మహేశ్వర సూత్రములు

ఈసూత్రములకు మాహేశ్వర సూత్రములు అని పేరు ఉంది. పాణిని ధ్యానించగా ఈశ్వరుడు ప్రత్యక్షమై తన ఢక్కను 14 సార్లు వాయించెననియు, దానివలన ఈ వర్ణములు పుట్టి సూత్రరూపమును పొందెననియు, నందికేశ్వరకౌశిక అను గ్రంథమున ఉంది. వీటివలనే వ్యాకరణము పుట్టెనని చెప్పుదురు.

పాణిని
1. అ ఇ ఉ ణ్
2. ఋ ఌ క్
3. ఏ ఓ జ్
4. ఐ ఔ చ్
5. హ య వ ర ట్
6. ల ణ్
7. ఞ్ మ జ ణ న మ్
8. ఝ భ ఞ్
9. ఘ ఢ ధ ష్
10. జ బ గ డ ద శ్
11. ఖ ఫ ఛ ఠ థ చ ట త వ్
12. క ప య్
13. శ ష స ర్
14. హ ల్
వృత్తావసానే నటరాజరాజౌ
ననాద ఢకాంనవపంచవారం,
ఉద్ధర్తుకామః సనకాదిసిద్ధా
నేతద్విమర్సే శివసూత్రజాలం.

ఇందుకల ప్రతిసూత్రముయొక్క కొసపొల్లు వర్ణములను ఈశ్వరుడు పాణిని యొక్క శాస్త్రమందలి ఉపయోగముకొరకు స్వయముగా కూర్చెనట.

అత్ర సర్వత్ర సూత్రేష్యంత్యం వర్ణచతుర్దశం
ధాత్వరధం సముపాదిష్టం పాణిన్యాదీష్టసిద్ధయే.

శాకటాయనుడు అను వ్యాకరణ గ్రంథకర్త ఇదమక్షరచ్చందః అని వర్ణములకు వేదతుల్యత్వము చెప్పినాడు. అందువలన వీటిని పఠించినప్పుడు వేదము చదివినందు వలన కలుగు ఫలము కలుగును అను నానుడి.అంతియే కాక వీటిని చదువుట వలన అదృష్టప్రయోజనము కలదని పాణిని చెప్పియున్నాడు.

ప్రత్యాహరములు మార్చు

ఈ పద్నాలుగు సూత్రాలలోనూ చివర్లో అచ్చులు లేని హల్లు వినిపిస్తుంది. చివరి అక్షరంతో ఆదిమ అక్షరం ఉచ్ఛరిస్తే, ఆ చివరి అక్షరం మినహా మిగిలిన అన్ని అక్షరాలు సంగ్రహించబడుతాయి. ఉదాహరణకు, అ ఇ ఉ ణ్ సూత్రంలోని అకారాన్ని ఐ ఔ చ్ సూత్రంలోని చకారాన్ని ఉచ్చరించినప్పుడు అచ్ అనే పదం ఉత్పత్తి అవుతుంది. ఇది అ ఇ ఉ ఋ ఐ ఏ ఓ ఐ ఔ అనే అక్షరాలను సంగ్రహం చేస్తుంది. ఈ విధంగా ఉద్భవించిన అచ్ వంటి పదాన్ని వ్యాకరణంలో ప్రత్యాహార అని పిలుస్తారు. "ప్రారంభం , ముగింపుతో (ఆదిరంత్యేన సహిత)" అనే సూత్రం ప్రత్యాహార పదానికి అర్థాన్ని ఇస్తుంది. పద్నాలుగు సూత్రాలు అనేక ప్రత్యాహారాలకు దారితీస్తాయి. మొత్తం వ్యాకరణం ప్రత్యాహారాల ఆధారంగా రూపొందించబడింది.

కొన్ని ప్రత్యాహారములు మార్చు

  • అక్ - అ ఇ ఉ ఋ ఌ
  • యణ్ - య వ ర ల
  • అచ్ - అన్ని అచ్చులు
  • హల్ - అన్ని హల్లులు

ప్రత్యాహార నియమాలు మార్చు

  • ప్రత్యాహార సూత్రం చివరిలో ఉన్న అక్షరాన్ని తీసుకోదు.
  • ఆదిమ వర్ణం అనే సూత్రంలో ముందున్న వర్ణమని భావించరాదు. కానీ ఇది కొన్ని సమూహాల ప్రారంభంలో ఉన్న మొదటి అక్షరం అని అర్థం. దీనికి ఉదాహరణగా ఇక్ వల్ చెప్పవచ్చును.
  • ప్రత్యాహారాల ద్వారా అచ్చులు గ్రహించబడితే, వాటితో పాటు హల్లులు కూడా గ్రహించబడతాయి.
  • ప్రత్యాహారాల ద్వారా హల్లులు గ్రహిస్తే, అక్కడ పదే పదే వినిపించే అకారం కనిపించదు.

ప్రత్యాహారాల సంఖ్య మార్చు

ఈ పద్నాలుగు మహేశ్వర సూత్రాలతో 281 ప్రత్యాహారాలు చేయవచ్చు: 14*3 + 13*2 + 12*2 + 11*2 + 10*4 + 9*1 + 8*5 + 7*2 + 6*3 + 5*5 + 4*8 + 3*2 + * 3 + 1*1 - 14 (పాణిని ఏకాక్షర ప్రత్యాగారాన్ని అంగీకరించడు) -10 (రెండు హకారాలు ఉన్నందున 10 కృత్రిమ ప్రత్యాహారం అవుతుంది). అయితే, పాణిని 41 ప్రత్యాహారాలను మాత్రమే ఉపయోగించాడు.