ముత్యాలహారాలు ప్రక్రియ

ముత్యాలహారం ప్రక్రియ ఆవిర్భావం

మార్చు

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిన శుభ తరుణంలో తెలంగాణ బిడ్డలు భాష, యాస, సాహిత్య సంపదతో  అస్తిత్వ బావుటాలను ఎగురవేశారు.   

కవులు, కళాకారులు నూతనోత్సాహంతో కొత్త కొత్త పాటలు రాయడం, పాడడం, ప్రాంతమేదైనా అనంత భావాలతో నూతన కవిత ప్రక్రియలు రూపొందించడంలో సాహితీవేత్తలు నిమగ్నమయ్యారు. తెలుగు సాహిత్యంలో కాలానుగుణంగా అనేక సాహిత్య ప్రకియాలు వెలుడడ్డాయి.

కవులు వారి రచన సౌలభ్యాన్ని బట్టి ఆయా  ప్రకియలకు శ్రీకారం చుట్టారు. ఒక్కో యుగంలో ఒక్కో ప్రక్రియ పాఠకులను బాగా అలరించి సాహిత్య ప్రస్థానంలో చిరస్థాయిగా నిలుచిపోతున్నాయి. అటువంటి ప్రక్రియలో ఉట్నూరు సాహితీ వేదిక పూర్వ అధ్యక్షులు రాథోడ్ శ్రావణ్  రూపొందించిన ప్రక్రియ "ముత్యాలహారం"

ముత్యాలహారం ప్రక్రియ ప్రస్థానం

మార్చు

అడవి జిల్లా ఎజేన్సీ ఉట్నూరు సాహితీ వేదిక ఒడిలో పుట్టిన ప్రక్రియ ముత్యాల హారం ఉట్నూరు సాహితీ వేదిక కు పూర్వ అధ్యక్షులు కైతిక కవిమిత్ర, సాహితీ ప్రావీణ్య బిరుదాంకితులు రాథోడ్  శ్రావణ్  గృహానికి హోలి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం వేళ పది నుండి హేను మంది పిల్లలు హోళి పాటలు జాజీరి.. జాజీరి..!అని పాడుతూ స్వగృహనికి వచ్చారు,పిల్లల పాటల్లో బాణీని గ్రహించిన పరిశోధకులు శ్రావణ్  జాజీరి పిల్లలతో ఐదు పాటలు వరకు పాడించారు.

ప్రతి పాదంలో అంత్యను ప్రాస పదజాలంతో పాటలు పాడుతునట్టు గ్రహించి, వారితో కలిసి అడుగులు వేస్తూ కొంత సమయం మేరకు నృత్యాలు  చేస్తూ పాటలను జానపద జాజోరీ పాటలను అనుకరించారు, పిల్లలు ఆడి పాడిన జాజీరి పాటల్లోని మహాత్మ్యమే ముత్యాలహర ప్రక్రియ రూపొందించడానికి 18.03.2021 నాడు బీజం పడింది.

ఈ ముత్యాలహారం ప్రక్రియలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సాహితీవేత్తలు విభిన్న అంశాలతో సాహితీ సేద్యం చేస్తూ వంద ముత్యాల హారాలు వరకు లిఖించిన సాహితీవేత్తలకు సాహితీ ముత్యాలహార పురస్కారం, వెయ్యికి పైగా ముత్యాల హారాలు లిఖించిన సాహితీవేత్తలకు సహస్రరత్న ముత్యాలహర  పురస్కారం రూపకర్త సౌజన్యంతో ప్రధానం చేయడం జరుగుతుంది.

ముత్యాలహారం ప్రక్రియల్లో విరివిరిగా సాహితీ సంకలనలు వెలువడుతున్నాయి. ముత్యాలహారాలు,తెలుగు సాహిత్యంలో ఓనమాలు నేర్చుకుంటున్న బాలకవులు, సాహితీవేత్తలు విభిన్న కోణాల్లో ముత్యాల హారాలను  అల్లుతున్నారు.

