మా ఊరి సిన్మా 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ మంజునాథ సినిమాస్ బ్యానర్‌పై జి.మంజునాధ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు శివరాం తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.[1] పులివెందుల మహేష్, ప్రియ పాల్, మంజునాథ్ రెడ్డి, మహేష్ విట్టా ప్రధాన పాత్ర‌ల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 29న విడుద‌ల చేయగా, సినిమాను అక్టోబ‌రు 12న విడుదల చేశారు.[2][3]

మా ఊరి సిన్మా
దర్శకత్వంశివరాం తేజ
స్క్రీన్ ప్లే
  • శివరాం తేజ
కథశివరాం తేజ
నిర్మాతజి.మంజునాధ్ రెడ్డి
తారాగణం
  • పులివెందుల మహేష్
  • ప్రియ పాల్
  • మంజునాథ్ రెడ్డి
  • మహేష్ విట్టా
ఛాయాగ్రహణంధర్మ ప్రభ
కూర్పుశివరాం తేజ
సంగీతంఎస్ .కే బాజీ
నిర్మాణ
సంస్థ
శ్రీ మంజునాథ సినిమాస్
విడుదల తేదీ
2023 అక్టోబ‌రు 12
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు
  • పులివెందుల మహేష్
  • ప్రియ పాల్
  • మంజునాథ్ రెడ్డి
  • మహేష్ విట్టా
  • నవనీత్
  • నేహా రెడ్డి
  • ముకేశ్
  • రమణి
  • అనంత లక్ష్మి
  • కృష్ణ మోహన్ రాజు
  • మైఖేల్ సింధు

మహేశ్ (పులివెందుల మహేశ్) డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. అతను పుట్టి పెరిగిన పల్లెటూరిలో సినిమా తీయాలని అనుకుంటాడు మహేశ్ కలను నెరవేర్చేందుకు బుల్ రెడ్డి (నిర్మాత మంజునాథ్ రెడ్డి) స్నేహితులు సహాయం చేస్తారు. మహేశ్ తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకుంటారు. వాళ్ల పెళ్లి వల్ల మహేశ్ జీవితంలో కొన్ని అనుకోని పరిణామాలు సంభవిస్తాయి. వాళ్ల పెళ్లి ఇతని జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపించింది ? మహేశ్ సినిమా తీయగలిగాడా ? ఆ సినిమా రిలీజ్ అయ్యిందా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: శ్రీ మంజునాథ సినిమాస్
  • నిర్మాత: జి.మంజునాధ్ రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటర్, దర్శకత్వం: శివరాం తేజ
  • సంగీతం: ఎస్ .కే బాజీ
  • సినిమాటోగ్రఫీ: ధర్మ ప్రభ

మూలాలు

మార్చు
  1. Sakshi (2 September 2023). "'మా ఊరి సిన్మా'వచ్చేస్తుంది". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
  2. 10TV Telugu (3 October 2023). "అక్టోబర్ 12న 'మా ఊరి సిన్మా'" (in Telugu). Archived from the original on 12 October 2023. Retrieved 12 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. HMTV (9 October 2023). "మూవీ లవర్స్‌కు మూవీ ఫెస్టివల్.. దసరా బరిలో ఏకంగా 10 సినిమాలు రిలీజ్.. ఓటీటీలో ఎన్నంటే?". Retrieved 22 October 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)

బయటి లింకులు

మార్చు