మిధున లగ్నం

మార్చు
  • సూర్యుడు ;- మిధున లగ్నానికి సూర్యుడు తృతీయ స్థానాధిపతి ఔతాడు. సూర్యుడు లగ్నంలో ఉన్న కారణంగా ముఖవర్ఛస్సు ఉంటుంది. అందం, ఆకర్షణ, ఉదారస్వభావం కలిగి ఉంటారు. సాహసము, ధైర్యము, పురుషలక్షణం అధికంగా ఉండును. బాల్యంలో
  • కుజుడు :- మిధున లగ్నానికి కుజుడు షష్టమ, ఏకాదశ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు కనుక అకారక గ్రహంగా అశుభఫలితాలను ఇస్తాడు. మిధున లగ్నములో కుజుడు ఉంటే వ్యక్తి పరాక్రమవంతుడు, శక్తివంతుడుగా ఉంటాడు. అస్థిర జీవితాన్ని గడపవలసిన పరిస్థితి ఎదురౌతుంది. యాత్రచేయుటలో ఆసక్తి ఉంటుంది. రక్షణవ్యవస్థలో రాణిస్తారు.

తల్లి తండ్రుల నుడి సహకారం లభించదు.శత్రువుల వలన కష్టాలను చవి చూస్తారు. లగ్నస్థ కుజుని దృష్టి సప్తమ భావం మీద ఉంటుంది కనుక వైవాహిక జీవితంలో కష్టములు ఎదురౌతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యసమస్యలు ఉంటాయి.

  • బుధుడు :- మిధున లగ్నానికి లగ్నాధిపతి అయిన బుధుడు శుభఫలితాన్ని ఇస్తాడు. మిధునలగ్నంలో ఉన్న బుధుడు వ్యక్తికి వాక్ధాటి, మంచి జ్ఞాపక శక్తి కలవారై ఉంటారు.

వీరు సహజంగానే వ్యాపార మేళుకువలో నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు ధనసంపాదనా మార్గాలను మార్చుతుంటారు కనుక ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వీరు రచయితగా, లేఖకునిగా, సంపాదకునిగా సఫలతను పొందుతారు. జీవిత భాగస్వామి నుండి ప్రసన్నత సహకారం లభించును.

  • గురువు :- మిధున లగ్నంలో గురువు సప్తమ, దశమ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. ద్వకేంద్రాధిపత్య కారణంగా గురువు అకారక గ్రహంగా అశుభ ఫలితాలను ఇస్తాడు.

లగ్నంలో గురువుతో బుధుడి చేరి ఉన్న అశుభ ఫలితాలు కొంత తక్కువగా ఉంటాయి. గురువు లగ్నంలో ఉండి వ్యక్తికి అందమైన శ్వేత వర్ణం కలిగిన శరీరాన్ని ప్రసాదిస్తాడు. దగ్గు, జలుబు వంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. స్తయ వాక్కు, జ్ఞానం, చాతుర్యం కలిగిన వ్యక్తిగా ఉంటారు. సమాజంలో గౌరవం మర్యాద లభించును. గురువు తాను కాకత్వం వహించే విషయాలలో శుభఫలితాలు ఇస్తాడు. పుత్ర స్థానం, పంచమ స్థానం అయిన తుల, సప్తమ స్థానమైన ధనసు, నవమ స్థానమైన కుంభం మీద దృష్టిని సారిస్తాడు కనుక పుత్రులు, జీవిత భాగస్వామి, తండ్రి నుండి అనుకూలత లభిస్తుంది.

  • మిధున లగ్నానికి శుక్రుడు పంచమ, ద్వాదశాధిపతి ఔతాడు. త్రికోణాధిపత్యం వహిస్తాడు కనుక శుభఫలితాన్ని ఇస్తాడు. మిధున లగ్నంలో మిత్ర స్థానమున ఉన్న శుక్రుడు శుభఫలితాన్ని ఇస్తాడు. మిధున లగ్నంలో శుక్రుడు ఉన్న వ్యక్తి సన్నగా నాజూకుగా అందంగా ఉంటాడు. భౌతిక సుఖాలపట్ల వీరు అత్యంత ఆసక్తులుగా ఉంటారు.

సుఖంగా ఉండడానికి ధనవ్యయం అధికంగా చేస్తారు. సమాజంలో గౌరవం ప్రాప్తిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉంటుంది. లగ్నస్థ శుక్రుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవిత భాగస్వామి మీద ప్రేమ కలిగి ఉంటారు. వివాహేతర సంబంధాలు ఉండవచ్చు.

  • శని :- మిధున లగ్నానికి శని అష్టమ, నవమ స్థానాధిపత్యం వహిస్తాడు. త్రికోణ స్థానాధిపత్యం వలన అష్టమ స్థానాధిపత్య దోషం ఉండదు. అందువలన శని మిధున లగ్నకారులకు శుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నస్థ శని ఆరోగ్య సమస్యలకు గురి చేస్తాడు. వాత, పిత్త, చర్మ రోగములు కలిగిస్తాడు. శని భాగ్య స్థానాధిపతి కనుక శనీశ్వరుడి మీద భక్తి కలుగుతుంది. లగ్నస్థ శని తృతీయ స్థానం శతృ స్థానం అయిన సింహం మీద, సప్తమ స్థానం అయిన ధనసు మీద, దశమ స్థానం అయిన మీనం మీద దృష్టిని సారిస్తాడు కనుక కామం కనిష్ఠ సోదరులతో విరోధం, కామం అధికంగా ఉండుట, ప్రభుత్వ పరమైన దండన అనుభవించుట కలుగవచ్చు. తల్లి తండ్రులతో సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉండవు. పరిశ్రమించగల గుణం ఉంటుంది.
  • రాహువు :- రాహువుకు మిధునం మిత్ర స్థానం. ఈ కారణంగా వ్యక్తి మేధావిగా, కార్యకుశలత కలిగి ఉంటారు. కుశలతతో కార్యాలను చేపడతారు. ఆరోగ్యం, ఆకర్షణ కలిగిన శ్శరీరం కలుగుతుంది. సాహసం అధికంగా ఉంటుంది. మిధున లగ్న జాతక స్త్రీలకు సంతానం పొందుటలో స్మస్యలను ఎదుర్కొంటారు. రాహువు పూర్ణ దృష్టిని సప్తమ స్థానం మీద సారిస్తాడు కనుక వైవాహిక జీవితంలో కలహాలు చోటు చేసుకుంటాయి.
  • కేతువు :- మిధున లగ్నంలో కేతువు వ్యక్తికి స్వాభిమానం కలిగిస్తాడు. స్వతంత్రంగా పని చేసే సామర్థ్యం ఉండదు. ఇతరులతో చేరి పని చేయుటలో ఆసక్తి కలుగి ఉంటారు.

వ్యాపారం చేయుటలో కోరిక ఉంటుంది. అలాగే ఉద్యోగం అందు ఆసక్తి ఉంటుంది. స్వార్ధం అధికంగా ఉంటుంది. వాత పిత్త రోగములు బాధిస్తాయి. కామం ఎక్కువ, వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. వివాహానంతరం కూడా వివాహేతర సంబంధాలు కొనసాగుతాయి.

మూలాలు

మార్చు