మా ఇంటికి రండి
మా ఇంటికి రండి 1983 డిసెంబరు 3న విడుదలైన తెలుగు సినిమా. లలిత కళాంజలి పతాకం కింద వాకాడ సూర్యకాంతం, జాస్తి శ్రీవిద్య లు నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. భానుచందర్, సుహాసిని, కోడిరామకృష్ణ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1] కోడి రామకృష్ణ కథానాయకుడిగా నటించిన మొదటి సినిమా ఇది. ఇంతకు ముందు కాలేజీ రోజుల్లో ఎన్నో రంగస్థల నాటకాల్లో నటించాడు.
మా ఇంటికి రండి (1983 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
తారాగణం | సుహాసిని , కోడి రామకృష్ణ |
నిర్మాణ సంస్థ | లలిత కళాంజలి |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- భాను చందర్,
- సుహాసిని,
- అరుణ,
- గొల్లపూడి మారుతీరావు
- ముచ్చెర్ల అరుణ
సాంకేతిక వర్గం
మార్చు- సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
- ప్లే బ్యాక్: పి. సుశీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
- సంగీతం: జెవి రాఘవులు
- నిర్మాతలు: వాకాడ సూర్యకాంతమ్మ, జాస్తి శ్రీవిద్య
- దర్శకుడు: కోడి రామకృష్ణ
- బ్యానర్: లలిత కళాంజలి పిక్చర్స్
పాటలు
మార్చు- ఒక గీతం మ్రోగింది ఒక నాట్యం సాగింది ఈ గీతం - ఎస్.పి. బాలు
- కోకిలమ్మా కోకిలమ్మా కొమ్మను విడిచేవా - ఎస్.పి. బాలు
- మందోయమ్మా మందు ఆ మాటలు లేత మందు - ఎస్.పి. బాలు
- మా ఇంటికి రండి మా ఇంటికి రండి - పి. సుశీల,ఎస్.పి. బాలు బృందం
మూలాలు
మార్చు- ↑ "Maa Intiki Randi (1983)". Indiancine.ma. Retrieved 2022-12-22.