ఇలవేనిళ్ మీనా కందసామి (జననం 1984) భారతీయ కవయిత్రి, కాల్పనిక రచయిత్రి, అనువాదకురాలు, సామాజిక కార్యకర్త. తమిళనాడు లోని చెన్నైకు చెందినది ఆమె.[1] ఆమె ఎక్కువగా స్త్రీవాదం, కుల వ్యతిరేకతల గురించి రాస్తూ ఉంటుంది. సమకాలీన సమాజంలోని కుల వ్యవస్థ గురించి ఆమె రచనలు ఉంటాయి.

మీనా కందసామి
Meena Kandasamy.jpg
2012లో మీనా
పుట్టిన తేదీ, స్థలంఇలవేనిళ్ కందసామి
1984 (age 35–36)
కలం పేరుమీనా
వృత్తిరచయిత్రి, సామాజిక కార్యకర్త, అనువాదకురాలు
జాతీయతభారతీయురాలు

2013 వరకు మీనా, టచ్ (2006) and మిస్. మిలిటెన్సీ (2010) అనే రెండు కవితా సంకలనాలు రాసింది. అఖిల భారత కవితల పోటీలో ఈ రెండు కవితా సంకలనాలకు ఎన్నో ప్రశంసలు లభించాయి. దళిత్ మీడియా నెట్ వర్క్ కు సంబంధించిన ఆంగ్ల ద్వైమాసిక పత్రిక ది దళిత్కు 2001 నుంచి 2002 వరకు సంపాదకురాలిగా పనిచేసింది.[2]

2008లో ఆమె సహ రచయిత ఎం.నిసార్ తో కలసి దళిత నాయకుడు అయ్యంకలి జీవిత చరిత్ర రాసింది. 2014లో ది జిప్సీ గాడెస్ ,[3] 2017లో వెన్ ఐ హిట్ యూ నవలలు రాసింది.

ఆమె ఐవా విశ్వవిద్యాలయం నిర్వహించిన అంతర్జాతీయ రచనా కార్యక్రమంలో భారతదేశం తరఫున పాల్గొంది. యుకె, కాంటెర్ బరీలోని కెంట్ విశ్వవిద్యాలయంలో చార్లెస్ వేల్స్ ఇండియా ట్రస్ట్ ఫెలోగా కూడా చేసింది.

రచనలు కాకుండా, ఆమె సామాజిక కార్యకర్తగానూ కృషి చేస్తోంది. మీనా వివిధ సమకాలీన రాజకీయ సమస్యల గురించి కూడా మాట్లాడుతుంది. కులాలు, అవినీతి, హింస, మహిళల హక్కుల గురించి ఆమె ఉద్యమిస్తోంది. మీనా తన ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా తరచూ వివిధ సామాజిక సమస్యలపై స్పందిస్తుంటుంది. ఔట్ లుక్ ఇండియా, అప్పుడప్పుడూ ది హిందూ వంటి పత్రికల్లో ఆమె కాలమ్ లు రాస్తుంది.[4] [5][6] 2012లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన బీఫ్ వివాదంలో మీనా పాత్ర కూడా ఉంది. ఆ సమయంలోనే ఆమె బాగా ప్రాచుర్యం పొందింది.[7]

తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసంసవరించు

మీనా 1984లో చెన్నైలో తమిళ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు.[1][8][9] ఆమెకు తల్లిదండ్రులు ఇల్లవేనిళ్ అని పేరు పెట్టారు. చిన్నప్పుడే కవిత్వంపై ఇష్టం పెంచుకున్న ఆమె తరువాత మీనా అని తనకు తాను పేరు పెట్టుకుంది.[10] ఆమె చెన్నైలోని, అన్నా విశ్వవిద్యాలయం నుంచి సామాజికత-భాషాశాస్త్రంలో డాక్టరేట్ చదివింది.[1] తన 17వ ఏటనే మొదటిసారి కవిత్వం రాసింది ఆమె. [11] ఆ వయసులోనే దళిత రచయితలు, నాయకులు రాసిన పుస్తకాలను ఆంగ్లంలోకి అనువాదాలు చేసేది.[12]

