మామిడిపూడి రామకృష్ణయ్య

మామిడిపూడి రామకృష్ణయ్య తెలుగు రచయిత.

జీవిత విశేషాలు

మార్చు

రామకృష్ణయ్య నెల్లూరు జిల్లా కోవూరు తాలూకాకు చెందిన పురిణి గ్రామంలో వేంకటేశయ్య, నరసమ్మ దంపతులకు 1896 జూలై 26న జన్మించాడు. అతనితో పాటు అతని సహోదరులు 16 మంది. వారు -విమల, లక్ష్మీవెంకటకృష్ణన్, సరస్వతి, దశరథరాం, రామ, మైత్రేయి, కృష్ణమూర్తి, తులసి, జానకి, రోహిణి, శ్రీనివాస్, వెంకటేష్, లలిత, పట్టాభిరాం, శ్రీరాం లు. అతని భార్య ఇందిరమ్మ. ఈమె తల్లి దండ్రులు అల్లాడి మహాదేవశాస్త్రి, మీనాక్షి ల కుమార్తె. [1]

రామకృష్ణయ్య న్యాయవాద వృత్తి నిర్వహిస్తూ రచనలు చేస్తుండే వాడు. శ్రీ మద్వాల్మీకి రామాయణ కథా కథనాన్ని గ్రంథస్థముయవలసినదిగా అతని మిత్రులు ప్రోత్సహహించారు. ఆ ప్రకారమే రామకృష్ణయ్య వాల్మీకి రామాయణ కథను "శ్రీమద్వాల్మీకి రామాయణ కథామృతం" శీర్షికతో తెలుగులో, సులభ వచనాశైలిలో రాసి ప్రచురించి, గ్రంథాన్ని తమ సోదరుడు, పేరొందిన చరిత్రకారుడు మామిడిపూడి వెంకటరంగయ్య కి అంకితం చేశాడు[2]. ఈ గ్రంథం మొదట 1961లో ప్రచురించబడింది. చిత్రకారుడైన ఆతని కుమారుడు కృష్ణమూర్తి ఈ పుస్తకానికి ముఖచిత్రాన్ని వేసాడు.

అతని మరొక రచన శ్రీ భగవద్గీతామృతం. సామాన్య సాధకులు వారి దైనందిన జీవితాలలో భగవద్గీత సందేశాన్ని అన్వయించుకొని, వారు ఉన్నత మార్గంలో పయనించేందుకు దోహదపడే రీతిలో ఈ గ్రంథాన్ని రాశాడు. దీనికి ఆంగ్ల అనువాదాన్ని కూడా వెలయించాడు. ఈ రెండు అతని జీవితకాలంలోనే అచ్చయ్యాయి.

రామాకృష్ణయ్య కుమారులు మళ్లీ 2014లో ఈ మూడు గ్రంథాలను చాల కళాత్మకంగా, వర్ణ చిత్రాలతో, హైదరాబాదు కళాజ్యోతి ప్రస్ లో అచ్చువేయించి పంచి పెట్టారు.

వనరులు

మార్చు
  • vikrama simhapuri madala sarwaswam, Srimad Bhagavadgeeta, author: M.Ramakriaswhnaiah, Kalajyoti Process pvt Ltd, HYs.2013.
  • శ్రీమద్ భగవద్గీతామృతము, మామిడిపూడి రామకృష్ణయ్య, రామన్న పబ్లికేషన్స్, హైదరాబాద్,2014.
  • శ్రీమద్ వాల్మీకి రామాయణ కథామృతము(మూడు సంపుటాలు), మామిడిపూడి రామకృష్ణయ్య, చామన్న పబ్లికేషన్స్, హైదరాబాద్, 2016.

మూలాలు

మార్చు
  1. "మున్నుడి".
  2. SRI MAMIDIPUDI RAMAKRISHNAIAH (1995). SRI MADVALMIKI RAMAYANA KADHAMRUTHAMU. CCL, ROP HYDERABAD, HYDERABAD PAR INFORAMTICS. MAMIDIPUDI DASARATHARAM.