సృష్టిలో మానవత్వాన్ని (Humanity) మించిన మతం లేదంటారు. మానవత్వం లేని మతం రాణించదు. మతాలన్నీ మానవత్వాన్ని కలిగి వుండమని తప్పక బోధిస్తాయి. మానవత్వం లేని భక్తులకు స్వర్గం లభించదు .

మానవత్వంతో పేదలకు ఆహారం, దుస్తులు అందజేస్తున్నమానవతావాదులు
మానవత్వం అంటే
  • కరుణ (బాధితులపట్ల కనికరం చూపటం)
  • ప్రేమ (కులమతాలకు అతీతంగా మనుషులందరినీ ప్రేమించటం),
  • దయ ( ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం)
  • అహింస ( హింసకు పాల్పడకపోవటం)
  • మానవ ప్రేమే మానవ ఆదర్శం
  • ఇతర విలువల కంటే మానవ విలువలే మిన్న
  • వసుధైక కుటుంబ నిర్మాణం జరగాలి
  • మానవతావాదం సాంప్రదాయిక మతసిద్ధాంతాలకు విరుద్ధమైనది
  • మానవతావాదం పరిణామ సూత్రంగా అన్ని అవరోధాల్ని అధిగమిస్తుంది

మానవతావాద కవితలు

మార్చు
  • మనిషి చేసిన రాయి రప్పకి మహిమ గలదని సాగి మొక్కుతు మనుషులంటే రాయిరప్పలకన్న కనిష్ఠం గానూ చూస్తావేల బేలా? దేవుడెక్కడో దాగెనంటూ కొండకోనల వెతుకులాడేవేలా? కన్ను తెరచిన కానబడడో? మనిషి మాతృడియందు లేడో? యెరిగి కోరిన కరిగి యీడో ముక్తి?--గురజాడ
  • మానవాళికి నిజంగానే మంచి కాలం రహిస్తుందా? దారుణ ద్వేషాన్ని పెంచే దానవత్వం నశిస్తుందా? సాధుసత్వపు సోదరత్వపు స్వాదుతత్వం జయిస్తుందా-- (శ్రీశ్రీ)
  • మానవతా మందిరాన మంటలు రగిలించకూడదు -- గంగినేని
  • 'ఏ కులము వెన్నెలది? తెమ్మెద లెట్టి జాతికి చెందినట్టివి అట్టిదే కద మానవత్వము అన్నిటికి ఎత్త్తెన సత్వము -- సి.నారాయణరెడ్డి
  • మీ ధ్వంస మనస్తత్వం లోంచే మిమ్ము సర్వనాశనం చేసే మహోగ్ర మానవతా విప్లవ శక్తి జనిస్తుంది' --దేవిప్రియ
  • మానవత్వం మాత్రం ప్రతిరోజూ ప్రతిక్షణం పుట్టిచచ్చే వెలుగుకిరణం మానవత లేని లోకాన్ని స్తుతింపలేను మానవునిగా శిరసెత్తుకు తిరగలేను ఈ నాగరికతారణ్యవాసం భరించలేను..'--చెరబండరాజు'
"https://te.wikipedia.org/w/index.php?title=మానవత్వం&oldid=4313641" నుండి వెలికితీశారు