రాముడు – రంగడు సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్‍గా పనిచేస్తున్న పొన్నతోట రఘురాం గారు ఒకరోజు “సుబ్బయ్యా… నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులైంది. ఏదైనా సొంతంగా సినిమా తియ్యాలని ఉంది” అనడంతో ఎన్నాళ్ళుగానో తననుకుంటున్న ఒక కథ (18 ఏళ్ళ అమ్మాయి మెడలో 8 ఏళ్ళ అబ్బాయి అనుకోకుండా తాళి కట్టడం.. తద్వారా జరిగే పరిణామాలూ) థ్రెడ్ చెప్పారు. కథ వినగానే రఘురాం గారు “ చేస్తే ఇలాంటి ఆఫ్ బీట్ సినిమానే చెయ్యాలి.. లెటజ్ గో ఎహెడ్ ” అన్నారు. దీనిని నటీనటులగా వాణిశ్రీ, బాలకృష్ణ లతో చేయాలనుకొని కొన్నికారణాల వల్ల హీరోయిన్ పాత్రకి మాధవి ని, హీరో పాత్రకి రాజేంద్ర ప్రసాద్‍ నీ తీసుకున్నారు.

మూడు ముళ్ళ బంధం
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
తారాగణం శరత్‌బాబు ,
మాధవి,
రాజేంద్రప్రసాద్
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ గోమాత ఆర్ట్ క్రియెషన్స్
భాష తెలుగు

షూటింగు అంతా రాజమండ్రి దగ్గరే మొత్తం 20 రోజులలోగా ముగిసింది. దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్య మొదటి సినిమా ఇది.

నటీనటులు

మార్చు
 • శరత్ బాబు
 • మాధవి
 • రాజేంద్రప్రసాద్
 • విజయకళ
 • సాక్షి రంగారావు
 • అత్తిలి లక్ష్మి
 • కల్పనారాయ్
 • మోదుకూరి సత్యం
 • నిర్మల

సాంకేతికవర్గం

మార్చు
 • నిర్మాతలు: రంగన అశ్వత్థనారాయణ, పొన్నతోట రఘురాం
 • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
 • సంభాషణలు: అప్పలాచార్య
 • పాటలు: సి.నారాయణరెడ్డి
 • సంగీతం: సత్యం

హీరోయిన్ పెళ్ళి పీటల మీద ఉండగా, పెళ్ళి కొడుకు చనిపోతాడు. అందరూ హీరోయిన్ నష్టజాతకురాలు అంటూ నిందిస్తారు. సవతి తల్లి కూడా శాపనార్ధాలు పెడుతుంది. ఇదంతా చూస్తున్న 8 సంవత్సరాల కుర్రాడికి ‘పాపం.. ఈ అమ్మాయిని అందరూ తిడుతున్నారు. నేనే వెళ్ళి తాళి కడితే బావుంటుంది కదా.. ఆటల్లో బొమ్మల పెళ్ళిళ్ళు ఎన్ని సార్లు చెయ్యలేదూ?’ అనుకుని తనకంటే 10 సంవత్సరాలు పెద్దదైన హీరోయిన్‍ మెడలో తాళి కడతాడు. ఆ తరువాత ఆ కుర్రాడు పెద్దవాడవడమూ, అతను మరో అమ్మాయిని ప్రేమించడమూ.. ఇలా నడుస్తుందా కథ.

పాటలు

మార్చు

పాటల రచయిత: సి నారాయణ రెడ్డి.

 1. ఆ చూపే ఒక వల ఆ రూపే వెన్నెల - ఆదినారాయణ రావు, ఎస్. జానకి
 2. కల ఎదురుగ నిలిచిందా అల ఎదలో కదిలిందా ఈ వేళ జరిగింది - పి. సుశీల
 3. తులసి కోటలో వెలిగే దీపం మాంగల్యానికి మరో రూపం - ఎస్. జానకి
 4. ప్రతి మనిషికి రెండే మనసులుంటే ఎంత బాగుండేది - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
 5. మూడుముళ్ళ బంధం ఏడేడు జన్మల బంధం - జి. ఆనంద్
 6. రారా కృష్ణయ్యా ఇటు రారా కృష్ణయ్య నీ అల్లరి పనులకు - ఎస్.జానకి, ఎస్.పి. శైలజ

ఇతర వివరాలు

మార్చు

సెన్సార్‍కి వెళ్ళినప్పుడు సినిమా ప్రివ్యూ ముగిసిన 3 గంటల వరకూ సెన్సార్ ఆఫీసర్లు ఎవరూ థియేటర్ లోంచి బయటికి రాలేదు. మూడు గంటల తర్వాత లోనికి పిలిచి “ నీకెంత ధైర్యమయ్యా ఈ కథని సినిమాగా తియ్యడానికి? ఎనిమిదేళ్ళ కుర్రాడేమిటీ.. పద్దెనిమిదేళ్ళ అమ్మాయికి తాళి కట్టడమేమిటీ.. ఈ సినిమాని బాన్ చెయ్యాలసలు ” అన్నారు. “ఎందుకు సార్? ” అని ముత్యాల సుబ్బయ్య అడిగారు. “ శారదా యాక్ట్ ప్రకారం బాల్య వివాహాలు నేరం.. వాటిని సినిమాల్లో ఎంకరేజ్ చెయ్యకూడదు ”... “ ఇది బాల్య వివాహం ఎలా ఔతుందండీ.. కుర్రాడు చిన్నవాడే కానీ, అమ్మాయి పెద్దదే కదా..! ” అని ముత్యాల సుబ్బయ్య వాదన. చివరికెలాగైతేనేం సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. ప్రివ్యూ చూసిన సినీ ప్రముఖులంతా ముత్యాల సుబ్బయ్య ధైర్యానికి షాక్ తిన్నారు. రిలీజ్‍కి ముందుకూడా డివైడెడ్ టాక్ వచ్చింది “ఇదేదో ఎక్స్పెరిమెంట్ సినిమా, యాంటీ సెంటిమెంట్ సినిమా.. ” అంటూ..! మొత్తానికి రెండు, మూడు నెలల తర్వాత 1980 అక్టోబరు ప్రాంతాల్లో విడుదలైంది. యూనిట్ అంచనాలకి విరుద్దంగా ప్రేక్షకులు సినిమాని తిరగ్గొట్టారు. ఆఫ్‍బీట్ అనుకున్న కథని ఏమాత్రం రిసీవ్ చేసుకోలేదు. ఐతే ‘మూడు ముళ్ళ బంధం’ డైరెక్టర్‍గా ముత్యాల సుబ్బయ్యకు మంచి పేరే తెచ్చిపెట్టింది. టేకింగ్‍ని కూడా అంతా మెచ్చుకున్నారు. ఎటొచ్చీ కథే ఎవరికీ నచ్చలేదు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు