మాంటేక్ సింగ్ అహ్లూవాలియా

ఆయన కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రికి సమానంగా భావించే ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. అంతకు మునుపు ఆయన ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ అనే సంస్థ తరఫున ఇండిపెండెంట్ ఎవాల్యువేషన్ ఆఫీసుకు డైరెక్టరుగా పనిచేశాడు.

మాంటేక్ సింగ్ అహ్లూవాలియా (జననం 1943 నవంబరు 24) భారతదేశానికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, సివిల్స్ అధికారి. ఆయన కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రికి సమానంగా భావించే ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. మే 2014 యూపీఏ రెండో విడత పాలన అంతమైన తరువాత ఆ పదవికి రాజీనామా చేశాడు.[1] అంతకు మునుపు ఆయన ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ అనే సంస్థ తరఫున ఇండిపెండెంట్ ఎవాల్యువేషన్ ఆఫీసుకు డైరెక్టరుగా పనిచేశాడు.[2]

మాంటేక్ సింగ్ అహ్లూవాలియా
మాంటేక్ సింగ్ అహ్లూవాలియా


ప్లానింగ్ కమీషన్ ఉపాధ్యక్షుడు
పదవీ కాలము
జులై 6, 2004 – మే 26, 2014
ముందు కె.సి పంత్

వ్యక్తిగత వివరాలు

జననం (1943-11-24) 1943 నవంబరు 24 (వయస్సు: 77  సంవత్సరాలు)
ఢిల్లీ
జీవిత భాగస్వామి ఐషర్ జడ్జ్ అహ్లూవాలియా
పూర్వ విద్యార్థి ఢిల్లీ విశ్వవిద్యాలయం (బియ్యే)
మాగ్డలీన్ కళాశాల, ఆక్స్ ఫర్డ్
(ఎంఏ) & సెయింట్ ఆంటోనీ కళాశాల, ఆక్స్ ఫర్డ్ (ఎంఫిల్)
వృత్తి ఆర్థిక వేత్త
సివిల్స్ అధికారి
మతం సిక్కు మతం

బాల్యం, విద్యాభ్యాసంసవరించు

మాంటేక్ సింగ్ 1943 లో ఢిల్లీలోని ఒక పంజాబీ కలాల్ కుటుంబంలో జన్మించాడు. సికిందరాబాదులోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూలు, ఢిల్లీలో మధుర రోడ్డులోని ఢిల్లీ పబ్లిక్ స్కూలులో చదువుకున్నాడు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కళాశాల నుంచి బియ్యే ఆనర్స్ పూర్తి చేశాడు. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మేగ్డలీన్ కళాశాల నుంచి తత్వశాస్త్రం, రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రాలలో ఎమ్.ఏ పట్టా పొందాడు.[3] తరువాత ఆక్స్ ఫర్డ్ లోని సెయింట్ ఆంటోనీ కళాశాల నుంచి ఎంఫిల్ పూర్తి చేశాడు. ఆక్స్ ఫర్డ్ లో చదివేటప్పుడు అక్కడ ప్రతిష్ఠాత్మక ఆక్స్ ఫర్డ్ యూనియన్ కు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇవి కాక ఆయనకు మరెన్నో గౌరవ డాక్టరేట్లు లభించాయి. వీటిలో కొన్ని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ సివిల్ లా, ఐఐటీ రూర్కీ నుంచి గౌరవ డాక్టరేటు మొదలైనవి. మేగ్డలీన్ కళాశాలకు గౌరవ అతిథి కూడా.[4]

మూలాలుసవరించు

  1. "Planning Commission Deputy Chairman Montek Singh Ahluwalia Resigns". NDTV. Retrieved 21 May 2014.
  2. "Planning Commission". Government of India. Archived from the original on 25 జూలై 2013. Retrieved 1 July 2013. Check date values in: |archive-date= (help)
  3. See R.W. Johnson, Look Back in Laughter: Oxford's Postwar Golden Age, Threshold Press, 2015.
  4. http://www.magd.ox.ac.uk/people-at-magdalen/