మహేంద్ర ప్రసాద్‌ భారతదేశానికి చెందిన పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు. ఆయన 7సార్లు రాజ్యసభకు, ఒక సారి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అరిస్టో ఫార్మాస్యూటికల్స్‌ వ్యవస్థాపకుడైన మహేంద్ర ప్రసాద్‌ రూ.4,078 కోట్ల ఆస్తులతో అత్యంత సంపన్న ఎంపీగా నిలిచాడు.[1]

మహేంద్ర ప్రసాద్

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
మే 1985 – డిసెంబర్ 2021
నియోజకవర్గం బీహార్

వ్యక్తిగత వివరాలు

జననం (1940-01-08)1940 జనవరి 8
గోవిందపూర్, జహానాబాద్ జిల్లా,బీహార్ రాష్ట్రం, భారతదేశం
మరణం 2021 డిసెంబరు 27(2021-12-27) (వయసు 81)
ఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీ జనతాదళ్‌ (యునైటెడ్‌)

రాజకీయ జీవితం

మార్చు

అరిస్టో ఫార్మాస్యూటికల్స్‌ వ్యవస్థాపకుడైన మహేంద్ర ప్రసాద్‌ 1980లో కాంగ్రెస్‌ పార్టీ తరపున లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆయన బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావం తగ్గడంతో జనతాదళ్‌ పార్టీలో అనంతరం రాష్ట్రీయ జనతా దళ్‌లో, తిరిగి జనతాదళ్‌ (యునైటెడ్‌)లో చేరాడు. మహేంద్ర బిహార్‌ నుంచి 7 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[2]

మహేంద్ర ప్రసాద్‌ అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని తన నివాసంలో 27 డిసెంబర్ 2021న మరణించాడు. [3][4][5]

మూలాలు

మార్చు
  1. ETV Bharat News (23 July 2020). "వైకాపా రాజ్యసభ సభ్యుల్లో 50% మందిపై తీవ్రమైన కేసులు". Archived from the original on 28 డిసెంబరు 2021. Retrieved 28 December 2021.
  2. The Indian Express (27 December 2021). "King Mahendra: The medicine baron who became JDU's longest-serving RS MP" (in ఇంగ్లీష్). Archived from the original on 28 డిసెంబరు 2021. Retrieved 28 December 2021.
  3. Namasthe Telangana (27 December 2021). "మహేంద్ర ప్రసాద్‌ కన్నుమూత". Archived from the original on 28 డిసెంబరు 2021. Retrieved 28 December 2021.
  4. Prajasakti (28 December 2021). "మహేంద్రప్రసాద్‌ కన్నుమూత". Archived from the original on 28 డిసెంబరు 2021. Retrieved 28 December 2021.
  5. Sakshi (28 December 2021). "రాజ్యసభ ఎంపీ మహేంద్రప్రసాద్‌ కన్నుమూత". Archived from the original on 28 డిసెంబరు 2021. Retrieved 28 December 2021.