ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి

ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి పూర్తి పేరు ములుగు రామలింగేశ్వర వర ప్రసాద్. ఇతను జ్యోతిష్కుడు, పంచాంగకర్త. ప్రారంభంలో ఆయన ఎంఆర్‌ ప్రసాద్‌ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా గుర్తింపు పొందాడు. సినీ నటులు ఏవీఎస్‌, బ్రహ్మానందం తదితర కళాకారులతో ప్రదర్శనలు ఇచ్చాడు. జ్యోతిష్యుడుగా విశేష సేవలందింస్తూ ములుగు సిద్ధాంతిగా పేరు పొందాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. రాశిఫలాలతో పాటు, ఆయన చెప్పే జ్యోతిష్యాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం విశ్వసిస్తుంటారు. అంతేకాకుండా శ్రీకాళహస్తి ఆస్థాన జ్యోతిష పండితుడిగా, శ్రీశైలం పీఠాధిపతిగా ములుగు సిద్ధాంతి ప్రసిద్ధి. ఆయనకు శ్రీశైలంలో ఆశ్రమం కూడా ఉంది.[1]

ఆయన జనవరి 23, 2022న గుండెపోటుతో హైదరాబాదులో మరణించాడు.[2]

మూలాలు

మార్చు
  1. "ప్రముఖ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూత". ap7am.com (in ఇంగ్లీష్). Retrieved 2022-01-23.
  2. "TS news : ప్రముఖ జ్యోతిషపండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూత". EENADU. Retrieved 2022-01-23.