ముఖాముఖి దాడి
ముఖాముఖి దాడి (ఆంగ్లం: Head-on engagement) అంటే క్షిపణి గానీ, యుద్ధ విమానం గానీ శత్రు విమానానికి ఎదురుగా వెళ్తూ దాడి చెయ్యడం. ఇంగ్లీషులో దీన్ని "హెడ్-ఆన్ ఎంగేజ్‌మెంట్" అంటారు. ఈ పద్ధతిలో లక్ష్యిత విమానపు ఇంజన్ల పొగ వేడి తాకదు కాబట్టి, ఇన్‌ఫ్రారెడ్ హోమింగ్ క్షిపణులకు ముఖాముఖి దాడి చెయ్యడం కష్టం. సాధారణంగా అన్ని దిశల నుండి దాడి చేసే సామర్థ్యం ఉన్న క్షిపణులు మాత్రమే ముఖాముఖి దాడి చెయ్యగలవు. రాడార్ నిర్దేశిత క్షిపణులకు ఈ సామర్థ్యం ఉంది. అయితే, చాలా విమానాలను, ముందు భాగంలో రాడార్ క్రాస్‌సెక్షను చాలా తక్కువ ఉండేలా డిజైను చేస్తారు. ఈ కారణంగా క్షిపణి యొక్క గరిష్ఠ పరిధి నుండి రాడారు, లక్ష్యాన్ని గురి చూడలేదు.
లక్ష్యమూ, దాడి చేసే క్షిపణీ ఒకదానికొకటి ఎదురెదురుగా వస్తూంటాయి కాబటి వీటి సాపేక్ష వేగం ఎక్కువగా ఉంటుంది, అవి చాలా వేగంగా చేరువౌతూంటాయి. శత్రు విమానం మ్యాక్ 1 వేగంతోను, క్షిపణి మ్యాక్ 2.5 వేగంతోనూ ప్రయాణిస్తూంటే వాటి సాపేక్ష వేగం మ్యాక్ 3.5 ఉంటుంది. శత్రు విమానం చేసే విన్యాసాలకు, ఎత్తుగడలకూ స్పందించేందుకు క్షిపణికి తగినంత సమయం ఉండకపోవచ్చు. కాబట్టి ఈ తరహా దాడిలో క్షిపణి, తన లక్ష్యాన్ని ఛేదించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
అయితే, ముఖాముఖి దాడిలో ఒక లాభం ఉంది. క్షిపణి పరిధి బాగా ఎక్కువగా ఉంటుంది. వెంటాడి చేసే దాడితో పోలిస్తే ఇందులో క్షిపణి పరిధి మూడు నాలుగు రెట్లు ఉంటుంది.[1] ఉదాహరణకు భారత్ తయారు చేసిన అస్త్ర క్షిపణి ముఖాముఖి దాడి పరిధి 110 కి.మీ. ఉండగా, వెంటాడి చేసే దాడి పరిధి 20 కి.మీ. మాత్రమే ఉంది. లక్ష్యిత విమానం దానిపై దాడి చేస్తూన్న క్షిపణి మీదకు నేరుగా దూసుకు వస్తుంది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Clancy, Tom; Gresham, John (2007). Fighter Wing: A Guided Tour of an Air Force Combat Wing. Penguin Publishing Group. pp. 254, 255. ISBN 9781101002575.