మూలా నక్షత్రం
మూలానక్షత్రం, అధిదేవత నిరుతి, ఇది రాక్షసగణ నక్షత్రం, రాశ్యధిపతి కేతువు, జంతువు శునకం. ఈ నక్షత్రంలో పుట్టిన వారు శక్తిమంతులు. అసాధారాణ శక్తి వీరి స్వంతం. అసాధారణ ప్రతిభాపాటవాలు వీరి స్వంతం. చిన్న తనంలో బంధువుల నిరాదరణకు గురి ఔతారు. జీవితంలో ప్రతి మెట్టును స్వయం కృషితో సాధిస్తారు. పోటీ ప్రపంచంలో సాధించడానికి కావలసిన తెలివితేటలు వీరి స్వంతం. జీవితంలో సాధించిన ప్రతి మెట్టుకు కృతజ్ఞతలు చెప్తూ ఆగిపోక ముందుకు సాగడమే జీవితధ్యేయంగా ముందుకు సాగిపోతారు. అభివృద్ధి, ఆధిపత్యమే వీరి లక్ష్యం. బంధుత్వానికి, స్నేహాలకు, నైతిక ధర్మాలకు, దైవభీతికి వీరి మనసులో స్థానం లేదు. కుటుంబం కొరకు, తల్లి తండ్రుల కొరకు కొంత త్యాగం చేస్తారు. అణుకువగా ఉండి సంసారం అన్యోన్యంగా ఉంది అనిపించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు నిర్మొహమాటంగా నడిపిస్తారు. తాము అనుభవించిన కష్టాలు ఇతరులు అనుభవిస్తున్నప్పుడు సాయం చేయరు. తనకు తెలిసినా మంచి మార్గాలు, సూచనలు వేరొకరికి చెప్పారు. రవి, చంద్ర, కుజ దశలు యోగిస్తాయి. స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువ. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. శుభకార్యాలు చెయ్యడం కష్టతరమైన యజ్ఞం ఔతుంది. కీలక సమయాలలో బంధువర్గ అండదండలు నయనో భయానో సాధిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. భాగస్వాములు మోసగిస్తారు. ఆధ్యాత్మిక చింతన, దానగుణం సామాన్యంగా ఉంటాయి. స్త్రీ దేవతార్చన మంచిది. అరవై సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగి పోతుంది.
నక్షత్రాలలో ఇది 19వ నక్షత్రం.
నక్షత్రం | అధిపతి | గణము | జాతి | జంతువు | వృక్షము | నాడి | పక్షి | అధిదేవత | రాశి |
---|---|---|---|---|---|---|---|---|---|
మూల | కేతువు | రాక్షస | పురుష | శునకము | వేగిస | ఆది | నిరుతి | ధనసు |
మూలా నక్షత్ర జాతకుల ఫలితాలు
మార్చుతార నామం | తారలు | ఫలం |
---|---|---|
జన్మ తార | అశ్విని, మఖ, మూల | శరీరశ్రమ |
సంపత్తార | భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ | ధన లాభం |
విపత్తార | కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ | కార్యహాని |
సంపత్తార | రోహిణి, హస్త, శ్రవణం | క్షేమం |
ప్రత్యక్ తార | మృగశిర, చిత్త, ధనిష్ఠ | ప్రయత్న భంగం |
సాధన తార | ఆర్ద్ర, స్వాతి, శతభిష | కార్య సిద్ధి, శుభం |
నైత్య తార | పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర | బంధనం |
మిత్ర తార | పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర | సుఖం |
అతిమిత్ర తార | ఆశ్లేష, జ్యేష్ట, రేవతి | సుఖం, లాభం |
మూల నక్షత్రము నవాంశ
మార్చు- 1 వ పాదం - మేషరాశి.
- 2 వ పాదం - వృషభరాశి.
- 3 వ పాదం - మిదునరాశి
- 4 వ పాదం - కర్కాటకరాశి.
చిత్ర మాలిక
మార్చు-
మూల నక్షత్ర వృక్షం
-
మూలా నక్షత్ర జంతువు శునకం
-
మూల నక్షత్ర జాతి (పురుష)
-
మూల నక్షత్ర అధిపతి కేతువు (జ్యోతిషం)
-
మూల నక్షత్ర అధిదేవత నిరుతి.