మాస్తి వెంకటేశ అయ్యంగార్

కన్నడ రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత

మాస్తి వెంకటేశ అయ్యంగార్ ప్రముఖ కన్నడ రచయిత. ఆయన తన రచనకు భారతీయ సాహిత్య రంగంలో అత్యుత్తమ పురస్కారమైన భారతీయ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్నారు. కన్నడ భాషలో చిన్నకథల రచనలో ప్రసిద్ధులు. ఆయన చిన్నకథల పుస్తకానికి "కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం" పొందారు. శ్రీనివాస కలం పేరుతో ఆయన రచనలు చేశారు. కన్నడ సాహిత్యరంగంలో మాస్తి కన్నడద ఆస్తి(మాస్తి కన్నడకు ఆస్తి) అన్న సూక్తి బహుళ ప్రచారం పొందింది.

మాస్తి వెంకటేశ అయ్యంగార్
33 KB
మాస్తి వెంకటేశ అయ్యంగార్
జననం6 జూన్ 1891
మరణం6 జూన్ 1986
బెంగలూరు
వృత్తిమైసూర్ సివిల్ సర్వీసెస్ అధికారి
ఉద్యోగంకృష్ణరాజ వడియార్-4(మైసూర్ మహారాజు)
మతంహిందూ

వృత్తి, జీవిత విశేషాలుసవరించు

మాస్తి వెంకటేశ అయ్యంగార్ 1891లో నేటి కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లాలోని కోసహళ్ళిలో జన్మించారు. కళాశాల విద్యను అభ్యసించిన మాస్తి మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో ఎం.ఎ. పొందారు. మైసూరు మహారాజా ప్రభుత్వంలో మైసూరు సివిల్ సర్వీసెస్ లో చేరి కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. అంచెలంచెలుగా జిల్లా కమీషనర్ బాధ్యతల్లో పనిచేశారు. దివాన్ పదవికి అన్ని విధాలా అర్హుడైనా తనకన్నా తక్కువ సంవత్సరాల సర్వీసు ఉన్న సహోద్యోగికి ఆ పదవిని ఇవ్వడాన్ని నిరసిస్తూ రాజీనామా చేశారు.

మరణంసవరించు

ఈయన బెంగళూరు లో 6 జూన్ 1986 న చనిపోయాడు.

రచన రంగంసవరించు

కన్నడ సాహిత్యంలో చిన్నకథల ప్రక్రియ వికాసంలో మాస్తి వెంకటేశ అయ్యంగార్ ది ప్రాధాన పాత్ర. తొలుత ఇంగ్లీష్ భాషలో రచనలు చేసిన మాస్తి అనంతరం కన్నడ భాషలో రాయడం ప్రారంభించారు. పలు నవలలు, నవలికలు, చిన్న కథలు తదితర ప్రక్రియల్లో మాస్తి ఎన్నో రచనలు చేశారు. ఆయన 17 ఆంగ్ల పుస్తకాలు, 123 కన్నడ గ్రంథాలు రచించారు.

రచనలుసవరించు

  1. చిక్కవీర రాజేంద్ర [1]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. భారత డిజిటల్ లైబ్రరీలో చిక్కవీర రాజేంద్ర పుస్తక ప్రతి.[permanent dead link]