మారెళ్ల కేశవరావు (జూలై 3, 1924 - జూన్ 23, 1993) సుప్రసిద్ధ వాయులీన విద్వాంసులు.

వీరు ఒడిషా రాష్ట్రంలోని బరంపురంలో జన్మించారు. పుట్టుకతోనే అంధులైన వీరు విజయనగరం చేరారు. అక్కడ మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో పనిచేస్తున్న ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వద్ద శిష్యరికం చేసి వాయులీనంలో ప్రావీణ్యత సంపాదించారు.