మదారి కురువ ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితా లో 31 వ ఉపకులం. [1] [2]

ఉనికి

మార్చు

పూర్వికులు సంచార జీవులు అని,గొర్రె/మేకల పోషణ/కాపరులు , వీరి కుల వృత్తి (దాసప్పలు) బిక్షాటన సమీప గ్రామాలు తిరుగుతూ ధన, ధాన్య, వస్త్ర తదితర వస్తువులు స్వీకరించి గడస్తంభ తిలకము నామము దిద్ది దాతల కుటుంబం ఆయు ఆరోగ్యం సిరి సంపదలు పొందవలెనని దేవుని ప్రార్థించి ఆశీర్వదించి గోవింద నామ స్మరణం చేయుచూ అక్కడ నుండి నిష్క్మరించి. ఒక ఇంటి నుండి మరొక ఇంటికి తిరిగి బిక్షాటన చేయుచుండే వారు. వీరు నుదుట త్రినామ కలగి ఒక చేత ఆఖండ జ్యోతి గడ స్తంభం దరించి మరో చేతిలో గుండ్రని పంచ లోహ బిల్ల(జాగటి) పై ఆరు అంగులాల కర్రతో నాదం చేస్తు దైవ నామ సంకీర్తనలు చేయు వైష్ణవ మత ప్రచారకులు, వీరి కీర్తనలు మెచ్చి సమర్పించు ధన ధాన్య వస్త్ర తదితర వస్తువులు భిక్ష రూపములో లేక బహుమతి రూపములో పొందుతారు. ఇట్టి వీరికి స్థిరాస్తులు, స్థిర నివాసము ఉండేవి కావు, గొర్రె/మేకల పోషణ/కాపరులు వారి ప్రవృత్తి. వారి కులస్తుల(మదారి కురువ) శుభ, అశుభ కార్యములు నిర్వర్తించి, వారి నుండి తగు పారితోసికం పొందెటివారు, వీరిని స్తానిక ప్రజలు సర్వ సాధారనంగా కురువ అని పిలుస్తారు. మదారి కురువ అని పూర్తి కులం పెరుతో పిలువరు.

ఉద్యమాలు

మార్చు

మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల్‌, అలంపూర్, మహబూబ్ నగర్, జడ్చర్ల , కల్వకుర్తి , అచ్చంపేట ,నాగర్ కర్నూలు, వనపర్తి తో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో ఇతర ప్రాంతాల లో మాదారికురువ, మాదాసికురువలు అధిక సంఖ్యలో ఉన్నారు.ఎస్సీ జాబితాలో ఉన్న తమకు కుల పత్రాలు ఇవ్వాలని కోరుతూ వీరు అనేక సంవత్సరాలు గా ఉద్యమిస్తున్నారు.

మూలాలు

మార్చు
  1. "బి.సి.టైమ్స్. ఆర్గ్ లో కులం ఉనికి" (PDF). Archived from the original (PDF) on 2015-07-01. Retrieved 2015-05-20.
  2. "THE CONSTITUTION (SCHEDULED CASTES) ORDER, 1950 (C.O.19)". Archived from the original on 2009-06-19. Retrieved 2015-05-20.