మురళీ దేవరా (10 జనవరి 1937 - 24 నవంబర్ 2014) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త. ఆయన మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా పని చేశాడు.

మురళీ దేవరా
మురళీ దేవరా


పెట్రోలియం శాఖ మంత్రి
పదవీ కాలం
18 జనవరి 2011 – 12 జులై 2011
ముందు మణి శంకర్ అయ్యార్
తరువాత జైపాల్ రెడ్డి

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
2002 – 2014
నియోజకవర్గం మహారాష్ట్ర

వ్యక్తిగత వివరాలు

జననం 10 జనవరి 1937
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
మరణం 24 నవంబర్ 2014 (వయస్సు 77)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
సంతానం మిలింద్ దేవరా
నివాసం ముంబై
పూర్వ విద్యార్థి బొంబాయి యూనివర్సిటీ

రాజకీయ జీవితం

మార్చు

మురళీదేవరా పారిశ్రామిక కుటుంబంలో జన్మించి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన తొలిసారి ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి 1977 నుంచి 1978 వరకు ముంబై మేయర్‌గా పని చేశాడు. మురళీదేవరా ఆ తర్వాత ఆయన నాలుగు సార్లు ముంబై సౌత్‌ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మురళీదేవరా ముంబయి కాంగ్రెస్ అధ్యక్షుడుగా 22 ఏళ్లపాటు పని చేసి 2006 యుపిఏ హయాంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా పని చేశాడు.[1]

మురళీ దేవరా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2014 నవంబర్ 24న ముంబైలోని తన స్వగృహంలో మరణించాడు.[2] ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన కుమారుడు మిలింద్ దేవరా కేంద్ర కమ్యూనికేషన్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రిగా పని చేశాడు.

మూలాలు

మార్చు
  1. India Today (24 November 2014). "Murli Deora: A loyalist with rapport across political spectrum" (in ఇంగ్లీష్). Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
  2. Sakshi (24 November 2014). "కేంద్ర మాజీ మంత్రి మురళీదేవ్‌రా కన్నుమూత". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.