మానసిక రుగ్మత (Mental disorder - మానసిక వైకల్యం, Mental illness - మానసిక అనారోగ్యం) అనగా మనస్సుకు సంబంధించిన ఒక అనారోగ్యం. మానసిక రుగ్మతతో ఉన్న ప్రజలు వింతగా ప్రవర్తిస్తారు, లేదా ఇతరుల దృష్టిలో వీరు వింత ఆలోచనలను కలిగి ఉన్న వారుగా వుంటారు. మానసిక అనారోగ్యం వ్యక్తి జీవితకాలంలో పెరుగుతుండవచ్చు లేదా తగ్గుతుండవచ్చు. ఇది జన్యువులతో, అనుభవంతో ముడిపడి ఉండవచ్చు. మొత్తం మీద మానసిక రుగ్మత మారుతూ ఉంటుందని భావించాలి.