మూడవ పులమాయి
చంద్రశ్రీ తరువాత రాజై సా.శ229 నుండి 236 వరకు రాజ్యము చేసినట్లు కనబడుచున్నది.ఇతనిని చైనాదేశ చరిత్రకారులు పౌలోమిన్ (Powlomein), (Howlomein) హౌలోమిన్ అనియు పేర్కొనుచున్నది. హిందూదేశమును వారు పులిమాను దేశమని అర్ధమిచ్చునట్టి పౌలోమాంకోవె అనిపిలిచియున్నారు.
ఈపులమాయి శాసనమొకటి బళ్ళారిజిల్లా ఆదోని తాలూకా మేకదోనిలో దొరికినది. 10 అతనినాణెములుకొన్ని కాంచీపురమున దొరికినవి. పులమాయి చక్రవర్తి కాంచీపుర రాష్ట్రమునకు శివస్కంధవర్మ నాగశాతకర్ణియను నాగరాజుకుమార్తెను ఒకపహ్లవ బ్రాహ్మణుడు వివాహము చేసుకొనెనని, ఆదంపతులకు పుట్టినవానికి శివస్కంధవర్మయని పేరు పెట్టిరనియు, ఆశివస్కంధవర్మ కాలమున మాతామహుని కాంచీపురరాష్ట్రమునకు రాజైనట్లు తెలియుచున్నది.
సా.పూ 300 నాటి ఇక్ష్వాకు వంశానికి చెందిన సామ్రాజ్యంలో చివరి రాజు మూడవ పులమాయి.[1] శాతవాహన సామ్రాజ్యానికి స్థాపకుడు శ్రీముఖుడు అయితే చివరివాడు మూడవ పులమాయి.[2] ఇతని తరువాత శాతవాహనుల సామ్రాజ్యం అంతమయింది.[3]
మూలాలు
మార్చు- ↑ Gupta, Anita; Kumar, Dr Sunil (2017-06-02). Our World (in ఇంగ్లీష్). Onlinegatha. ISBN 978-93-86352-81-1.
- ↑ "Pre-Gupta Period UPSC Notes | EduRev". EDUREV.IN (in ఇంగ్లీష్). 2018-01-05. Retrieved 2020-09-13.
- ↑ "Rajapalayam Rajus in the USA". rajapalayam.us. Retrieved 2020-09-13.