ముక్తగచ్చ శివాలయం
ముక్తగచ్చ శివాలయం బంగ్లాదేశ్‌లో గల మైమెన్‌సింగ్ జిల్లాలోని ముక్తగచ్ఛా రాజ్‌బారి వెలుపల ఉన్న ఒక జంట దేవాలయం. ఈ ఆలయాన్ని మహారాజా శశికాంత ఆచార్య చౌదరి తల్లి రాణి బిమోలా దేవి 1820లో నిర్మించింది. ఈ జంట దేవాలయాలలో శివుడు, కాళీ మాత మందిరాలు ఉన్నాయి. స్థానికంగా ఇక్కడ కార్తీక మాసంలో 'షాట్' పూజ అని పిలువబడే రెండు రోజుల పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ ఆలయం మరమ్మతులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది.[1]
ముక్తగచ్చ శివాలయం | |
---|---|
సాధారణ సమాచారం | |
ప్రదేశం | ముక్తగచ్చ ఉపజిల్లా, మైమిసింగ్ జిల్లా |
భౌగోళికాంశాలు | 24°46′03″N 90°15′21″E / 24.7674°N 90.2558°E |
చరిత్ర
మార్చురాణి బిమోలా దేవి 1820లో రెండు సుష్ట ఆలయాలు నిర్మించింది. బంగ్లాదేశ్‌లోని వారసత్వ ప్రదేశాలకు, అద్భుత నిర్మాణాలకు ఈ రెండు దేవాలయాలు గొప్ప ఉదాహరణలు. ఈ రెండు ఆలయాలలో శివుడు, కాళీదేవతలు ప్రధాన ఆరాధ్య దైవంగా ఉన్నారు. ఆచార్య రఘునందన్ చౌదరి కోడలు బిమలాదేవి తల్లి ఆనందమయి పేరు మీదుగా ఈ విశిష్టమైన కట్టడాన్ని నిర్మించారు.
ముఖ్య లక్షణాలు
మార్చుఈ ఆలయంలోని ప్రతి గది చతురస్రాకారంలో ఉంటుంది. వీటికి మండప అని పిలువబడే చదునైన పైకప్పు ఉంది. ఈ ఆలయం పైకప్పు పై గల శిఖరాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. రెండు దేవాలయాలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఆలయ ప్రధాన ద్వారం ముందు ఉత్తరాన ఒక చెరువు ఉంది.
భౌతిక లక్షణాలు
మార్చులైమ్ మోర్టార్, ప్లాస్టర్‌తో కూడిన ఇటుకలచే ఆలయ గోడలు నిర్మించబడ్డాయి. సున్నం, కాంక్రీటు, ప్లాస్టర్ లతో ఆలయ పైకప్పు నిర్మించబడింది.
పరిరక్షణ స్థితి
మార్చువర్షపు నీరు ప్రవహించడంతో ఆలయ పైకప్పుపై, గోడలపై పెద్ద పగుళ్లు ఏర్పడి, ప్రస్తుతం కూలిపోయే స్థితిలో ఉంది. గత 24 సంవత్సరాల నుండి స్థానిక అధికారులు, ఈ ఆలయం పట్ల ఎటువంటి చొరవ తీసుకోలేదు. బంగ్లాదేశ్‌లోని వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు ఉన్న ఈ ఆలయాలు అద్భుతమైన నిర్మాణాలకు గొప్ప ఉదాహరణలుగా నిలిచాయి.
సాంస్కృతిక లక్షణాలు
మార్చుఈ జంట ఆలయాలలో శివుడు, కాళీ మాత మందిరాలు ఉన్నాయి. స్థానికంగా ఇక్కడ కార్తీక మాసంలో 'షట్' పూజ అని పిలువబడే రెండు రోజుల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆలయం శిథిలావస్థకు చేరుకుంది కాబట్టి సంరక్షించకపోతే అది గుర్తింపును కోల్పోవచ్చు.
నిర్వహణ
మార్చు1993లో, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పురావస్తు శాఖ (DoA) ఆలయానికి సరైన సంరక్షణ అందించడం కోసం పురావస్తు ప్రదేశంగా జాబితా చేసింది, అయితే గత రెండు దశాబ్దాలుగా దీని పరిస్థితి మరింత దిగజారిందని స్థానికులు ఆరోపించారు. ఇప్పటి వరకు నిర్వహణకు ఎలాంటి చొరవ చూపలేదు. 1993లో, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పురావస్తు శాఖ (DoA) గత రెండు దశాబ్దాలుగా దీని పరిస్థితి మరింత దిగజారిందని పేర్కొంది. పురావస్తు శాఖ దానిని వీలైనంత త్వరగా మరమత్తులు చేస్తుందని హామీ ఇచ్చింది. ఆలయాన్ని పునరుద్ధరించడం, ప్రాంతాన్ని సక్రమంగా అలంకరించడం, మరింత అందుబాటులోకి తీసుకురావడంలో పురావస్తు శాఖ బాధ్యత తీసుకుంది. ఆర్థిక సహాయం కోసం దేవాలయ సామాజిక, మతపరమైన కార్యకలాపాల నుండి నిధులను సేకరించడం వంటి పనులు ఆలయ పునరుద్ధరణ కోసం చేస్తున్నారు.
మూలాలు
మార్చు- ↑ Islam, Aminul. "Falling to pieces: The twin temple of Muktagachha". The Daily Star. Retrieved 29 April 2012.