మహేంద్ర భట్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ఆ తరువాత 2024లో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మహేంద్ర భట్
మహేంద్ర భట్


పదవీ కాలం
2 ఏప్రిల్ 2024 – ప్రస్తుతం
ముందు అనిల్ బలూని
నియోజకవర్గం ఉత్తరాఖండ్

భారతీయ జనతా పార్టీ, ఉత్తరాఖండ్ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
29 జులై 2022
ముందు మదన్ కౌశిక్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2017 – 2022
ముందు రాజేంద్ర సింగ్ భండారీ
తరువాత రాజేంద్ర సింగ్ భండారీ
నియోజకవర్గం బద్రీనాథ్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2002 – 2007
నియోజకవర్గం నందప్రయాగ్

వ్యక్తిగత వివరాలు

జననం (1971-08-04) 1971 ఆగస్టు 4 (వయసు 52)
రాజకీయ పార్టీ బీజేపీ

జననం, విద్యాభాస్యం

మార్చు

మహేంద్ర భట్ 1971లో బ్రాహ్మణ తాలా చమోలీలో జన్మించి తన మాధ్యమిక విద్యను రిషికేశ్ లోని భారత్ భారత్ మందిర్ ఇంటర్ కాలేజ నుండి, పండిట్ లలిత్ మోహన్ శర్మ ప్రభుత్వ కళాశాల నుండి ఉన్నత విద్యను పూర్తి చేశాడు.[1]

రాజకీయ జీవితం

మార్చు

మహేంద్ర భట్ 1991లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1991 నుండి 96 వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌కు సంయుక్త కార్యదర్శిగా పని చేశాడు. ఆయన 1994 నుండి 1998 వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌లో టెహ్రీ శాఖ డిపార్ట్‌మెంట్ ఆర్గనైజేషన్ మంత్రిగా, 1998లో బీజేపీ యువమోర్చా కార్యదర్శిగా నియమితులయ్యాడు.

మహేంద్ర భట్ 2000 నుండి 2002 వరకు యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2002 నుండి 2004 వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా, 2002లో తొలిసారిగా నందప్రయాగ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత 2017లో జరిగిన ఎన్నికలలో బద్రీనాథ్ నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన ఉత్తరాఖండ్ చార్‌ధామ్ దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డు అంచనా కమిటీ, హౌసింగ్ కమిటీ, మైగ్రేషన్ కమిటీ, హామీ కమిటీలలో సభ్యుడిగా పని చేశాడు.

మహేంద్ర భట్ 2022లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యాడు.[3][4] ఆయన 2024లో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5]

మూలాలు

మార్చు
  1. आज तक (12 February 2024). "Mahendra Bhatt Biography: कौन हैं महेंद्र भट्ट? जिन्हें राज्यसभा भेज रही BJP" (in హిందీ). Archived from the original on 21 May 2024. Retrieved 21 May 2024.
  2. India Today (11 March 2017). "Uttarakhand election result 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  3. The Economic Times (30 July 2022). "BJP appoints Mahendra Bhatt its Uttarakhand unit chief". Archived from the original on 21 May 2024. Retrieved 21 May 2024.
  4. India TV (30 July 2022). "BJP appoints Mahendra Bhatt as its new President of Uttarakhand" (in ఇంగ్లీష్). Archived from the original on 21 May 2024. Retrieved 21 May 2024. {{cite news}}: Missing |author1= (help)
  5. The Times of India (21 February 2024). "State BJP chief Mahendra Bhatt wins RS election unopposed". Archived from the original on 21 May 2024. Retrieved 21 May 2024.