మీగడ పాల నుంచి ఉత్పత్తి అయ్యే పదార్థం. ఏకరీతిగా ఉన్న పాల నుంచి కొవ్వు పదార్ధములను విడదీసిన మీగడ ఏర్పడును. ఏకరీతిగా ఉన్న పాలను తగినంత సమయం సెగ చేయడం ద్వారా తేలికగా ఉన్న కొవ్వు పదార్ధాలు విడగొట్టబడి పైకి తేలుతాయి. పరిశ్రమలలో మీగడను పాల నుంచి త్వరితగతిన వేరు చేయడానికి అపకేంద్ర యంత్రంను ఉపయోగిస్తారు. వీటిని విభజన యంత్రాలు అంటారు. చాలా దేశాలలో మీగడను భద్రపరచి అమ్మడం కోసం వెన్నకొవ్వును కావలసినట్టుగా అనేక శ్రేణులలో తయారు చేస్తారు. మీగడను ఎండబెట్టి పొడిగా తయారు చేసి దగ్గర మార్కెట్లకే కాక దూర ప్రాంతాలలోని మార్కెట్ కు కూడా ఎగుమతి చేస్తారు.[1][2]పాలు నుండి స్కిమ్ చేసిన క్రీమ్‌ను "స్వీట్ క్రీమ్" అని పిలుస్తారు. పాల విరుగుడు మీగడలో తక్కువ కొవ్వు పదార్ధం ఉంటుంది. అది ఎక్కువ ఉప్పగా, చిక్కగా, "చీజీ" రుచిగా ఉంటుంది.[3] అనేక దేశాలలో, మీగడ సాధారణంగా పాక్షికంగా పులియబెట్టిన అమ్ముతారు. రెండు రూపాల్లో తీపి, చేదు, ఉప్పగా ఉన్న ఈ మీగడను వివిధ వంటలలో ఉపయోగిస్తారు.

A milk bottle showing cream risen to the top

మూలాలు మార్చు

  1. "Nutrition for Everyone: Basics: Saturated Fat - DNPAO - CDC". www.cdc.gov. Archived from the original on 29 జనవరి 2014. Retrieved 16 జూన్ 2017.
  2. Choices, NHS. "Eat less saturated fat - Live Well - NHS Choices". www.nhs.uk. Retrieved 16 June 2017.
  3. ""Everything Is In Butter" - Kosher". 8 June 2013. Retrieved 16 June 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=మీగడ&oldid=3881856" నుండి వెలికితీశారు