- ముల్లంగి దుంపలు... ఐదు
- కారం పొడి... మూడు టీ స్పూన్లు
- ఉప్పు... సరిపడా
- నూనె... తాలింపుకు సరిపడా
- ధనియాల పొడి... ఒక టీ స్పూన్
- జీలకర్ర పొడి... ఒక టీ స్పూన్
- ముందుగా ముల్లంగి దుంపలను పొట్టు తీసి సన్నగా తరుక్కోవాలి.
- తర్వాత ముల్లంగి ముక్కల్ని ఉప్పు నీటిలో కడిగి శుభ్రం చేసుకోవాలి.
- బాణలిలో నూనె పోసి నూనె వేడయ్యాక, ముల్లంగి ముక్కలు వేసి తక్కువ మంటలో బాగా వేయించాలి.
- తరువాత ఈ ముక్కలకు తగినంత ఉప్పు కలిపి వేయించాలి.
- ముక్కలు బాగా ఉడికి మెత్తబడ్డాక నూనె ఎక్కువగా ఉంటే వంపి కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి వేసి కాసేపు వేయించి దించాలి.
- అంతే ముల్లంగి వేపుడు రెడీ. దీనిని పొడి పొడిగా ఉండే అన్నానికి సైడ్‌డిష్‌గా నంచుకుంటే రుచికరంగా ఉంటుంది.