మిన్నసోటా హిందూ దేవాలయం
మిన్నసోటా హిందూ దేవాలయం, అమెరికాలోని మిన్నసోటా రాష్ట్ర రాజధాని మిన్నియాపాలిస్ మెట్రోపాలిటన్ ఏరియాలో ఉన్న హిందూ దేవాలయం. 43,000 చదరపు అడుగుల స్థలాన్ని కలిగి ఈ దేవాలయం యునైటెడ్ స్టేట్స్‌లోని అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఒకటిగా నిలిచింది.[1]
మిన్నసోటా హిందూ దేవాలయం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం: | మిన్నసోటా |
ప్రదేశం: | మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ |
అక్షాంశ రేఖాంశాలు: | 45°08′47″N 93°30′40″W / 45.146346°N 93.511142°W |
చరిత్ర
మార్చు1979లో అరుణ్ షిరోల్ ఆధ్వర్యంలో నిర్మాణం జరిగింది. 1983లో డా. కుముద్ & శశికాంత్ సానే ఆధ్వర్యంలో స్థాపించబడింది.[2] ఆ తరువాతి సంవత్సరాలలో విరాళాల రూపంలో దేవతామూర్తుల విగ్రహాలు ఇవ్వబడ్డాయి.
21 చిన్న గుడులు నిర్మించడంకోసం హిందూ దేవాలయం కూల్చివేయబడింది.[3] ప్రస్తుతం, దేవాలయం ప్రక్కనే ఉన్న 60 ఎకరాల వ్యవసాయ భూమిని కమ్యూనిటీ ఉపయోగం కోసం సీనియర్ హౌసింగ్, కాండోస్, స్టాఫ్ క్వార్టర్స్, స్కూల్ సోలార్ ఎనర్జీ ఫామ్, యోగా రిట్రీట్ సెంటర్ వంటి వాటిని అభివృద్ధి చేయనున్నారు.[4]
ఇతర వివరాలు
మార్చుఇక్కడున్న 40,000 మంది హిందువులకు ఆధ్యాత్మిక కేంద్రగా ఉన్న ఈ దేవాలయం, ఒకేసారి 5,000 మంది వ్యక్తులకు వసతి కల్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ ప్రధాన హిందూ పండుగలన్నీ జరుపబడుతాయి.
మూలాలు
మార్చు- ↑ "Hindu Mandir The Hindu Temple of Minnesota". Minneapolis Northwest. Archived from the original on 2020-11-28. Retrieved 2022-03-06.
- ↑ "Hindu Society of Minnesota > About HSMN > Our History". www.hindumandirmn.org. Archived from the original on 2021-03-03. Retrieved 2022-03-06.
- ↑ Crann, Tom (14 July 2006). "Hindu Temple rises from a Minnesota Cornfield". mprnews. Retrieved 2022-03-06.
- ↑ "Hindu Temple has Big Plans for 60 acres in Maple Grove". Star Tribune. 16 December 2016. Retrieved 2022-03-06.