మహీధర పిడుగు దేవర పుస్తకం

మహీధర పిడుగు దేవర పుస్తకం మహీధర నళినీమొహన్ ప్రముఖ రచయిత. ఈయన పాపులర్ సైన్స్ రచనలు రాయడంలో ప్రసిద్ధుడు. తనకు తెలిసిన శాస్త్ర పరిజ్ఞానాన్ని పొందికైన పదాల్లో సామాన్యుల భాషలో రాయడంలో ఈయన చేసిన కృషి చెప్పుకోదగ్గది. సుప్రసిద్ధ నవలా రచయిత, పాత్రికేయుడు మహీధర రామమోహనరావు ఈయన తండ్రి. బహు గ్రంథకర్త అయిన మహీధర జగన్మోహనరావు ఈయన పినతండ్రి. పదిహేనవ ఏటినుండి కవిత్వ రచనలో ప్రవేశం ఉన్న నళినీ మోహన్ జనరంజక విజ్ఞానాన్ని దాదాపు 30 పుస్తకాలు, పిల్లల కోసం 12 పుస్తకాలు, మరికొన్ని రచనలు చేశాడు.

మహీధర జనరంజక శాస్త్రీయ పుస్తకాలలో నిప్పు కథ, టెలిగ్రాఫు కథ, టెలిఫోను కథ, రాకెట్టు కథ, గ్రహణాల కథ, కేలెండర్ కథ, పిడుగు దేవర కథ పాఠకులలో బాగా ప్రసిద్ధి చెందాయి. పిడుగుదేవర కథ పొలంపనులు చేసుకొనే ప్రతివ్యక్తీ, సాధారణ ప్రజలు అందరూ చదివి ప్రమాదాలనుండి ప్రాణాలు కాపాడుకొనేందుకు ఎంతో సహాయపడుతుంది. పిడుగు దేవర కథలో పిడుగులు ఎందుకు ఏ పరిస్థితుల్లో పడతాయి? పిడుగులు పడేసమయంలో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిడుగులు ఆకాశం నుంచి భూమిమీద మాత్రమే పడతాయా? లేక భూమినించి ఆకాశంలోకి కూడా పోతాయా? పిడుగులు ఎటువంటి వస్తువుల మీద సాధారణంగా పడతాయి, పడినపుడు, ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ పుస్తకంలో సులభమయిన భాషలో సోదాహరణంగా వివరించాడు. మన పెద్దలు పిడుగులు పడేమయంలో అర్జున ఫల్గుణ అనే శ్లోకం చదివితే పిడుగు మనమీద పడకుండా దూరంగా ఎక్కడో పడుతుందని భావించేవారు. కానీ అసలు విషయం అదికాదు. భూమి, ఆకాశంలో విద్యుత్తు యొక్క ధన, రుణ సమతౌల్యం మారితే, చెదిరిపోతే, మరల దాన్ని సరిచేసుకోడానికి వేల వేల వోల్టుల ధన ఋణ విద్యుత్తు మబ్బులనుండి భూమిమీదకు ప్రవహిస్తుంది. అలా ప్రవహిస్తున్న సమయంలో మార్గమద్ధ్యంలోని ఆక్సిజెన్ లేదా ప్రాణవాయువు మండి మెరుపుతీగలు, ఆ మంటవల్ల పెద్ద శబ్దాలు ఉరుములు ఏర్పడతాయి. విద్యుత్తు భూమిమీదకు ప్రవహించే సమయంలో దానికి ఏదోఒక అతి దగ్గర మాధ్యమం, లేదా మార్గం కావాలి, అదీ విద్యుత్తు సులభంగా ప్రవహించే(good conductor of electricity) వాహకం-చెట్టు, పశువు, మనిషిని ఎంచుకోవచ్చు, లేదా ఎత్తయిన భవనాలు, వృక్షాలు, మయిదానప్రదేశాల్లో మాధ్యమం ఏమీ లేకపోతే పశువులు, మనుషుల మీదుగా భూమిలోకి వెళ్ళిపోతుంది. ఆ క్రమంలో వేల volatల విద్యుత్తు వాటిలోపలనుంచి ప్రవహించడం వల్ల జీవమున్న చెట్లు, జంతువులు, మనుషులు కాలి చచ్చిపోతారు. భవనాలు కూలిపోతాయి. అందుకోసమే ఎత్తయిన భవనాలమీద, గుడిగోపురాలమీద థండర్ exrakter పిడుగులను ఆకర్షించడానికి నెలకొల్పుతారు. మహీధర కొన్ని జాగ్రత్తలు చెబుతాడు. ఉరుములు, మెరుపులు వాతావరణం భయంకరంగా ఉన్న సమయంలో ఇంటిపట్టున ఉండడం మేలు. పొలంలో, దారిలో ఉంటే ఎత్తయిన చెట్లక్రింద, ఒకేకవక చెట్టుఉంటే డానికింద నిలబడగూడదు. పిడుగు కచ్చితంగా దనిమీదే పడవచ్చు. మయిదానంలో ఏమీ ఆచ్చాదన లేకపోతే పిడిగులు పడుతున్న సమయంలో నేలమీద పండుకోడం క్షేమం. పిడుగుకు మాధ్యమం, అదీ మంచి విద్యుత్ వాహకం అవసరం. కారు, బస్సులో ఉంటే క్రింద దిగకూడదు. పిడుగు పడినా tyrlaల గుండా క్షేమంగా విద్యుత్తు భూమిలోకి వెళ్ళిపోతుంది. పిడుగు దేవర కథలో ఇంకా అనేక వివరాలు, విశేషాలు ఉన్నాయి.

మూలాలు:పిడుగు దేవర కథ, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, విజ్ఞాన్‌ భవన్‌, హైదరాబాదు - 500 001.