కెరీర్సవరించు

రచయిత్రిగాసవరించు

మీనా రచనల్లోని కథా వస్తువులన్నీ కుల వ్యతిరేకత, స్త్రీవాదం, భాషాపరమైన వ్యత్యాసం వంటి వాటి చుట్టూనే తిరుగుతుంటాయి.[13] ఆమె మొట్టమొదటి కవితా సంకలనం టచ్ ఆగస్టు 2006లో ప్రచురితమైంది. ఈ సంకలనానికి ప్రముఖ రచయిత్రి కమల సురయ్య ముందు మాట రాసింది.[1] ప్రచురణ అయిన తరువాత ఈ సంకలనం దాదాపు ఐదు వేర్వేరు భాషల్లోకి అనువాదమైంది. ఆ తరువాత సంవత్సరం ఆమె రెండో కవితా సంకలనం మిస్. మిలిటెన్సీ ప్రచురణ జరిగింది.[1] ఈ సంకలనంలో ఆమె, హిందూ, తమిళ పురాణాలను కుల వ్యతిరేకత, స్త్రీవాద కోణాలలో చూపించే ప్రయత్నం చేసింది.[14] ఆమె రాసిన ఇతర కవితలు మస్కారా, మై లవర్ స్పీక్స్ ఆఫ్ రేప్లు అఖిల భారత కవితల పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నాయి.[15]

మూలాలుసవరించు

 1. 1.0 1.1 1.2 1.3 1.4 "INDIA Being Untouchable (press release)" (PDF). Christian Solidarity Worldwide. 27 September 2010. మూలం (PDF) నుండి 18 October 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 2 March 2013. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
 2. "Poetry International Rotterdam". మూలం నుండి 2019-03-25 న ఆర్కైవు చేసారు. Cite web requires |website= (help)
 3. Maranovna, Tuppence (9 May 2014). "The Gypsy Goddess by Meena Kandasamy". tuppencemagazine.co.uk. Retrieved 9 May 2014. Cite web requires |website= (help)
 4. "Outlook India". మూలం నుండి 9 October 2016 న ఆర్కైవు చేసారు. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
 5. "The Hindu". మూలం నుండి 18 January 2016 న ఆర్కైవు చేసారు. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
 6. "Porterfolio". మూలం నుండి 10 October 2016 న ఆర్కైవు చేసారు. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
 7. "Huffington Post". Cite web requires |website= (help)
 8. Warrier, Shobha (21 May 2012). "They don't like women who are flamboyant about sexuality". Rediff.com. Retrieved 9 March 2013. Cite web requires |website= (help)
 9. Jeyan, Subash (6 March 2011). "In a language darkly..." The Hindu. మూలం నుండి 6 November 2012 న ఆర్కైవు చేసారు. Retrieved 2 March 2013. Cite uses deprecated parameter |deadurl= (help)
 10. Singh, Pallavi (8 March 2010). "Dalits look upon English as the language of emancipation". Mint. HT Media Ltd. మూలం నుండి 3 August 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 8 March 2013. Cite uses deprecated parameter |deadurl= (help)
 11. Rangan, Baradwaj (29 April 2011). "The Politics of Poetry". The Hindu. మూలం నుండి 16 October 2013 న ఆర్కైవు చేసారు. Retrieved 2 March 2013. Cite uses deprecated parameter |deadurl= (help)
 12. "Independent". మూలం నుండి 9 October 2016 న ఆర్కైవు చేసారు. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
 13. "Meena Kandasamy". The Hindu. 28 January 2013. Retrieved 8 March 2013.
 14. "Sampsonia Way". మూలం నుండి 9 October 2016 న ఆర్కైవు చేసారు. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
 15. "Poetry collection". The Hindu. 19 February 2007. Retrieved 3 March 2013.

బయటి లంకెలుసవరించు