మాలతి నాటకాన్ని గుత్తిభాస్కర రామచంద్రరావు రచించాడు. రామాయణ ఇతివృత్తాన్ని నేరుగా అనుసరించకున్నా రామాయణ పాత్రలు, విశేషాలు ధ్వనించేలా రాయడం విశేషం.[1]

గుత్తిభాస్కర రామచంద్రరావు

ఈ పుస్తకం కాకినాడ నందు సుజన రంజనీ ముద్రాక్షరశాల యందు పోతాప్రగడ బ్రహ్మానందరావు చే 1909లో ముద్రించబడినది.

విశేషాలు మార్చు

ఈ పుస్తకం పీఠికను కొక్కొండ వెంకటరత్నం పంతులు రాసాడు పీఠికలో అతను ఈ నాటకం కల్పిత కథ అనీ, వ్యంగ ప్రధాన మగుటచేత ఆ వ్యంగ్యము శ్రీదద్రామాయణముగా స్పురించబడుతున్నట్లు తెలియజేసాడు. ఈ నాటికలో కథానాయకుడు కోసల దేశాధిపతి, చక్రవర్తి మనోభిరాముడు అయినందున రామాయణంలో రాముని పాత్రగా తోస్తున్నది. కథానాయకి మాలతి వసుమతీ కుమార్తె అయినందున సీత యని స్పురించుచున్నది. వసుమతీ భర్త అయిన వసువర్మ జనకరాజుగా, మనోభిరాముని తల్లి ప్రభావతి రాముని తల్లి కౌసల్యగా, కథానాయకుని మేనమామ వీరసేనుడుఇ వానర సేనాపతి అయిన సుగ్రీవునిగా, భల్లూకభట్టు రామాయణంలోని జాంబవంతునిగా, గురువు కౌశికుడు విశ్వామిత్రునిగా భావింపబడుతుంది. మాలతి మేనమామ కొడుకు భీమవర్మ దొంగలరాజుగా దుష్టబుద్ధి కలిగి యుండి మాలతీ స్వయంవరమందు పరాజితుడైనాడు. అతను దుష్ట రావణునిగా, భీమవర్మ మారీచునిగా దూచును. వృషుడు విభీషణుడనియు, నర్మద త్రిజట యని పోలిక యున్నది.

ఈ రూపకం శ్రీ మద్రామయణ కథయే ధ్వనిగా కలదగుటచే ఇందలి గ్రహించవలసిన అంశములు వేరుగా చెప్పవలసిన అవసరం లేదు.

మూలాలు మార్చు

  1. గుత్తిభాస్కర రామచంద్రరావు (1909). మాలతి.

బయటి లింకులు మార్చు