పురస్కారాలు ప్రధానం

మార్చు

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుండి ముత్యాల హారం ప్రక్రియలో శతాధిక ముత్యాల హారాలు, సాహస్రాధిక ముత్యం హారాలు  లిఖించిన కవులకు ఉట్నూరు సాహితీ వేదిక అధ్యక్షులు కవన కోకిల జాదవ్ బంకట్ లాల్ ప్రధాన కార్యదర్శి తెలుగు భాష ఉపన్యాసకులు  ముంజం జ్ఞానేశ్వర్  ప్రచార కార్యదర్శి ఆత్రం మోతీరామ్, రూపకర్త రాథోడ్ శ్రావణ్,  ఉసావే వ్వవస్తాపక అధ్యక్షులు  తెలంగాణ రాష్ట్ర రచయితల వేదిక ఉపాధ్యాక్షులు గోపగాని రవీందర్ గారు వ్వవస్తాపక ప్రధాన కార్యదర్శి  డాక్టర్. మెస్రం మనోహర్ బి ఇడి కళాశాల ప్రిన్సిపాల్, జీవ వైవిధ్య కమిటీ ఆదిలాబాద్ జిల్లా సభ్యులు మర్సకోల తిరుపతి, ఉసావే పూర్వ అధ్యక్షులు  కట్ట లక్ష్మణాచారి,  కొండగుర్ల లక్ష్మయ్య, డాక్టర్ ఇందల్ సింగ్, కవులు మురళి, సాకి ప్రసాంత్,  ఉసావే సభ్యులందరి నిర్ణయం సాహయ సాహకారంతో అంతర్జాలం ద్వారా సాహితీ ముత్యాలహార పురస్కారం ప్రదానం చేయడం జరుగుతుంది.

ప్రత్యేక నియమాలతో ఏర్పడి సారస్వత లోకంలో ప్రభంజనం సృష్టిస్తోంది. "ముత్యాల హారాలు " రాబోయే కాలంలో తెలుగు సాహిత్యంలో ఒక నూతన ఒరవడితో కవులకు రచయితలకు, పాఠకులకు  అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహములేదు. ఈ ప్రక్రియను చరవాణి ద్వారా పరిచయం చేసి పదిమంది కవులతో అక్షర సేద్యం చేయిస్తు కనుమరుగు అవుతున్నా తెలుగు భాషాను  రక్షించేందుకు మీ కృషి అభినందనీయమని  సాహితీవేత్తలు, భాషాభిమాన ఉట్నూరు సాహితీ వేదిక కవులు తెలియజేశారు.

■ పురస్కారాలు జాబితా:

సాహితీ ముత్యాలహార పురస్కారం

ముత్యాలహార శిరోమణి

సాహస్ర రత్న ముత్యాల హార పురస్కారం

ముత్యాలహారం రూపకర్త పరిచయం

మార్చు

రాథోడ్ శ్రావణ్ ఆదిలాబాదు జిల్లా నార్నూరు మండలం మారుముల సోనాపూర్ తాండా  కు చెందిన కవి, రచయిత ,వీరు ఇంద్రవెల్లి  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ  ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు. మాతృభాష లంబాడీయైన ఏజెన్సీ ప్రాంతంలో  సంభాషించే గోండి, కొలామి, తెలుగు, హిందీ, మరాఠీ, ఆంగ్ల, మథురా భాషలను సంభాషించడం లో ప్రావీణ్యం సాధించారు.

తెలుగు భాషా పై ఉన్న ఆసక్తితో  కవితలు, వ్యాసాలు రాయడంలో  నేర్పు సాధించి, ఉట్నూరు ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో  వ్యావహారిక భాషా పదాలతో నాలుగు పాదాలు, అంత్యానుప్రాస, మాత్రాఛందస్సుతో ఒక లఘు కవిత ప్రక్రియ *ముత్యాలహారం* ను   తెలుగు సాహితీ రంగంలో రుపోందించి, తెలుగు భాషాభివృధ్ధికై కృషి చేస్తున్నారు.

ముత్యాలహారం ప్రక్రియ లక్షణాలు

మార్చు

▪️ ముత్యాలహారం నూతన కవిత ప్రక్రియ

▪️ఇందులో  నాలుగు పాదాలుంటాయి.

▪️ 1, 2, 3, 4 పాదాల్లో చివర అంత్యానుప్రాస  ఉండాలి.

▪️ మొత్తం నాలుగు పాదంలో కూడా మాత్రలు  10 నుండి 12 వరకు ఉండాలి.

