SMB Compass (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-12-20.
  4. homebusinessmag.com https://homebusinessmag.com/blog/success-stories-blog/women-entrepreneurs-history-women-business/. Retrieved 2023-12-20. {{cite web}}: Missing or empty |title= (help)
  5. "Challenges of Women Entrepreneurs". OpenGrowth (in ఇంగ్లీష్). Retrieved 2023-12-20.