మునెమ్మ ప్రముఖ రచయిత డాక్టర్ కేశవరెడ్డి రాసిన నవల. నవలను 2008లో ప్రచురించారు.

రచన నేపథ్యం

మార్చు

ఇతివృత్తం

మార్చు

కథని ఒక పదేళ్ళ కుర్రాడు (మునెమ్మకు మరిది వరస) చెపుతూ ఉంటాడు. మునెమ్మ ఒక పాతికేళ్ళ పడుచు. రైతు భార్య. ఆమె భర్త జయరామిరెడ్డి తన బండికి కట్టే బొల్లి గిత్తను రక్తం కారేలా కొట్టడంతో కథ ప్రారంభమవుతుంది. అతడలా కొట్టడానికి కారణం ఏమిటంటే, గడ్డి కోస్తున్న మునెమ్మ వీపుమీద బొల్లి గిత్త రెండు కాళ్ళతో గీరడంతో, ఆమె రవిక చిరిగి పోతుంది. ఆ చర్యలో జయరాముడికి లైంగికోద్రేకం కనిపిస్తుంది. దానితో జయరాముడు అగ్గిరాముడై పోతాడు.
తల్లి, మునెమ్మ, ఎంత చెప్పినా వినక జయరాముడు దాన్ని మద్దిపాలెం పశువుల సంతలో తెగనమ్మి పారేసేందుకు మర్నాడే బయలు దేరతాడు. దారిలో పోటు మిట్ట గ్రామంలో, 'తరుగులోడు'గా పేరుపడ్డ పశువుల దళారీతో కలిసి మద్దిపాలెం వెళ్ళాలని జయరాముడు నిర్ణయించుకుని కాలి నడకన బయలు దేరతాడు. రెండు రోజుల అనంతరం, జయరాముడు లేకుండా, బొల్లి గిత్త ఒక్కటే రొప్పుకుంటూ ఇల్లు చేరుతుంది. మునెమ్మ, ఆమె అత్త నిర్ఘాంతపోతారు. రోజంతా చూసినా జయరాముడు తిరిగి రాడు. పైగా ఆ రాత్రి మునెమ్మకి ఒక పీడ కల వస్తుంది. ఆ కలలో మునెమ్మ గిలక బావి నుండి నీళ్ళు తోడుతుండగా, బొక్కెనకి బదులు జయరాముడి శవం పైకొస్తుంది. అతడి మెడకి బొల్లిగిత్త మెడలో ఉండాల్సిన మునెమ్మ వెంట్రుకలతో పేనిన తాడు బిగించి ఉంటుంది. దానితో జయరాముడు ఇక లేడని మునెమ్మ నిర్థారణకొస్తుంది. బారెడు పొద్దెక్కేదాక ఏకథాటిగా ఏడుస్తుంది. తర్వాత లేచి కర్తవ్య నిర్వహణకు సన్నాహమవుతుంది. జయరాముడి ఆచూకీ కోసం వూళ్ళోని మగవాళ్ళు ఎవరు వెళతామన్నా ఒప్పుకోదు. 'కనబడకుండా పోయింది నా వాడేగదా, నేనే వెదకాల ' అని మరిదితో కలిసి బయలు దేరుతుంది.
బొల్లి గిత్త కొమ్ములకున్న మద్దిపాలెం సంత చీటీ ఆధారంగా వారి అన్వేషణ ప్రారంభమవుతుంది.

శైలి-శిల్పం

మార్చు

ప్రాచుర్యం

మార్చు

విమర్శలు

మార్చు

ఇతరుల మాటలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మునెమ్మ&oldid=1336103" నుండి వెలికితీశారు