ముఖేష్ సహాని

రాజకీయ నాయకుడు

ముఖేష్‌ సహాని బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2020 నవంబరు 16 నుండి 2022 మార్చి 27 వరకు నితీష్ కుమార్ మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రిగా పనిచేశాడు.[1][2]

ముఖేష్ సహాని

పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి
పదవీ కాలం
16 నవంబర్ 2020 – 27 మార్చి 2022
ముందు డా. ప్రేమ్ కుమార్, బీజేపీ

శాసనమండలి సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
21 జనవరి 2021
ముందు వినోద్ నారాయణ్ ఝా
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

వికాస్‌శీల్‌ ఇన్‌సాన్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 నవంబర్ 2018

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ వికాస్‌శీల్‌ ఇన్‌సాన్‌ పార్టీ
జీవిత భాగస్వామి కవిత సహానీ
సంతానం 2

రాజకీయ జీవితం మార్చు

ముఖేష్‌ సహాని 2015లో నిషాద్ వికాస్ సంఘ్ అనే సంఘాన్ని స్థాపించాడు. ఆయన 2018లో ‘వికాస్‌శీల్‌ ఇన్‌సాన్‌ పార్టీ’ని స్థాపించగా దానికి 2018 జూలై 26న కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపునిచ్చింది. 2020 బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్డీఏలో భాగ్యస్వామ్యం పక్షంలో ఎన్డీఏ కోటాలో భాగంగా 11 సీట్లను వీఐపీకి కేటాయించగా అందులో నాలుగు స్థానాల్లో ‘వికాస్‌శీల్‌ ఇన్‌సాన్‌ పార్టీ’ (విఐపీ) గెల్చింది.

ముకేశ్ సహానీ 2020లో ఎన్నికల్లో సిమరీ బఖ్తీర్పుర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు,[3] ఆయన 2020లో శాసనమండలికి జరిగిన ఎన్నికలల్లో ఎమ్మెల్యే కోటా నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[4] ముఖేష్‌ సహాని తరువాత 2020 నవంబరు 16 నుండి 2022 మార్చి 27 వరకు నితీష్ కుమార్ మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రిగా పనిచేశాడు.[5]

మూలాలు మార్చు

  1. Sakshi (28 March 2022). "బీజేపీ ఎఫెక్ట్‌.. బీహార్‌ కేబినెట్‌ నుంచి మంత్రి అవుట్‌". Archived from the original on 28 March 2022. Retrieved 28 March 2022.
  2. ACTP News (28 March 2022). "వీఐపీ అధినేత ముఖేష్ సహానీ నేమ్‌ప్లేట్ మిస్సింగ్". Archived from the original on 28 March 2022. Retrieved 28 March 2022.
  3. News18 (2020). "Simri Bakhtiarpur Assembly Election Results 2020 Live: Simri Bakhtiarpur Constituency (Seat) Election Results, Live News". Archived from the original on 28 March 2022. Retrieved 28 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. News18 (10 November 2020). "Mukesh Sahani (VIP) Election Result 2020 Live Updates: Mukesh Sahani of VIP Loses" (in ఇంగ్లీష్). Archived from the original on 28 March 2022. Retrieved 28 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. The Print (28 March 2022). "Mukesh Sahani, Bollywood set designer and BJP ally who set his political career on fire". Archived from the original on 28 March 2022. Retrieved 28 March 2022.