▪️ నాలుగు పాదాలు కలిపి చదివినప్పుడు భావాత్మకంగా ఉండాలి

■ ఉదాహరణలు

మామిడికాయ తరగాలి

చింత రసం చేయాలి

బెల్లం,వేప కలపాలి

పచ్చడి రుచి చూడాలి


హోళి రంగుల పండుగా

కులమతాలకు అండగా

హోళి జరుపును ఘనంగా

నృత్యం చేయు హాయిగా


హోళి పండుగ వేడుకలు

స్నేహితుల పలకరింపులు

మోదుగ పువ్వుల రంగులు

చల్లుకుంటున్న యువతులు


రక్షబంధన వేడుకలు

సంతోష పలకరింపులు

రంగురంగుల రాఖీలు

కట్టేను అక్కాచెల్లెలు


గురువు హితం బోధలు

చూపు జ్ఞాన దారులు

శిష్యుడు ఇచ్చే కానుకలు

గురువు ఆశీర్వాదాలు


గురువు జ్ఞాన వంతుడు

చుక్కల్లోని చంద్రుడు

వెలుగు నిచ్చే దేవుడు

గురువు దైవ స్వరూపుడు


ముత్యాల హారాలు

తియ్యటి ఫలహారాలు

కమ్మని పూల గంధాలు

తెలుగు తల్లి గీతాలు


అడవి తల్లి బిడ్డలం

లేలేత బుడుతలం

కవితలు రాసే కవులం

ఉట్నూరు  వాసులం

పురస్కార గ్రహీతలు

మార్చు

1) పూజితా చార్య ( 108) విజయవాడ

2.)ఆరెకటిక నాగేశ్వరరావు (140) కర్నూల్

3)కుందారపు గురుమూర్తి  (108) కడప

4.),ఉట్నూరి రాంబాబు (108) ఆదిలాబాద్

5.) మేకల విజయలక్ష్మి ( 108) గోదావరి ఖని

6.)  ధనాశి ఉషారాణి ( 108) చిత్తూరు జిల్లా

7.)సౌదరి మోహన్ గౌడ్  (108) మహబూబ్ నగర్ జిల్లా

8.) షేక్ జహిదా బేగం(287)  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.

9)మీసాల సుధాకర్ గారు (400) జనగామ జిల్లా

10)షేక్ బడా షైదా (108) ఊటుకూరు గుంటూరు జిల్లా.

11) సత్యం మొండ్రేటి (108) హైదరాబాద్

12.) షేక్ సాజీదా బేగం (108)ఖమ్మం జిల్లా

13) మక్కువ అరుణకుమారి (644)

విజయనగరం జిల్లా

14) పి ప్రసాద్  (108) నారాయణ పురం రాంబిల్లి వైజాగ్

15)అంథోల్  పుష్పలీల రేవతి (108) కూకట్ పల్లి హైదరాబాద్

16)  టి వి ఆర్ మోహన్ రావు (108)  ‌భధ్రాది కొత్త గూడెం జిల్లా

17) గాజుల భారతి శ్రీనివాస్ (108)  ఖమ్మం జిల్లా.

18) మార్గం కృష్ణమూర్తి  (241) సంగారెడ్డి హైదరాబాద్

19) గుడిపూడి రాధికారాణి  (108) మచలీపట్నం కృష్ణా జిల్లా

20)  అద్దంకి లక్ష్మీ

(130) ముంబై మహారాష్ట్ర

21) చైతన్యభారతి పోతుల  (505) హైదరాబాద్.

22)  తో.వే.శ్రీ రాహుల్ అంతర్వేది గూడెం పశ్చిమగోదావరి జిల్లా(108)

23) నిరంజనుడు వికారాబాద్ జిల్లా(280)

24)రావుల.చంద్రకళ ఖానాపూర్ నిర్మల్ జిల్లా (108)

25)గద్వాల సోమన్న ఎమ్మిగనూరు కర్నూల్ జిల్లా (2514)

26) రాథోడ్ సురేష్ దౌనేల్లితండా నిర్మల్ జిల్లా (108)

27) గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా (1020)

