మృగశిర నక్షత్రము

నక్షత్రములలో ఇది మృగశిర.

మృగశిర నక్షత్రం
నక్షత్రం అధిపతి గణము జాతి వృక్షం జంతువు నాడి పక్షి అధిదేవత రాశి
మృగశిర కుజుడు దేవ పురుష చంఢ్ర సర్పం మధ్య కోడి 1,2 వృషభం 3,4 మిధునం

మృగశిరా నక్షత్ర జాతకుల తారా ఫలాలు

మార్చు
తార నామం తారలు ఫలం
జన్మ తార మృగశిర, చిత్త, ధనిష్ఠ శరీరశ్రమ
సంపత్తార ఆర్ద్ర, స్వాతి, శతభిష ధన లాభం
విపత్తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర కార్యహాని
సంపత్తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర క్షేమం
ప్రత్యక్ తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి ప్రయత్న భంగం
సాధన తార అశ్విని, మఖ, మూల కార్య సిద్ధి, శుభం
నైత్య తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ బంధనం
మిత్ర తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ సుఖం
అతిమిత్ర తార రోహిణి, హస్త, శ్రవణం సుఖం, లాభం

మృగశిర నక్షత్రము నవాంశ

మార్చు
  • 1 వ పాదము - వృషభ రాశి.
  • 2 వ పాదము - వృషభ రాశి.
  • 3 వ పాదము - మిథున రాశి.
  • 4 వ పాదము - మిథున రాశి.

మృగశిరా నక్షత్రము గుణగణాలు

మార్చు

మృగశిరా నక్షత్రము దేవగణ నక్షత్రము. అధిపతి కుజుడు, రాశ్యాధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి. ఈ నక్షత్రజాతకులుగా అదృష్ట జాతకులుగా చెప్పవచ్చు. ఉన్నత విద్యాసంష్తలు స్థిరాస్థులు వంశపారంపర్యముగా వస్తాయి. బాల్యము విలాసవంతముగా గడుస్తుంది. స్నేహితులను ఆదరిస్తారు. చెప్పుడు మాటలను విని మంచివాళ్ళను కూడా దూరము చేసుకుంటారు. వస్తునాణ్యతను నిర్ణయిస్తారు. ప్రేమవివాహాలు కలసి వస్తాయి. ఇతరులు చెప్పేదానిని పూర్తిగా వినరు వినరు. తమకు నచ్చినదానిని, తాము నమ్మిన దానిని ధైర్యముగా చేస్తారు. ధర్మము న్యాయముగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆధునిక విద్యలలో రాణిస్తారు. కనీసమైన ప్రణాళికాబద్ధమైన జీవితములో రాణిస్తారు. నరములకు, కీళ్ళకు సంబంధించిన వైద్యములో రాణిస్తారు. అభిరుచి కలిగిన పనులు చేస్తారు. ఇది ఇతరులకు వృధాఖర్చుగా కనిపిస్తుంది. సంగీతములో రాణిస్తారు. తల్లి తంద్రులపట్ల అంతర్గత మర్యాద గౌరవము ఉంటుంది. పుత్ర సంతానము అమ్దు క్లేశము అనుభవిస్తారు. ఋణాలు త్వరగా చేస్తారు తీరుస్తారు. త్వరితగతిన అభివృద్ధికి వస్తారు. అనారోగ్యము అభివృద్ధికి ఆటంకము కాదు. దైవభక్తి అధికము. ఆయుర్భావము ఎక్కువ.

చిత్ర మాలిక

మార్చు