మిథునరాశి

(మిథునము నుండి దారిమార్పు చెందింది)

మిధునరాశి వారి గుణగణాలు

మార్చు
 
జెమిని జ్యోతిష్య సంకేతం

మిధున రాశి వారు హాస్యప్రియులు. తాము అనుకున్నది సామరస్యముగా సాధించడానికి ప్రయత్నిస్తారు. వ్యవహార విషయాలను కూడా తమ శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు ప్రణాళిక చక్కగా వేస్తారు. సమయానుకూలముగా మాట్లాడే నేర్పు ఉంటుంది.ున్నత స్థానాలలో ఉనా వారు, బంధు వర్గము, స్వజాతి వారు ముఖ్యమైన సందర్భాలలో మోసము చేస్తారు. బాల్యము నుండి కష్టాలు ఎత్తు పల్లాలు చూస్తారు. జీవితానుభవము, అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనము నుండి అలవడుతుంది. వివాహము, సంతానప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచి పోతుంది. మాట తప్పె మనుషుల వలన జీవితములో పని చేయించుకుని ప్రత్యుపకారము చేయని వారి వలన ఇబ్బందులు ఎదురౌతాయి. వంశపారంపర్యముగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలసి రాదు. ఇతరుల సొమ్ము మీద బమ్ధువుల ఆస్తి మీద ఆసక్తి ఉండదు. స్వార్జితము మీదే అధికముగా దృష్టి సారిస్తారు. పధకము రచించడములో దానిని అమలు చేయదములో నైపుణ్యము ఉంటుంది. కార్యక్రమాలను అమలు చేయడానికి తోడు కావాలి. ఇది వీరికి చెప్పుకోతగినంత నష్టము కలిగిస్తుంది. ఆదర్శముగా ఉండే వీరి భావాలు పలువురుకి అయిష్టత కలిగిస్తుంది. అవకాశాలను సద్వినియోగము సామధ్యము కలిగి ఉంటుంది. రాజకీయము పత్ల విపరీతమైన ఆసక్తి కలిగి ఉంటారు. శుక్రదశ, శనిదశ యోగవంతమైన కాలము. ఈ దశలలో మంచి ఫలితాలు సాధిస్తారు. జీవితములో జరిగిన నిరాదరణ భవిష్యతూకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు. తాను పడిన కష్టాలు ఇతరులు పదకూడదని భావిస్తారు. సత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయము వచ్చినప్పుడు మాత్రము ప్రతీకారము తీర్చుకోరు. సంతానముతో చక్కని అనుబంధము ఉన్నా తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నము మాత్రము చేయరు. వీరి సామర్ధ్యాన్ని, నైపుణ్యాన్ని, ఆలోచనలను ఇతరులు తిరస్కరిస్తారు. సమస్యలను పరిష్కరించే వ్యక్తుల సహకారము వీరికి ఉంటుంది. ప్రభుత్వపరముగా, చట్టపరముగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్ధము చేసుకుంటారు. చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు. అన్ని లెక్కలు వ్రాత పుర్వకముగా లేకున్నా చక్కగా గుర్తు ఉంటుంది. వివాదాలకు దూరముగా ఉంటారు కాని సమస్యలకు దూరముగా పారి పోరు. ప్రతిఘటించే తత్వము అధికముగా ఉంటుంది. వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడములో శ్రద్ధ వహిస్తారు. స్త్రీల వలన పురుషులకు పురుషుల వలన స్త్రీలకు పకారము జరుగుతుంది. ఐకమత్యము కొరకు గ్రూఫు రాజకీయాలను రూపుమాపడనికి అధికముగా శ్రమిస్తారు. జీవితములీ రెండు విధముల వృత్తి ఉద్యోగాలను చేసే నైపుణ్యము ఉంటుంది. ప్రధాన విద్యకంటే మధ్యలో నెర్చుకున్న విద్య జీవితానికి అధికముగా ఉపయోగపదుతుంది. సన్నిహితుల వలన, బంధువుల వలన ఇబ్బమ్దులకు గురి ఔతారు. గతాన్ని గురిమ్చి అధికముగా ఆలోచించడము తగ్గించుకుంటే ఉన్నత స్థితికి చేరుకుంటారు. దంపతులు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడియున్నది ఈ రాశి ద్విశ్వభావ రాశి .. సన్నని పాదాలు నిశిత మైనటువంటి దృష్టి కలిగి ఉంటారు. ఇతరులు అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిధున రాశి గురించి మరిన్ని రహస్యాలు కోసం https://dasamiastro.com/mithuna-rasi/ చూడండి

మిధునరాశి జ్యోతిష విషయాలు

మార్చు

మిధున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి. జూన్ మాసం సగము నుండి జూలై మాసం సగం వరకు దినంలో లగ్నారంభ రాశి. దీనికి అధిపతి బుధుడు, స్వభావం ద్వి స్వభావం, లింగం పురుష, సమయము రాత్రి, ఉదయం శీర్షోదయం, జీవులు మానవులు, శబ్దం అధిక, తత్వం వాయువు, వర్ణం ఆకుపచ్చ, పరిమాణం సమ, జాతి వైశ్య, దిక్కు పడమర, సంతానం సమ, కాలపురుషుని అంగము బాహువులు, రాశి పురుష, విషమ, ప్రకృతి వాతం.

ఈ రాశి సంబంధిత వృత్తులు సాంకేతికములు, వార్తలు మొదలైనవి. అంటే టెలి ఫోన్లు, సమాచార కేంద్రములు, రేడియోలు ఆకాశవాణి కేంద్రములు, విమానములు విమానాశ్రయాలు, వాతావరణంఅ కేంద్రములు, వాణిజ్య కేంద్రములను, రైల్వేలు రైల్వే వాణిజ్య విభాగంలను సూచిస్తుంది. వార్తలు, వారపత్రికలు, ప్రచురణాధిపతులను సూచిస్తుంది. ఈ రాశి వారు పొడగరులు. ఈరాశి ఉబ్బసము, క్షయ, దగ్గు, ఫ్లూ జ్వరము మొదలైన రోగాలకు కారణము.

వనరులు

మార్చు