28) డా. జి. నిర్మాలాదేవి  (108)జహిరాబాద్, సంగారెడ్డి జిల్లా

29) పసుమర్తి నాగేశ్వరరావు (500) కర్నూల్

30) డాక్టర్ మరుదాడు అహల్యా దేవి  (1380)హైదరాబాద్

31)  విస్లావత్ సావిత్రి (108) జడ్పీ హెచ్ యస్ నెరెళ్లపల్లి మహబూబ్ నగర్ జిల్లా

32) విస్లావత్ శైలజ (108) జడ్పీ హెచ్ యస్ నెరెళ్లపల్లి మహబూబ్ నగర్ జిల్లా

33) నెనావత్  మౌనిక (108) జడ్పీ హెచ్ ఎస్ నేరెళ్లపల్లి మహబూబ్ నగర్ జిల్లా.

34)  బి. పావని (144) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరెళ్లపల్లి మహబూబ్ నగర్

జిల్లా.

35) జక్కని గంగాధర్  (142) ముంబై  మహారాష్ట్ర

36)పాత్లావత్ పురందాస్ (170) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరెళ్లపల్లి మహబూబ్ నగర్ జిల్లా.

37)ధవళే వివేక్ (108) కెరమెరి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా

38)  కాట్రావత్ దివ్య (108) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరెళ్లపల్లి మహబూబ్ నగర్ జిల్లా

39)  మేకల లింగమూర్తి (108) ఖానాపూర్ నిర్మల్ జిల్లా.

40)శనగపల్లి ఉమామహేశ్వరరావు.

(116) తెనాలి గుంటూరు జిల్లా.

41) సభావట్ చంటి (110) నేరళ్లపల్లి మహబూబ్ నగర్ జిల్లా.

42) కుసునూరు భధ్రయ్య  (3043) బోరబండ హైదరాబాద్‌.

43)  డాక్టర్  సూర్యదేవర రాధారాణి  (108)

44) పాత్లావత్ వినోద్ (100) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరెళ్లపల్లి మహబూబ్ నగర్ జిల్లా.

45)  రేణుకుంట్ల శ్రీదేవి  ( 116) కురవి మహబుబాబాద్ జిల్లా

46ఈయ్యణి పార్థసారథి అయ్యంగార్  (138) పాయకరావుపేట అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్

47.బానోత్.చెన్నారావు  పాల్వంచ భద్రాద్రి కొత్త గూడెం జిల్లా(423)

48.కాటేగారు పాండురంగ విఠల్ (130) హైదరాబాద్

49. జ్యోతి వైద్య గారు (135) విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్

50. జుక్కల శివ గారు(110) ఇంటర్ విద్యార్థి చుండురు నల్గొండ జిల్లా.

సహస్రాధికం, ముత్యాల హారాలు వ్రాసిన కవులు

మార్చు

1) కుసునూరు భధ్రయ్య  (3043) బోరబండ హైదరాబాద్‌.(3043)

2) గద్వాల సోమన్న  ఎమ్మిగనూరు కర్నూల్ జిల్లా(2514)

3) డా. మరుదాడు అహల్యా దేవి హైదరాబాద్ (1380)

4. గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా( 1230)

5. మీసాల సుధాకర్ జనగామ జిల్లా (1000)

ముత్యాల హార ప్రక్రియలో వెలువడిన పుస్తకాలు

మార్చు

1. హరిత హారం కు ముత్యాల హారం

2. బాలల ముత్యాల హారాలు

3. ముత్యాల హారాలు- జీవిత సత్యాలు

4. సుభాషితాలు ముత్యాల హారాలు

5. చెన్నారావువారి ముత్యాల హారాలు

6. పండుగలు ముత్యాల హారాలు

7.అణిముత్యాలు ముత్యాల హారాలు-

8.వెన్నెల ముత్యాల హారాలు -గుర్రాల లక్ష్మారెడ్డి

9.జ్యోతి కిరణాలు ముత్యాల హారాలు

మూలాలు

మార్చు

https://samadarshini.com/1688

https://www.molakanews.page/2022/10/blog-post_799.html?m=1

https://www.molakanews.page/2022/12/blog-post_346.html?m=1

https://www.molakanews.page/2022/12/blog-post_380.html?m=1

https://www.molakanews.page/2023/01/blog-post_492.html?m=1

http://sirimalle.com/prakriyala-parimalaalu-09/