మావల మండలం
మావల మండలం, తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలం.[1] మావల, ఈ మండలానికి కేంద్రం. ఇది ఆదిలాబాదు నుండి 6 కి. మీ. దూరంలో ఉంది.ఇది ఆదిలాబాదు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన మండలం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. ఈ మండలంలో 4 గ్రామాలున్నాయి.[2] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం ఆదిలాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.
మావల మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, మావల మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°38′12″N 78°30′34″E / 19.636666°N 78.509379°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఆదిలాబాద్ జిల్లా |
మండల కేంద్రం | మావల |
గ్రామాలు | 31 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 331 km² (127.8 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 40,428 |
- పురుషులు | 20,406 |
- స్త్రీలు | 20,022 |
పిన్కోడ్ | 504001 |
కొత్త మండల కేంద్రంగా గుర్తింపు
మార్చుఇంతకుముందు మావల గ్రామం అదిలాబాదు రెవెన్యూ డివిజను పరిధిలోని అదిలాబాదు మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మావల గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా, తిరిగి అదిలాబాదు రెవెన్యూ డివిజను పరిధిలోనే కొనసాగిస్తూ 1+03 (నాలుగు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4]
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 35 చ.కి.మీ. కాగా, జనాభా 40,428. జనాభాలో పురుషులు 20,406 కాగా, స్త్రీల సంఖ్య 20,022. మండలంలో 9,463 గృహాలున్నాయి.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
- ↑ "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2020-01-28.